Best Web Hosting Provider In India 2024
Rashmika Mandanna: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతోంది. గీతగోవిందం తర్వాత విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ మూవీపై తెలుగు నాట భారీగా అంచనాలు నెలకొన్నాయి. కుటుంబ బంధాలకు ప్రేమకథను జోడించి పరశురామ్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
రష్మిక గెస్ట్ రోల్…
కాగా ఫ్యామిలీ స్టార్‌లో రష్మిక మందన్న గెస్ట్ రోల్‌లో నటించినట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. రష్మిక రోల్ గురించి ప్రమోషన్స్‌లో హీరో విజయ్ దేవరకొండతో పాటు దర్శకనిర్మాతలు రివీల్ చేయలేదు. సినిమా చూస్తోన్న ఆడియెన్స్‌కు సర్‌ప్రైజ్‌లా ఉండాలనే రష్మిక క్యారెక్టర్‌కు సంబంధించిన డీటెయిల్స్ సీక్రెట్‌గా ఉంచుతున్నట్లు సమాచారం. రష్మిక మందన్న సినిమాలో నటించిందా? లేదా? థియేటర్లలోనే చూసి తెలుసుకొండి అంటూ దిల్‌రాజు కూడా ఆమె క్యారెక్టర్‌పై ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ కలిగించారు.
ఎండ్ కార్డ్ టైటిల్స్‌కు ముందు…
కాగా ఫ్యామిలీ స్టార్‌లో రష్మిక మందన్న చాలా చిన్న రోల్ చేసినట్లు సమాచారం. ఐదు నిమిషాల లోపే ఆమె స్క్రీన్‌పై కనిపిస్తుందని అంటున్నారు. సినిమా శుభం కార్డు టైటిల్స్ పడే సమయంలో రష్మిక స్క్రీన్‌పై ఎంట్రీ ఇస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్స్‌లో రష్మిక మందన్న కనిపించనున్నట్లు చెబుతున్నారు. రష్మిక రోల్ ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేసేలానే ఉంటుందని అంటున్నారు.
గీతగోవిందం తర్వాత…
గీతగోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించారు. కథ కంటే వారి కెమిస్ట్రీతోనే సినిమా ఎక్కువగా ఆడింది. రష్మికకు స్టార్ స్టేటస్‌ను తీసుకొచ్చిన సినిమాల్లో ఒకటిగా గీతగోవిందం నిలిచింది. ఆ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని రష్మిక మందన్న గెస్ట్ రోల్‌ను ఫ్యామిలీ స్టార్‌లో పెట్టినట్లు సమాచారం. విజయ్ దేవరకొండతో పాటు దర్శకుడు పరశురామ్ రిక్వెస్ట్ మేరకు రష్మిక ఈ గెస్ట్ రోల్ చేయడానికి అంగీకరించినట్లు చెబుతున్నారు.
రష్మిక మందన్న బర్త్ డే…
రష్మిక మందన్న బర్త్‌డే ఏప్రిల్ 5. అదే రోజు ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తన బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసం రష్మిక మందన్న దుబాయ్ వెళ్లింది. దుబాయ్‌లో ప్రకృతి అందాలకు మురిసిపోతూ ఓ నెమలి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
దుబాయ్‌లోనే ఉండి విజయ్ మూవీ ప్రమోషన్స్‌లో పాల్లొంటున్నట్లు సమాచారం. రష్మిక షేర్ చేసిన ఫొటోలు, విజయ్ ఫొటోల్లోని బ్యాక్‌గ్రౌండ్ ఒకటే కావడంతో మరోసారి వీరి ప్రేమ వార్తలు గుప్పుమంటున్నాయి. విజయ్, రష్మిక దుబాయ్‌లో ఒకే హోటల్‌లో దిగినట్లు వార్తలొస్తున్నాయి. రష్మిక బర్త్‌డే ను దుబాయ్‌లో స్పెషల్‌గా సెలబ్రేట్ చేయడానికే విజయ్ అక్కడికి వెళ్లినట్లు చెబుతోన్నారు.
ధనుష్ మూవీలో హీరోయిన్…
ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌లో పలు సినిమాలు చేస్తూ రష్మిక బిజీగా ఉంది. గత ఏడాది యానిమల్ మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నది. రణ్‌భీర్‌కపూర్ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద తొమ్మిది వందల కోట్ల వసూళ్లను రాబట్టింది.
ప్రస్తుతం ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ మూవీలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ బైలింగ్వల్ మూవీలో నాగార్జున కీలక పాత్ర చేస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్‌ఫ్రెండ్ పేరుతో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది రష్మిక.