Siddipet Accident : పెళ్లి రోజే విషాదం, రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Best Web Hosting Provider In India 2024

Siddipet Accident : పెళ్లి రోజే (Wedding Anniversary) ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. పొద్దున్నే భార్య, పిల్లలతో కలిసి దేవాలయానికి వెళ్లి పూజలు చేసి సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చారు. ఆ సంతోషం తీరకముందే రోడ్డు ప్రమాదం(Road Accident) అతన్ని బలి తీసుకుంది. ఈ విషాద సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. సిద్దిపేట (Siddipet)జిల్లా జగదేవపూర్ మండలంలోని తీగుల్ గ్రామానికి చెందిన కందుకూరి వెంకటేశం (43), అనిత దంపతులు. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కాగా వెంకటేశం ప్రజ్ఞాపూర్ లోని విక్టరీ బార్ లో పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శుక్రవారం పెళ్లి రోజు కావడంతో ఆనందంగా కుటుంబంతో కలిసి గ్రామంలోని శివాలయానికి వెళ్లారు. అక్కడ పూజలు చేసి ఇంటి వద్ద భార్యా పిల్లలను దించేశాడు.

ఎదురెదురుగా వస్తున్నా రెండు బైకులు ఢీ కొనడడంతో

అనంతరం బార్ నుంచి ఫోన్ రావడంతో బైక్ పై ప్రజ్ఞాపూర్ కు బయల్దేరాడు. తీగుల్ గ్రామ సమీపంలోకి రాగానే ఎదురుగా గజ్వేల్ నుంచి తీగుల్ వైపు అతివేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం వెంకటేశం బైక్ (Bike Accident)ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశం తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక బైక్ పై ఉన్న వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో మరో బండి వస్తున్న యువకుడికి ఆ రెండు బైకులు తగిలి కింద పడిపోయాడు. అతడికి కూడా గాయాలవడంతో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి(Gajwel govt Hospital)కి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెళ్లి రోజునే వెంకటేశం మృతి చెందడంతో భార్య, పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గజ్వేల్ పోలీసులు తెలిపారు.

పెళ్లి ఇష్టంలేక పురుగుల మందు తాగిన యువతి

పెళ్లి చేసుకోవడం ఇష్టంలేక పెళ్లి చూపుల రోజే ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య(Suicide) చేసుకున్న ఘటన సిద్ధిపేట జిల్లాలో జరిగింది. సిద్దిపేట(Siddipet) జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన రాయన్న మల్లేశం కుమార్తె మౌనిక (22) గ్రామంలో టైలరింగ్ చేస్తూ తల్లిదండ్రులకు ఆర్థికంగా చేదోడువాదోడుగా ఉంటుంది. కాగా ఆమె తల్లిదండ్రులు గత నెల 27న మౌనికకు పెళ్లిచూపులు జరిపించారు.

పెళ్లిచూపులు రోజే

దీంతో ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని మౌనిక అదే రోజు సాయంత్రం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి(Suicide Attempt) పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే గజ్వేల్ ఆసుపత్రి(Gajwel Hospital)కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం మృతి చెందింది. మౌనిక మృతితో కుటుంబసభ్యులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. మృతురాలి తండ్రి మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsSiddipetRoad AccidentTrending TelanganaTelugu News
Source / Credits

Best Web Hosting Provider In India 2024