మీరు వేసే ఓటు వల్ల తలరాతలు మారుతాయని ఆలోచించుకోండి

Best Web Hosting Provider In India 2024

పూత‌ల‌ప‌ట్టు మేమంతా సిద్ధం స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 

ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మనం ప్రభుత్వం మంచి చేయడానికి ఉపయోగించుకుంది

ఇన్ని జెండాలు, ఇన్ని పార్టీలు ఏకమవుతున్నాయి. కుట్రలు కుతంత్రాలు

జగన్‌కు, చంద్రబాబుకు యుద్ధం కాదు ఈ ఎన్నికలు

ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబు, ప్రజలకు జరుగుతున్న ఎన్నికలు

ఈ యుద్ధంలో నేను ప్రజల పక్షంలో ఉన్నాం

ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీ, హోదాను అడ్డుకున్న మరో పార్టీ అంతా చంద్రబాబు పక్షమే.

ఒక్కడిపై పోరాటానికి ఇంతమంది వస్తున్నారు

మంచివైపు నిలబడి యుద్ధం చేయడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా..?

ధర్మాన్ని గెలిపించడానికి మీరంతాసిద్ధమా?

ఈ ఎన్నికల్లో మన ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.

మంచి ఓ వైపు, చెడు మరోవైపు.. ధర్మం ఓవైపు అధర్మం మరోవైపున్నాయి.

ఓవైపు విశ్వసనీయత, మరోవైపు మోసం.. ఓవైపు నిజం, మరోవైపు అబద్దం

అబద్దం, మోసం, అన్యాయం, తిరోగమనం, చీకటిని రిటర్స్‌గిఫ్ట్‌గా ఇచ్చిన చంద్రబాబు మనముందే ఉన్నారు.

మీరు వేసే ఓటు ఐదేళ్లు అంటే 1825 రోజులు మీ భవిష్యత్‌ వారి చేతుల్లో పెట్టినట్లే.

చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది, మా ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలు ఆలోచించాలి

ఎవరి హయాంలో మంచి జరిగిందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి

ఈ ఓటు వల్ల మన తలరాతలు మారుతాయని ఆలోచించుకోండి

చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమ్‌ అయినా గుర్తు వస్తుందా

14 ఏళ్ల కాలంలో చంద్రబాబు మీ ఖాతాల్లో ఒక్క రూపాయి అయినా వేశారా?

రైతు భరోసా కేంద్రాలు నిర్మించింది ఎవరు?

ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చి ఇంగ్లీష్‌ మీడియాం తెచ్చిందెవరు?

విలేజ్‌ క్లీనిక్‌, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్‌ను ఏర్పాటు చేసింది ఎవరు?

ఇంటింటికీ పౌరసేవల్నీ డోర్‌డెలివరీ చేస్తూ పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది మీ జగన్‌

ఒకటో తేదీ ఆదివారమైనా సరే అవ్వాతాతలకు పెన్షన్లు అందించిన వాలంటీర్ల వ్యవస్థను తెచ్చింది మీ జగన్‌.

3 వేలు పెన్షన్‌ ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదు

ప్రభుత్వంపై చంద్రబాబు, కూటమి ఎంత విషయం కక్కుతున్నారో ప్రజలు చూస్తున్నారు

66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మనదే.

53 లక్షల మంది తల్లుల  అకంట్లలో అమ్మఒడి ద్వారా 26,067 కోట్లు ఇచ్చాం.
  
31 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరుతో ఇచ్చాం:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

చిత్తూరు జిల్లా:  మీరు వేసే ఓటు వల్ల రాష్ట్ర భ‌విష్య‌త్‌, మ‌న తలరాతలు మారుతాయని ఆలోచించుకోవాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. రేపు జ‌రిగే ఎన్నిక‌లు జగన్‌కు, చంద్రబాబుకు జరుగుతున్న యుద్ధం కాదు.. ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోందని ముఖ్యమంత్రి  అన్నారు. ఈ యుద్ధంలో నేను ప్రజలపక్షాన ఉన్నానన్నారు.  మంచి వైపున నిలబడి యుద్ధం చేయడానికి మీరంతా సిద్ధమా?. ప్రజలిచ్చిన అధికారంతో ప్రతి ఇంటికి మంచి చేశాం. ఒక వైపు విశ్వసనీయత, మరో వైపు మోసం.. నిజం ఒక వైపు, అబద్ధం మరో వైపు ఉన్నాయి. అబద్ధం, మోసం, అన్యాయం, తిరగోమనం, చీకటిని రిటర్న్‌ గిప్ట్‌గా ఇచ్చిన చంద్రబాబు మనముందే ఉన్నారు. ఒక్కడి పోరాటానికి ఇంతమంది వస్తున్నారు. ఇన్ని జెండాలు, ఇన్ని పార్టీల ఏకమవుతున్నాయి. కుట్రలు, కుంతంత్రాలు చేస్తున్నాయి.. ప్రత్యేకహోదా ఇవ్వని పార్టీ, హోదాలను అడ్డుకున్న మరో పార్టీ అంతా చంద్రబాబు పక్షమే. జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రం ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయ‌ని సీఎం వైయ‌స్ జగన్‌ పేర్కొన్నారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా 7వ రోజు బుధవారం సాయంత్రం చిత్తూరు జిల్లా పూతలపట్టు బైపాస్‌లో నిర్వహించిన బహిరంగ సభలో వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడారు.

సీఎం వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..
ఇప్పుడు జరుగబోయే ఎన్నికల్లో మన రాష్ట్రం ముందు, మన ప్రజల ముందు రెండు ప్రత్యామ్నాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. విశ్వసనీయత ఒకవైపు, మరోవైపు మోసం ఉంది. నిజం ఒకవైపు, అబద్ధం మరోౖÐð పు, ఇంటింటి ప్రగతి మరోవైపు, తిరుగమనం ఇంకోవైపు, మంచి ఒకవైపు, చెడు మరోవైపు, వెలుగు ఒక వైపు, చీకటి మరోవైపు, ధర్మం ఒకవైపు, అధర్మం మరోవైపు..ఈ రెండు ప్రత్యామ్నయాలు ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఇళ్లు ఆలోచన చేయాల్సిన గడియలు.

ప్రజలిచ్చిన అధికారాన్ని ఇంటింటి ప్రగతి, ఇంటింటా అభివృద్ధి, ఇంటింటా మంచి, పిల్లల భవిష్యత్‌ కోసం సత్యనిష్టతో మనందరి ప్రభుత్వం మంచి చేసి ఒక వైపు ఉంది. మరోవైపు గతంలో ఒక్కసారి కాదు..మూడుసార్లు అధికారంలో ఉన్నకూడా అబద్ధం, మోసం, అన్యాయం, తిరోగమనం, చెడు, చీకటిని ప్రజలకు రిటర్న్‌గిప్ట్‌గా ఇచ్చిన చంద్రబాబు బృందం మరోవైపు ఉంది.

ఈ ఎన్నికలు జగన్‌కు, చంద్రబాబుకు మధ్య యుద్ధం కాదు..ఈ ఎన్నికలు ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య యుద్ధం జరుగబోతుంది. ఈ యుద్ధంలో నాది ప్రజల పక్షం. ఈ యుద్ధంలో మన ప్రత్యర్థులు దత్తపుత్రుడు, ఎల్లోమీడియా, రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన పార్టీ..వీరంతా చంద్రబాబు పక్షం..వీరందరూ యుద్ధంకు వస్తున్నారు.వీరంతా మీ బిడ్డ ఒక్కడి మీద యుద్ధం చేసేందుకు వస్తున్నారు. 

ఇన్ని జెండాలు ఏకమవుతున్నాయి. కుతంత్రాలు, కుట్రలు చేస్తున్నారు. ఇటువైపు మీ బిడ్డ ఒక్కడే ఇటువైపు ఉన్నారు. మే 13న జరిగే ఎన్నికల సంగ్రామంలో మనందరి ప్రభుత్వానికి తోడుగా ఉండటంతో పేదలు, పిల్లలు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, రైతులు, బడుగులు, బలహీన వర్గాలు, మైనార్టీల తరఫున నిలబడి, వీరందరిని రక్షించేందుకు మీరంతా సిద్ధమేనా? 

ధర్మాన్ని గెలిపించడానికి, విలువలు, విశ్వసనీయత రాజకీయాలు తీసుకురావడానికి మీరంతా సిద్ధమేనా? అవినీతి జీవులను, పేదల వ్యతిరేకులను, పెత్తందార్లను ఓడించేందుకు ఏకంగా 175కు 175 అసెంబ్లీ స్థానాలు., 25 ఎంపీ స్థానాలు గెలిపించుకొని పేదల భవిష్యత్‌కు తోడుగా ఉంటూ డబుల్‌ సెంచరీని సాధించేందుకు సిద్ధమేనా?

ఇదే సమయంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నాను. ఒక మనిషి జీవిత కాలంలో ప్రతి రోజు కూడా ఎంతో విలువైంది. అలాంటిది మీరు వేసే ఓటుకు అర్థం ఏంటో తెలుసా? ఏకంగా ఐదేళ్లు అంటే 1825 రోజులు..మీ భవిష్యత్‌ వాళ్ల చేతుల్లో పెట్టినట్లే..మీ ఓటు ద్వారా వచ్చే ఐదేళ్లు అధికారం ఇవ్వడమని తెలుసుకోండి. మన ఇళ్లలో మనకు జరిగే మంచి, చెడు మన ఓటు ద్వారా వాళ్లకు ఇవ్వడమే అని ఆలోచన చేయండి.

వచ్చే ఐదేళ్లలో మన ఇంటి అభివృద్ధి, సంక్షేమం, మన పిల్లల భవిష్యత్, మన ఆదాయాన్ని ప్రభుత్వం మనం అందించే సాయాన్ని ఎవరి వల్ల మంచి జరుగుతుంది..ఎవరి వల్ల చెడు జరుగుతుందని దృష్టిలో పెట్టుకొని మీ కుటుంబం అంతా కూర్చోని ఆలోచన చేయండి. మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడండి..అభిప్రాయం తెలుసుకోండి. ఎవరి వల్ల మీకు మంచి జరిగింది? ఎవరు ఉంటే మీకు మంచి జరుగుతుందన్న ఆలోచన చేసి నిర్ణయం తీసుకొండి..తరువాతే ఓటు వేయండి. ఈ ఓటు వల్ల మీ తలరాతలు, మీ భవిష్యత్‌ మారుతుందని జ్ఞాపకం పెట్టుకోండి.

గత పదేళ్లలో అంటే చంద్రబాబు ఐదేళ్ల పాలన, మీ బిడ్డ పాలనలో ఐదేళ్లు..ఈ రెండు ప్రభుత్వాలు మీ ఇంటికి ఎలాంటి మంచి చేసిందో గమనించి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. మీ బ్యాంకు ఖాతాల స్టేట్‌మెంట్‌ తెచ్చుకొని చూడండి. మీ బ్యాంకు ఖాతాల్లో మన ప్రభుత్వం బటన్‌ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో డబ్బులు ఎంత అందించారో గమనించండి. ఎవరు మీ కుటుంబాన్ని బాగు చేసేందుకు ఏ ప్రభుత్వం ఎంత ఇచ్చారో..మీ సాధికారతకు, మీ ఆత్మగౌరవానికి ఆ డబ్బులు ఎలా ఉపయోగపడిందో ఆలోచన చేయండి. ఆ తరువాతే నిర్ణయం తీసుకోండి. ఓటు గురించి ఇంతగా ఎందుకు చెబుతున్నానో ఆలోచన చేయండి. 

14 ఏళ్లు చంద్రబాబు పాలన చూశారు..మూడుసార్లు సీఎంగా పని చేశారు. మీకు, మీ ఇంటికి ఏం చేశారో మీరంతా ఆలోచన చేస్తే..మీ బ్యాంకు ఖాతాలను గమనించండి. ఆయన పేరు చెబితే ఒక్క మంచైనా గుర్తుకు వస్తుందా?. కనీసం ఒక్క రూపాయి అయినా మీ బ్యాంకు ఖాతాల్లో వేశారా? లేదు.

అదే మీ జగన్‌ ..మీ బిడ్డ మీ ఇంటికి, మీ గ్రామానికి ఏం చేశాడు అంటే..గుర్తుకు వచ్చేందుకు ఏ గ్రామానికి వెళ్లినా గ్రామ, వా ర్డు సచివాలయాలు కనిపిస్తాయి..గవర్నమెంట్‌ బడుల్లో ఇంగ్లీషు మీడియం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌. ఆ గవర్నమెంట్‌ బడుల్లో ఇంగ్లీషు మీడియంతో మొదలు ప్రపంచ స్థాయి చదువులు, ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు, 6వ తరగతి నుచి ప్రతి గవర్నమెంట్‌ స్కూలు, క్లాసు రూపులో డిజిటల్‌ బోధన అంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌. రైతన్నలకు రైతు భరోసా, గ్రామంలోనే ఆర్బీకే, రైతన్నలకు సున్నా వడ్డీ, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, ఉచిత పంటల బీమా, సమయానికే రైతన్నకు ఇన్‌ పుట్‌ సబ్సిడీ అంటే.. గుర్తుకొచ్చేది మీ జగన్‌. 

35 లక్షల ఎకరాల మీద శాశ్వత హక్కులు ఇచ్చింది ఎవరంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు బటన్‌ నొక్కడం, నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఆ డబ్బులు వెళ్లిపోవడం, ఇందులో 75 శాతం పైచిలుకు ఈ వర్గాలకు, నా వర్గాలకు ఇచ్చింది ఎవరంటే మీ జగన్‌. రాష్ట్రంలో  ఎప్పుడూ చూడని విధంగా, రాష్ట్రం మొత్తం మీద మనం వచ్చేదాకా, 4 లక్షల ఉద్యోగాలుంటే, ఏకంగా మరో 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది ఎవరంటే మీ జగన్‌. అందులో 80 శాతం ఉద్యోగాలు నేను నా..నా..నా..నా. అని పిలుచుకునే  నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా తమ్ముళ్లు, నా చెల్లెమ్మలే అందులో ఉద్యోగస్తులుగా ఉన్నారంటే.. జరిగింది ఎప్పుడంటే, చేసింది ఎప్పుడంటే, గుర్తుకొచ్చేది ఎవరంటే మీ జగన్‌. 

 అక్కచెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, గతంలో ఎప్పుడూ జరగనట్టుగా ఇచ్చింది ఎవరంటే, జరిగింది ఎప్పడంటే, చేసింది ఎవరంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌. అందులో ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం ఎప్పుడూ జరగని విధంగా వేగంగా జరుగుతోందంటే మీ జగన్‌. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఎవరూ చూడని విధంగా, జరగని విధంగా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు తోడుగా ఉంటూ, అండగా ఉంటూ ఎప్పుడూ ఊహించని విధంగా ఓ అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, సున్నా వడ్డీ, ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, కళ్యాణమస్తు, షాదీ తోఫా.. పథకాలంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌. మహిళా సాధికారత, దిశ యాప్, ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీసు ఉందంటే.. గుర్తుకొచ్చేది మీ జగన్‌. ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో ఏకంగా 17 కొత్త మెడికల్‌ కాలేజీలు ప్రతి జిల్లాలోనూ వేగంగా నిర్మాణం జరుగుతున్నాయి.

 రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా కొత్తగా 4 సీ పోర్టులు కడుతున్నాం. కొత్తగా మరో 10 ఫిషింగ్‌ హార్బర్లు కడుతున్నాం. ఎయిర్‌ పోర్టులు, వాటి విస్తరణ వేగంగా జరుగుతోంది. పారిశ్రామిక కారిడార్లలో ఎప్పుడూ ఎవరూ వినని పేర్లు ఈరోజు రాష్ట్రంలోకి అడుగులు వేస్తున్నాయంటే ఇవన్నీ జరిగినది కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే, మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగా, మన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలోనే జరిగాయి అని గర్వంగా చెబుతున్నాను.  
 58 నెలల్లో గ్రామాల్లో సమూల మార్పులు… 

 
ఏ గ్రామంలోనైనా నాలుగు అడుగులు వేస్తే….
ఆ విలేజ్, వార్డు సచివాలయాల నుంచి ఒక పది అడుగులు ముందుకు వేస్తే చాలు.. అదే గ్రామంలోనే మనకళ్ల ఎదుటే కనిపిస్తుంది ఓ రైతు భరోసా కేంద్రం. అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడునేడుతో మారిన ఇంగ్లీషు మీడియం స్కూళ్లు కనిపిస్తాయి. అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే విలేజ్‌ క్లినిక్‌ లు. అక్కడే అదే గ్రామంలో ఓ మహిళా పోలీస్‌. ఇవన్నీ నెలకొల్పింది ఎవరు అంటే మీ జగన్‌. జరిగింది ఎప్పుడంటే ఈ 58 నెలల పాలనలోనే. 

పౌర సేవల్లో ఏది కావాలన్నా.. అంటే బర్త్‌ సర్టిఫికెట్, పెన్షన్, రేషన్, ప్రభుత్వ పథకాలు కావచ్చు.. ఇంటింటికీ వెళ్లి తలుపు తట్టి అందిస్తున్న పాలన.. ఎప్పుడు వచ్చిందంటే అదీ ఈ 58 నెలల కాలంలోనే, మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాతనే. అవునా కాదా.. ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి వెళ్లి ఆలోచన చేయండి. నలుగురితో ఆలోచింపజేసే విధంగా చెప్పండి.

 అక్కచెల్లెమ్మలకు రూ.2.70 లక్షల కోట్లు జమ
రూ.2.70 లక్షల కోట్లు.. లక్ష రూపాయలు కాదు.. పది లక్షలు కాదు.. ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు బటన్‌ నొక్కి నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఒక్క పైసా కూడా లంచం లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా అర్హులందరికీ కూడా పథకాలు అందించినది, గతంలో ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా ఓ అమ్మ ఒడి, ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, విద్యా దీవెన, వసతి దీవెన, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, పెన్షన్‌ కానుక, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, జగనన్న చేదోడు, జగనన్న తోడు, 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం, చదువులకు అనుసంధానం చేస్తూ కళ్యాణమస్తు, షాదీ తోఫా సైతం ప్రతి రూపాయి కూడా ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఇన్ని పథకాలు తేవడమే కాకుండా ప్రతి రూపాయి ప్రతి పేద కుటుంబానికి పూర్తిగా ఉపయోగపడాలని ఆ లబ్ధిని నా అక్కచెల్లెమ్మల ఖాతాలకే ఇచ్చింది ఎవరు అంటే.. మీ జగన్‌. జరిగింది ఎప్పుడంటే మన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే అని గర్వంగా చెబుతున్నాను. 

 బటన్‌ నొక్కితే చాలు.. ఆపదలో ఉన్నప్పుడు అక్కచెల్లెమ్మలకు 10 నిమిషాల్లోనే పోలీసు సోదరుడు ఫోన్‌ చేసి నేరుగా అక్కచెల్లెమ్మ దగ్గరికి వచ్చి చెల్లెమ్మా ఏమైంది అని అడిగే పరిస్థితి. మన గ్రామంలోనే ఓ మహిళా పోలీసు. తీసుకు వచ్చింది ఎవరు అంటే.. మీ జగన్‌. జరిగింది ఎప్పుడు అంటే ఈ 58 నెలల పాలనలోనే అని గర్వంగా చెబుతున్నాను. అవునా కాదా.. మరి ఈ పనులు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయారో అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతున్నా. మీ పిల్లల చదువుల్ని ఎలా మార్చామో మీరే చూడండి. ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. కనీసం పిల్లల చదువుల గురించి ఆలోచన చేయలేదు. కారణం.. ఆ పిల్లలకు ఓటు లేదు కాబట్టి. ఆ పిల్లలకు చదువుల గురించి పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా ఎవరూ కూడా పట్టించుకోరు కాబట్టి. కానీ ఆ పిల్లలే రేపటి తరం, ఆ పిల్లలు బాగుంటేనే పేదవాడు పేదరికం నుంచి బయటకు వస్తాడు. తలరాతలు మారుతాయని పిల్లల గురించి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మీ బిడ్డ అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

నాడునేడుతో గవర్నమెంట్‌ బడులను మార్చినది, గవర్నమెంట్‌ బడుల్లో గోరుముద్ద, విద్యాకానుక తెచ్చినది, ఇంగ్లీషు మీడియం, బైజూస్‌ కంటెంట్, పిల్లల చేతుల్లో బైలింగువల్‌ టెక్ట్స్‌ బుక్స్, పిల్లల చేతుల్లో ట్యాబులు, పిల్లల క్లాస్‌ రూముల్లో ఐఎఫ్‌బీ ప్యానల్స్, 6వ తరగతి నుంచి డిజిటల్‌ బోధన, గవర్నమెంట్‌ బడుల్లో మూడో తరగతి నుంచి సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్, 3వ తరగతి నుంచే టోఫెల్‌ మొదలు, ఇంగ్లీషు మీడియం మొదలు, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం. అన్నీ కూడా జరిగింది.. ఈ 58 నెలల కాలంలోనే. మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఉండగానే జరిగాయి అని గర్వంగా చెబుతున్నాను. 

 పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు 100 శాతం పూర్తి ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ ఇచ్చే విద్యాదీవెన, ఆ పిల్లలకు వసతి దీవెన, ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల సర్టిఫైడ్‌ ఆన్‌లైన్‌ వర్టికల్స్, ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీలు, ఇంటర్న్‌ షిప్‌లు,  ప్రపంచ స్థాయి యూనివర్సిటీల్లో చదువుల కోసం విదేశీ విద్యాదీవెన.. ఇలా పేద పిల్లల భవిష్యత్‌ ను మార్చేందుకు షాదీ తోఫా, కళ్యాణమస్తు కూడా చదువులకే లింకు పెడుతూ చదువులను ప్రోత్సహిస్తూ ఇలా వంద చదువుల విప్లవాలు ఈ 58 నెలల మీ బిడ్డ పాలనలో కనిపిస్తాయి. 

 ఇక ఒక్కసారి వైద్య ఆరోగ్యరంగాన్ని తీసుకోండి. నాడునేడు ద్వారా గవర్నమెంట్‌ హాస్పిటళ్ల రూపురేఖలు మారుతున్నాయి. గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో ఈరోజు ఏకంగా 54 వేల మంది డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్, స్టాఫ్‌ రిక్రూట్మెంట్‌ అయ్యాయి. ఇంతుకు ముందు గవర్నమెంట్‌ హాస్పటల్‌ కు పోతే అక్కడ మందులుండేవి కావు, ఎక్విప్‌మెంట్, డాక్టర్లు ఉండేవారు కాదు. ఈరోజు నాడునేడుతో గవర్నమెంట్‌ హాస్పటళ్లు రూపురేఖలు మారుతున్నాయి. గవర్నమెంట్‌ ఆసుపత్రులలో ఈరోజు 54 వేల మంది నియామకం జరిగింది. మందులన్నీ డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ స్టాండర్డ్స్‌ కు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా మరో 17 మెడికల్‌ కాలేజీలు ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఈరోజు వేగంగా వస్తున్నాయి. మీ నంద్యాలలోనే ఇక్కడే కనిపిస్తున్నాయి. నంద్యాల మెడికల్‌ కాలేజీ కడుతున్నాం. ఇక్కడే కనిపిస్తోంది. ఎప్పుడూ చూడని విధంగా ఆరోగ్యశ్రీని విస్తరించాం. గతంలో 1000 ప్రొసీజర్లు ఉన్న ఆరోగ్యశ్రీని ఏకంగా 3300 ప్రొసీజర్లకు తీసుకుని పోయాం. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఏ పేదవాడయినా అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని, ఆరోగ్యశ్రీ లిమిట్స్‌ ఏ పేదవాడికైనా రూ.25 లక్షల దాకా ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమానికి ఈ 58 నెలల కాలంలోనే అడుగులు పడ్డాయి. 

 ఆరోగ్యశ్రీలో ఆపరేషన్‌ చేయడమే కాదు, ఆపరేషన్‌ అయిన తర్వాత డాక్టర్లు ఆ పేదవాడికి రెస్టు తీసుకోమని చెబితే, రెస్టులో ఉన్నప్పుడు కూడా ఆ పేదవాడికి రోజుకు రూ.225 చొప్పున నెలకు రూ.5 వేల చొప్పున రెండు నెలలైతే రూ.10 వేల చొప్పున, ఇలా ఎన్ని నెలలు రెస్టు ఇస్తే అన్ని నెలలపాటు ఆ పేదవాడికి ఆరోగ్య ఆసరా తీసుకొచ్చింది కూడా ఈ 58 నెలల కాలంలోనే. ఆలోచన చేయమని అడుగుతున్నాను. 

ఈరోజు మొట్టమొదటి సారిగా గ్రామస్థాయిలో దాదాపుగా 10600 విలేజ్‌ క్లినిక్స్‌ కనిపిస్తున్నాయి. అర్బన్‌ లో అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌ కనిపిస్తున్నాయి. కొత్తగా 1700.. 104, 108 వాహనాలు కొనుగోలు చేశాం. ఈరోజు ఏ పేదవాడికి ఆరోగ్యం బాగోలేకపోయినా 108, 104 నంబర్లకు ఫోన్‌ కొడితే చాలు కుయ్‌ కుయ్‌ కుయ్‌ అంటూ ఈరోజు ఆ పేదవాడికి అండగా నిలబడేందుకు 104, 108 వాహనాలు క్యూలు కడుతున్నాయి. 

గ్రామ స్థాయిలో మొట్ట మొదటిసారిగా ఫ్యామిలీ డాక్టర్లు విలేజ్‌ క్లినిక్స్‌ తో అనుసంధానం అయి పేదవాడికి తోడుగా ఉన్నారు. మొట్ట మొదటి సారిగా ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ఈ 58 నెలల కాలంలోనే వచ్చింది. ప్రతి పేదవాడి ఇంటికీ వెళ్లి జల్లెడ పడుతూ ఆ పేదవాడికి టెస్టులు చేయడం, ఉచితంగా మందులివ్వడం జరిగింది కేవలం ఈ 58 నెలల కాలంలోనే, మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. అవునా కాదా.. అని అడుగుతున్నాను. 

 ఇక మన రైతు.. మన రైతన్నకు గతంలో కూడా ఎప్పుడూ జరగని విధంగా, చూడని విధంగా మొట్ట మొదటి సారిగా రైతన్నకు తాను పెట్టుబడి పెట్టేటప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా.. పంట విత్తనం వేసే దగ్గర నుంచి పంట కొనుగోలు దాకా కూడా ప్రతి అవసరంలోనూ రైతన్నకు తోడుగా ఉంటూ ఆర్బీకేలు పని చేస్తున్నాయి. రైతన్నలకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్, క్వాలిటీ విద్యుత్‌ ఇస్తున్న ప్రభుత్వం. రైతన్నలకు మొట్ట మొదటి సారిగా ఉచిత పంటల బీమా అమలు చేస్తున్న ప్రభుత్వం కేవలం మీ బిడ్డ ప్రభుత్వం మాత్రమే. రైతన్నలకు ఏ సీజన్‌ లో నష్టం జరిగితే ఆ సీజన్‌ ముగిసేలోగానే ఆ రైతన్నకు ఇన్‌ పుట్‌ సబ్సిడీ ఇస్తున్న పాలన కూడా కేవలం మీ బిడ్డ పాలనలోనే, ఈ 58 నెలల కాలంలోనే. ఇంతగా తోడుగా ఉంటూ రైతన్నలను ఆదుకున్నది కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే, మీ బిడ్డ పాలనలోనే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

 రైతన్నలకు అదనపు ఆదాయం ఉండాలని, పాడి రైతులను సైతం ఆ రైతన్నలకు, ఆ అక్కచెల్లెమ్మలకు పాడి పశువులను కొనివ్వడమే కాకుండా అమూల్‌ ను తీసుకొని వచ్చి కాంపిటీషన్‌ క్రియేట్‌ చేసి చంద్రబాబు మూసేసిన చిత్తూరు డెయిరీ లాంటివి కూడా తెరిపించి ఈరోజు పాడి రైతులందరికీ కూడా ఈ 58 నెలల కాలంలోనే ప్రతి లీటరు కూడా రూ.10 నుంచి రూ.22 పెరిగిన మాట ఈ 58 నెలల కాలంలోనే, మీ బిడ్డ పాలనలోనే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

ఏకంగా 19.17 లక్షల మంది రైతన్నలకు, వారి కుటుంబాలకు మంచి చేస్తూ 34.72 లక్షల ఎకరాలకు పూర్తి హక్కులతో.. సర్వ హక్కులనూ ఆ భూముల మీద ఆ రైతన్నలకు కల్పిస్తూ ఆ రైతన్నలకు 22ఏ కింద తీసేయడం గానీ, సర్వ హక్కులు కల్పించడం గానీ జరుగుతున్నది కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. మొట్ట మొదటి సారిగా అసైన్డ్‌ రైతులకు ఈరోజు పట్టా భూములు వస్తున్నాయి. పట్టాలు చేతికి వస్తున్నాయి. సామాజిక న్యాయం విషయంలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించినది కూడా ఈ 58 నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. మొట్ట మొదటి సారిగా ఒక పేదవాడిని గౌరవించిన ప్రభుత్వం, పేదవాడికి తోడుగా ఉన్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

 మొట్టమొదటిసారిగా నామినేటెడ్‌ పదవుల విషయంలో ఏకంగా చట్టం చేసి మరీ 50 శాతం పదవులు నానానా అని నేను పిలుచుకుంటూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు, నా బీసీలు బాగుండాలని ఏకంగా చట్టం చేసి మరీ వారిని పైకి లేపాలి, ఎదగనివ్వాలని 50 శాతం పదవులు వాళ్లకే ఇచ్చట్టుగా చట్టం చేసిన ప్రభుత్వం కేవలం మీ బిడ్డ ప్రభుత్వం. జరిగినది ఈ 58 నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

మంత్రి మండలిలో ఏకంగా 68 శాతం పదవులు ఈ వర్గాలకే ఇవ్వడం దగ్గర నుంచి మొదలు పెడితే.. 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వరకూ.. రాష్ట్రం విడిపోయిన తర్వాత మన ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని చూస్తే, దశాబ్దాలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు 4 లక్షలు అయితే, ఈ 58 నెలల్లో అదనంగా 2.31 లక్షల ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చాడు. ఇందులో ఏకంగా 80 శాతం ఉద్యోగాలు నానానానా అని నేను పిలుచుకుంటున్నా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలకే దక్కాయి అంటే ఆలోచన చేయమని కోరుతున్నాను. 

 ప్రతి పేదవాడూ బాగుండాలి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఏ వర్గాలూ ఉండకూడదు. అన్ని వర్గాలూ రాజకీయంగా, ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని ప్రతి అడుగులోనూ మీ బిడ్డ తాపత్రయపడుతూ అడుగులు వేశాడు. ఇందులో భాగంగా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు.. ఎప్పుడూ జరగని విధంగా.. ఇందులో కూడా ఏకంగా 75 శాతానికి పైగా ఈ సామాజిక వర్గాలకే అందాయి. మీ బిడ్డ బటన్‌ నొక్కడం, నేరుగా నా అక్కచెల్లెమ్మలకుటుంబాల ఖాతాల్లోకి వెళ్లిపోవడం, ఎక్కడా లంచాలు అడిగేవాడు లేడు. ఎక్కడా వివక్ష లేదు. ప్రతి పేదవాడికీ కూడా అండగా, తోడుగా ఉంటూ అడుగులు పడ్డాయి. 

2014లో బాబు ప్రచార హోరు చూస్తే…·
ఇంటింటికీ పంపించడంలో సరిపుచ్చుకోలేదు. 2014 మీకు గుర్తుందా. ఇంటికెళ్లీ టీవీ ఆన్‌ చేస్తే చాలు, ఈనాడు పేపర్‌ గానీ, ఆంధ్రజ్యోతి పేపర్‌ గానీ, టీవీ5 గానీ చూస్తే చాలు.. అడ్వటైజ్‌ మెంట్లతో హోరెత్తించారు. ఆయన చేసిన ఈ ముఖ్యమైన హామీల గురించి ఒక్కసారి చెబుతా. విందామా? 

·బాబు విఫల హామీలు….·
రైతులకు రుణ మాఫీ. ముఖ్యమైన హామీ. రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. అడుగుతున్నా. రూ.87612 కోట్లు రుణ మాఫీ చేశాడా అని అడుగుతున్నాను. 
మరో ముఖ్యమైన హామీ.. పొదుపు సంఘాల డ్వాక్రా రుణాలు అన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. రూ.14205 కోట్లు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలు. అప్పట్లో కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతున్నాను. మరో ముఖ్యమైన హామీ.. ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్షి్మ పథకం కింద రూ.25 వేలు బ్యాంకు అకౌంట్లో డిపాజిట్‌ చేస్తామన్నాడు. ఒక్కరికన్నా.. ఒక్క రూపాయి అయినా.. డిపాజిట్‌ చేశాడా అని మిమ్మల్నందరినీ అడుగుతున్నాను.

·ఇప్పుడు సూపర్‌ సిక్స్‌…·
మరో ముఖ్యమైన హామీ. ఇప్పుడు సూపర్‌ సిక్సు, సూపర్‌ సెవెన్‌ అంటున్నాడు కదా.. అప్పటి ముఖ్యమైన హామీలు ఇవి. ఇంటింటికీ ఉద్యోగమిస్తాం. ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలనెలా రూ.2 వేల నిరుద్యోగభతి ఇస్తామన్నాడు. 5 ఏళ్లు.. అంటే 60 నెలలకు నెలకు  రూ.2000 చొప్పున లెక్కిస్తే…  ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షలు. ముఖ్యమైన హామీ ఇది. ఇంటింటికీ ఈ సంతకం పెట్టి ముగ్గురి ఫొటోలతో పంపిన ముఖ్యమైన హామీ. రూ.1.20 లక్షలు ముట్టిందా అని అడుగుతున్నాను. 

మరో ముఖ్యమైన హామీ.. అర్హులైన వాళ్లందరికీ 3 సెంట్ల స్థలం. కట్టుకునేందుకు పక్కా ఇళ్లు. ముఖ్యమైన హామీ ఇది. ఇంటింటికీ పంపించిన పాంప్లేట్‌ ఇది. చంద్రబాబు సంతకం పెట్టిన పాంప్లేట్‌. పక్కనే దత్తపుత్రుడి ఫొటో, పక్కనే మోడీ గారి ఫొటో. కనీసం ఒక్కరికన్నా.. ఒక్క సెంటు స్థలం అయినా గానీ ఇచ్చాడా అని మిమ్మల్నందరినీ అడుగుతున్నాను. 

రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ ప్లాన్, చేనేత, పవర్‌ లూమ్స్‌ రుణాలన్నీ మాఫీ అన్నాడు. చేశాడా? మహిళల రక్షణకు ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామన్నాడు. జరిగిందా? రాష్ట్రాన్ని సింగపూర్‌ మించి అభివద్ధి చేస్తాడంట. అన్నాడబ్బా.. ఇది కూడా ముఖ్యమైన హామీ.  ప్రతి నగరంలోనూ హైటెక్‌ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి మన పూతలపట్టులో నిర్మించాడా? ఏమన్నా కనిపించిందా? 

ఇవీ ముఖ్యమైన హామీలు. ఇక ముఖ్యమైన హామీలు వద్దనుకుంటే ఆయన మేనిఫెస్టో చూస్తే ఇటువంటివి 650 హామీలు కనిపిస్తాయి. ముఖ్యమైన హామీల పరిస్థితే ఇది అంటే.. ఇక మేనిఫెస్టో కథ దేవుడెరుగు. అది ఎవరికీ కనపడదు. ఎన్నికలు అయిపోతే చెత్తబుట్టలో పడేస్తారు. జరిగింది అదీ. మరి ఈ పాంప్లేట్‌ లో చెప్పిన ఈ ముఖ్యమైన హామీలు, ఆ ముగ్గురి ఫొటోలతో ఇచ్చిన ఈ ముఖ్యమైన హామీలు 2014లో ఇంటింటికీ పంపి మరీ ఈ ముఖ్యమైన హామీలు ఇచ్చిన ఈ చంద్రబాబు ఇచ్చిన ఈ దత్తపుత్రుడు, ఇచ్చిన ఇదే మోడీ గారు.. ముగ్గురి ఫొటోలూ పెట్టి చంద్రబాబుసంతకం పెట్టి ఇంటింటికీ పంపించిన పాంప్లేట్‌. నేను అడుగుతున్నాను. వీళ్లు ముగ్గురూ కలిసి చంద్రబాబు సంతకం పెట్టి ప్రతి ఇంటికీ ముఖ్యమైన హామీలంటూ ఈ పాంప్లేట్‌ లో పంపించిన ఈ హామీల్లో కనీసం ఒక్కటైనా నెరవేర్చారా? అని అడుగుతున్నాను. పోనీ ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చారా అని అడుగుతున్నాను. 

మరలా ఇప్పుడు ఇదే పొత్తు… ఇదే ముగ్గురు.. ఇదే పార్టీలు. మరి ఇదే పొత్తు. ఇదే ముగ్గురు, ఇదే పార్టీలు. మరోసారి ఈముగ్గురి కూటమి.. గతంలో ఇచ్చిన హామీలు ఏవీ కూడా అమలు చేయకుండా మరోసారి ఇదే మాదిరిగా మీటింగులు పెట్టి, మరో మేనిఫెస్టో అంటూ రంగురంగుల వాగ్దానాలు ముగ్గురి ఫొటోలు వేసి, సంతకాలు పెట్టి ఇంటింటికీ పంపినట్టుగానే మరోసారి ఇదే డ్రామా. 2014 కంటే ఇంకా ఎక్కువ హామీలిస్తూమరోసారి మోసం చేసేందుకు, మరో మేనిఫెస్టోతో ఇంకో డ్రామాకు తెరతీస్తున్నారు. మళ్లీ ఇదే ముగ్గురూ కలిసి ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నారు. ఇంటింటికీ బెంజ్‌ కారు కొనిస్తామంటున్నారు. మళ్లీ ఇదే ముగ్గురు కలిసి సూపర్‌ సిక్స్‌ అంటున్నారు. సూపర్‌ సెవెన్‌ అంటున్నారు. మరి ఆలోచన చేయమని అడుగుతున్నాను.  

వలంటీర్‌ వ్యవస్థ లేకుండా రద్దు చేయించారు..
చంద్రబాబునాయుడు మనిషి నిమ్మగడ్డ రమేష్‌ చేత తానే ఫిర్యాదు చేయించి అది ఎవరి మీద చేయించాడో తెలుసా? జగన్‌ మీద కాదు.. జగన్‌ ను నేరుగా కొట్టలేడు కాబట్టి ఎవరికి నష్టం జరుగుతుందని కూడా ఆలోచన చేయలేదు. 66 లక్షల మంది పేదలకు నష్టం కలిగిస్తున్నా కూడా కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు. పేదవాడికి నష్టం జరుగుతోంది. అవ్వలకు నష్టం జరుగుతోంది. నడవలేని వయసులో ఉన్న ఆ అవ్వలకు చేతనైతే ఇంటికెళ్లి తోడుగా ఇప్పించే కార్యక్రమంలో శభాష్‌ అని  చెప్పాల్సింది పోయి.. ఆ వాలంటీర్‌ వ్యవస్థనే ఏకంగా రద్దు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారంటే ఇలాంటి మనిషిని ఏమనాలి అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నాను.ఇలాంటి వ్యక్తికి ఓటు వేయడం ధర్మమేనా? వారి మోసాల నుంచి రాష్ట్ర భవిష్యత్‌ను కాపాడుకునే ఈ యుద్ధంలో మీరంతా సిద్ధమేనా?   

మనం వేసే ఈ ఓటు మన తలరాతలు మారుతాయి. మంచి జరిగి ఉంటే ఇదే సరైన సమయం..ఇప్పుడే బయటకు రావాలి..జగనన్ననే మళ్లీ గెలిపించుకుందాం. ప్రతి పథకం నేరుగా మీ ఇంటికి వస్తుందని, ప్రతి ఇంట్లో నుంచి స్టార్‌ క్యాంపెయినర్‌ రావాలి. ప్రతి ఒక్కరూ రెండు బటన్లు ఫ్యాన్‌ మీద నొక్కి చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టేలో బందించే యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? ..సిద్ధమే అయితే జోబులో నుంచి సెల్‌ ఫోన్‌ తీసి టార్చ్‌లైట్‌ ఆన్‌ చేసి సిద్ధమే అని నినదించండి.

ఫ్యాన్‌ గుర్తుపై నిలబడే మన అభ్యర్థులు మీకు పరిచయం చేస్తున్నాను. చిత్తూరు ఎంపీగా రెడ్డప్ప, పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీల్‌కుమార్, పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వెంకటయ్య గౌడు, చంద్రగిరి నుంచి మోహిత్‌రెడ్డి, కృపాలక్ష్మీ జీడీ నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారు. మీ చల్లని దీవెనలు నా చెల్లెమ్మపై ఉంచాలని ప్రార్థిస్తున్నాను. చిత్తూరు నుంచి విజయానందరెడ్డి ఎమ్మెల్యేగా నిలబడ్డారు. నగరి నుంచి రోజా నిలబడ్డారు. నా చెల్లెలు మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఆమెపై ఉంచాలని విజ్ఞప్తి చేశారు. కుప్పం నుంచి భరత్‌ను గెలిపించండి..ఈసారి కేబినెట్‌లో కూర్చోబెట్టి మీకు మంచి జరిగిస్తానని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు.

 

Best Web Hosting Provider In India 2024