ఎన్టీఆర్ జిల్లా /కంచికచర్ల(మొగులూరు) :
ది.30-7-2022(శనివారం) ..
మొగులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ..
కంచికచర్ల మండలం లోని మొగులూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల “మనబడి నాడు-నేడు” కార్యక్రమం లో భాగంగా రూ.96 లక్షలతో చేపట్టిన పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి -అభివృద్ధి పనులకు శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు శనివారం శంకుస్థాపన నిర్వహించారు ,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని , పేద -మధ్య తరగతి విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన , ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ పని చేస్తున్నారని తెలిపారు , విద్యార్థుల తల్లిదండ్రులకు అమ్మ ఒడి పథకం అందజేయడంతో పాటు జగనన్న విద్యా కానుక- జగనన్న గోరుముద్ద లాంటి పథకాలను కూడా అమలు చేస్తున్నారన్నారు ,
అదేవిధంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8 అదనపు తరగతి గదుల నిర్మాణాలు చేపట్టడంతో పాటు పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలను -సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు రూ.96 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించినట్లు తెలిపారు ,
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బండి మల్లికార్జున రావు, జడ్పీటీసీ వేల్పుల ప్రశాంతి ,గ్రామ సర్పంచ్ , పేరెంట్స్ కమిటీ సభ్యులు ,పాఠశాల ఉపాధ్యాయులు ,వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ..