Goa Tour Package : బడ్జెట్ ధరలోనే 4 రోజుల గోవా ట్రిప్… ఎన్నో బీచ్‌లు, క్రూజ్ బోట్ లో జర్నీ – ప్యాకేజీ వివరాలివే

Best Web Hosting Provider In India 2024

Telangana Tourism Goa Tour Package 2024: ఈ హాట్ సమ్మర్ లో హాయిగా గోవాలో ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారా..? తక్కువ ఖర్చులోనే వెళ్లి రావాలని చూస్తున్నారా..? మీలాంటి వారికి తెలంగాణ టూరిజం (Telangana Tourism) సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది.

హైదరాబాద్ నుంచి గోవా(Goa Tour Packag) టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. GOA PACKAGE TOUR – ITINERARY పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. https://tourism.telangana.gov.in/p వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. మొత్తం 4 రోజుల పాటు టూర్ ఉంటుంది. బస్సులో రోడ్డు మార్గానే వెళ్లాల్సి ఉంటుంది.

హైదరాబాద్ – గోవా టూర్ షెడ్యూల్:

  • హైదరాబాద్ – గోవా టూర్(GOA PACKAGE TOUR – ITINERARY) ప్యాకేజీని తెలంగాణ టూరిజం(Telangana Tourism) ఆపరేట్ చేస్తోంది.
  • ప్రతి సోమవారం తేదీల్లో ఈ టూర్ జర్నీ ఉంటుంది.
  • టికెట్ ధరలు : పెద్దలకు రూ. 11999/- పిల్లలకు రూ. – 9599/, సింగిల్ అక్యుపెన్సీకి రూ. 14900గా నిర్ణయించారు.
  • తొలి రోజు హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు మీ ప్రయాణం ప్రారంభమవుతుంది. నైట్ అంతా జర్నీలోనే ఉంటారు.
  • రెండో రోజు మార్నింగ్ 6 గంటలకు కలంగుట్ కు చేరుకుంటారు. ఉదయం 10 గంటల నుంచి నార్త్ గోవాలోని పలు ప్రాంతాలను చూస్తారు. ఇందులో మపుసా సిటీ, బోగ్దేశ్వర్ ఆలయం, Fort Aguada, బాగా బీచ్ ను చూస్తారు. మరో రెండు బీచ్ లకు కూడా వెళ్తారు.
  • మూడో రోజు సౌత్ గోవాలో ఉంటుంది.ఓల్డ్ గోవా చర్చిలతో పాటు డోనా పౌలా బీచ్ కు వెళ్తారు. Miramar, Mangueshi టెంపుల్, కోల్వా బీచ్, మార్డోల్ బీచ్ ల్లో ఎంజాయ్ చేస్తారు.Pan Jimలో సాయంత్రం క్రూజ్ బోట్‌లో జర్నీఉంటుంది. దీనికోసం మీరే టికెట్ డబ్బులను చెల్లించాలి. ఒక్కరికి రూ. 500గా ఉంటుంది.
  • నాల్గో రోజు కలంగుట్ నుంచి మార్నింగ్ 11 గంటలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఐదో రోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
  • https://tourism.telangana.gov.in/p వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.
  • ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.
IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్

IrctcIrctc PackagesTelangana TourismTourismAp TourismTravel
Source / Credits

Best Web Hosting Provider In India 2024