Vijay Deverakonda: ఆయన వల్లే మాకు ఈ ధైర్యం.. అన్ని డైరీల్లో అవే లెక్కలు ఉండేవి: విజయ్ దేవరకొండ

Best Web Hosting Provider In India 2024

Vijay Deverakonda: ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ సమీపిస్తోంది. ఏప్రిల్ 5వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ఈ మూవీలో హీరోహీరోయిన్లుగా నటించారు. మధ్యతరగతి కుటుంబ బాధ్యతలు మోసే యువకుడిగా ఈ చిత్రంలో నటించారు విజయ్. ఫ్యామిలీ స్టార్ మూవీకి పరశురామ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కోసం ప్రమోషన్లను మూవీ టీమ్ జోరుగా చేస్తోంది. తాజాగా, హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌, దర్శకుడు పరశురామ్‍ను నిర్మాత దిల్‍రాజు ఇంటర్వ్యూ చేశారు. నేడు (ఏప్రిల్ 3) ఈ ఇంటర్వ్యూ వీడియో బయటికి వచ్చింది.

ఈ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ.. ఒకప్పుడు తమ కుటుంబం ఎదుర్కొన్న ఆర్థిక పరిస్థితులను వివరించారు. ప్రతీ ఖర్చును తమ తండ్రి గోవర్దన్ డైరీల్లో రాసేవారని తెలిపారు. తండ్రి వల్లే తనకు ధైర్యం వచ్చిందని, ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతోనే సినీ ఇండస్ట్రీలోకి నమ్మకంతో వచ్చానని అన్నారు.

అన్నీ డైరీల్లో అవే లెక్కలు

ఇంటి ఖర్చులన్నింటినీ తన తండ్రి రాసేవారని, ఏ డైరీలో చూసినా అవే లెక్కలు కనిపించేవని విజయ్ దేవరకొండ చెప్పారు. “మా నాన్న ఎప్పుడూ డైరీల్లో ఏవో రాసేవారు. పాల బిల్లు ఎంత, కరెంట్ బిల్ ఎంత, పిల్లల ఫీజులు ఎంత ఇలా ప్రతీ లెక్క డైరీల్లో రాసేవారు. వచ్చే ఆదాయం ఎంత.. ఖర్చులు ఎంత అని చూసుకునే వారు. ఆనెలలో డబ్బు తక్కువైతే ఎక్కడి నుంచి తీసుకురావాలని ఆలోచించేవారు. ఇంట్లో ఏ డైరీ ఓపెన్ చేసినా ఇవే ఉండేవి” అని విజయ్ దేవరకొండ చెప్పారు.

నాన్న ఇచ్చిన ధైర్యంతోనే..

తన తండ్రి చెప్పిన ధైర్యంతోనే తాను సినీ ఇండస్ట్రీలోకి ఆత్మవిశ్వాసంతో వచ్చానని విజయ్ దేవరకొండ చెప్పారు. “నేను యాక్టర్ అవుదామనుకుంటే.. కొందరు ఎంబీఏ చేయాలని సలహాలు ఇచ్చారు. అయితే, రెండు బోట్లపై కాళ్లు పెడితే కుదరదని ఆయన చెప్పారు. ఏదో వైపు దూకాలని ధైర్యం చెప్పారు. చాలా ఆత్మవిశ్వాసంతో చెప్పేవారు. మా నాన్న కాన్ఫిడెన్స్ వల్ల మాకు భయాలు లేకుండా దూకేశాం. కొడితే కుంభస్థలం కొట్టాలని మా నాన్న అనేవారు” అని విజయ్ దేవరకొండ చెప్పారు.

ఫ్యామిలీ స్టార్ కథ వినగానే తన తండ్రి కనిపించారని విజయ్ దేవరకొండ చెప్పారు. అందుకే ఈ చిత్రంలో తన పాత్రకు తండ్రి పేరైన గోవర్దన్ అని పెట్టుకున్నానని మరోసారి తెలిపారు. ఈ సినిమా కోసం మీసం కూడా తన తండ్రిలాగే ఉండేలా చూసుకున్నారనని విజయ్ అన్నారు.

ఫ్యామిలీ స్టార్ సినిమాలో గోవర్దన్ పాత్రలో విజయ్, ఇందూ పాత్రలో మృణాల్ ఠాకూర్ నటించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించారు. బ్లాక్ బస్టర్ గీతగోవిందం తర్వాత విజయ్ – పరుశురామ్ కాంబో రిపీట్ అవటంతో ఫ్యామిలీ స్టార్‌పై అంచనాలు, హైప్ భారీగా ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‍రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. గోపీసుందర్ మ్యూజిక్ ఇచ్చారు.

తాను గతంలో చెప్పినట్టు ఏదో ఒక రోజు రూ.200 కోట్ల కలెక్షన్లను కొడతానని ఇటీవల ఫ్యామిలీ స్టార్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో విజయ్ దేవరకొండ చెప్పారు. ఇది తన పొగరు కాదని, ఆత్మవిశ్వాసం అంటూ తెలిపారు.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024