Best Web Hosting Provider In India 2024
Aha OTT Trending Movies: ఓటీటీ ప్రియులను, ప్రేక్షకులను నిత్యం సరికొత్త కంటెంట్‌తో అలరించేందుకు రెడీగా ఉంటాయి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్. ఇప్పటికే దేశంలో ఎన్నో రకాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నప్పటికీ వాటిలో కొన్నింటిని మాత్రమే వీక్షిస్తారు తెలుగు రాష్టాల ఆడియెన్స్. కామెడీ నుంచి క్రైమ్ థ్రిల్లర్, హారర్ జోనర్స్ వరకు వైవిధ్యమైన సరికొత్త కాన్సెప్ట్ సినిమాలు, వెబ్ సిరీసులను అందిస్తోంది ఆహా ఓటీటీ. మరి ఈ ఆహాలో ఈవారం ట్రెండ్ అవుతోన్న 5 సినిమాలు, వాటిలో మిస్ అవ్వకూడని 3 సినిమాలు ఏంటో చూద్దాం.
సుందరం మాస్టర్ ఓటీటీ
కమెడియన్‌గా, నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న వైవా హర్ష తొలిసారి హీరోగా చేసిన సినిమా సుందరం మాస్టర్ (Sundaram Master OTT). యూట్యూబ్ ద్వారా క్రేజ్ అందుకున్న దివ్య శ్రీ పాద హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంతో కల్యాణ్ సంతోష్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మార్చి 28 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ముందు నుంచి సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడటంతో ఇప్పుడు ఓటీటీలో టాప్ 1 ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.
భూతద్ధం భాస్కర్ నారాయణ ఓటీటీ
క్రైమ్, మర్డర్ మిస్టరీ, కామెడీ జోనర్‌కు మైథాలజీ టచ్ ఇచ్చి తెరకెక్కించిన సినిమా భూతద్ధం భాస్కర్ నారాయణ (Bhoothaddam Bhaskar Narayana OTT). ఇంటి ముందు వేలాడేదీసే దిష్టి బొమ్మకు సంబంధించిన డిఫరెంట్ కథతో ఈ మూవీని తెరకెక్కించారు. పురుషోత్తం రాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మార్చి 22 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. మొన్నటివరకు మూడో స్థానంలో ఉన్న ఈ మూవీ ఇప్పుడు ట్రెండింగ్ జాబితాలో రెండో స్థానంలో చోటు సంపాదించుకుంది.
చెఫ్ మంత్ర సీజన్ 3
నిహారిక కొణిదెల హోస్ట్‌గా వ్యవరిస్తున్న టాక్ షో చెఫ్ మంత్ర సీజన్ 3 (Chef Mantra Season 3). ఇప్పటికీ ఈ సీజన్‌లో 5 ఎపిసోడ్స్ వచ్చాయి. వాటిలో 5వ ఎపిసోడ్‌కు హీరో అడవి శేష్‌తోపాటు డైరెక్టర్ అండ్ హీరో రాహుల్ రవీంద్రన్ అతిథులుగా హాజరయ్యారు. వీరితో నిహారిక చిట్ చాట్ చేసింది. ఇప్పుడు ఈ ఐదో ఎపిసోడ్ టాప్ 3 ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఇందులో అడవి శేష్ తన ఫ్యూచర్ సినిమాలపై ఆసక్తికర విషయాలు చెప్పగా.. రాహుల్ తను డైరెక్ట్ చేస్తున్న రష్మిక మందన్నా గర్ల్ ఫ్రెండ్ సినిమాకు సంబంధించి మాట్లాడారు.
డబుల్ ఇంజిన్ ఓటీటీ
తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌గా తెరకెక్కిన సినిమా డబుల్ ఇంజిన్ (Double Engine OTT). పలు కాంట్రవర్సీలతో పాపులర్ అయిన గాయత్రి గుప్తా మెయిన్ లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమాకు రోహిత్ పెనుమాత్స దర్శకత్వం వహించారు. జనవరి 5న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం మార్చి 29 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు ఈ సినిమా టాప్ 4 ప్రేస్‌లో ట్రెండ్ అవుతోంది. కేవలం రూ. 30 లక్షల బడ్జెట్‌తో 12 రోజుల్లో ఈ మూవీని తెరకెక్కించడం విశేషం.
మిక్స్ అప్
ఓటీటీలోకి వచ్చిన తెలుగు బోల్డ్ మూవీ మిక్స్ అప్ (Mix Up OTT). నలుగురు వ్యక్తులు, రెండు జంటలు కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమాను ఆకాష్ బిక్కీ డైరెక్ట్ చేశారు. భార్యాభర్తల మధ్య సెక్స్, లవ్, రిలేషన్‌షిప్, రెస్పెక్ట్ వంటి ఫీలింగ్స్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో చెప్పే ఈ మూవీ ప్రస్తుతం ఆహా ఓటీటీలో టాప్ 3 స్థానంలో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. గతవారం ఈ సినిమా టాప్ 1 ప్లేస్‌లో ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని రీసెంట్‌గా రిలీజైన సుందరం మాస్టర్ దక్కించుకుంది.
మిస్ అవ్వకూడని 3 సినిమాలు
ఈ ఐదింటిలో కామెడీ అండ్ యూనిక్ మెసెజ్ ఒరియెంటెడ్ సినిమాగా వచ్చిన సుందరం మాస్టర్, దిష్టి బొమ్మ నేపథ్యం చెప్పే భూతద్ధం భాస్కర్ నారాయణ, రెండు తలల పామును పట్టుకోవడం అనే కాన్సెప్టుతో తెరకెక్కిన డబుల్ ఇంజిన్ సినిమాలను మాత్రం అస్సలు మిస్ కావొద్దు. స్టార్ కాస్టింగ్ లేక, ఇతర సినిమాల పోటీతో వీటికి బాక్సాఫీస్ వద్ద పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ, ఓటీటీలో మాత్రం ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి ఈ మూవీస్.