Best Web Hosting Provider In India 2024
Telangana ACB Latest News: గత కొంతకాలంగా తెలంగాణ ఏసీబీ(Telangana ACB) దూకుడు పెంచింది. ప్రతిరోజూ ఏదో ఒక చోట అవినీతి అధికారులు పట్టుబడుతూనే ఉన్నారు. చిన్నస్థాయి ఉద్యోగి నుంచి పైస్థాయి ఉద్యోగి వరకు కూడా ఇందులో ఉంటున్నారు. తాజాగా హైదరాబాద్ లోని పని చేస్తున్న ఓ టౌన్ ప్లానింగ్ అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. బిల్డింగ్ పర్మిషన్ కోసం రూ. 50 వేలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా… ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది ఏసీబీ.
ట్రెండింగ్ వార్తలు
మాసబ్ ట్యాంక్ లోని టౌన్ ప్లానింగ్ ఆఫీసులో జగన్మోహన్… టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. అయితే జితేంద్ర రెడ్డి అనే వ్యక్తి ఎల్బీ నగర్ పరిధిలోని చింతల్ కుంట సమీపంలో బిల్డింగ్ నిర్మాణం చేపట్టాడు. ఇందుకు అనుమతులు ఇచ్చేందుకు అతని వద్ద నుంచి రూ. 50 వేలు డిమాండ్ చేశాడు. దీంతో జితేంద్ర రెడ్డి… ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అడిగిన మేర రూ. 50 వేలు ఇచ్చేలా ముందుస్తు ప్లాన్ చేయగా… ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. రూ. 50 వేలు తీసుకుంటుండగా జగన్మోహన్ ను అరెస్ట్ చేశారు.
టాపిక్