Army Public School Jobs 2024 : బొల్లారం ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ఉద్యోగాలు – అప్లికేషన్ ప్రాసెస్, ఖాళీల వివరాలివే

Best Web Hosting Provider In India 2024

Army Public School Bolarum Recruitment 2024 : టీచింగ్ పోస్టులతో పాటు పలు నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి సికింద్రాబాద్ బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్(Army Public School Bolarum) ప్రకటన విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు మే 25వ తేదీలోపు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫారమ్ ను వెబ్ సైట్ నుంచి డౌన్లో చేసుకోని… ఆఫ్‌లైన్ విధానంలో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ లో టీజీటీ, పీజీటీ, హెడ్‌మిస్ట్రెస్‌ (నర్సరీ – యూకేజీ), ప్రీ ప్రైమరీ టీచర్స్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, ప్రీ ప్రైమరీ వింగ్‌ (క్లరికల్‌ స్టాఫ్‌, అకౌంట్స్‌ క్లర్క్‌,Adm Supervisor) ఉద్యోగాలను రిక్రూట్ చేయనున్నారు. https://www.apsbolarum.edu.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ముఖ్య వివరాలు:

  • రిక్రూట్ మెంట్ ప్రకటన – బొల్లారం ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌‌(Army Public School Bolarum), సికింద్రాబాద్.
  • టీజీటీ, పీజీటీ, హెడ్‌మిస్ట్రెస్‌ (నర్సరీ – యూకేజీ), ప్రీ ప్రైమరీ టీచర్స్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, ప్రీ ప్రైమరీ వింగ్‌ (clerical staff /Accounts Clerk, Adm Supervisor) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
  • అర్హతలు – డిగ్రీతో పాటు బీఈడీ, పీజీ ఉండాలి. పోస్టును అనురించి అర్హతలను నిర్ణయించారు. టీచింగ్ ఉద్యోగాలకు టెట్ లేదా సెంట్రల్ టెట్ అర్హత పొంది ఉండాలి. కొన్ని పోస్టులకు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
  • దరఖాస్తు విధానం – ఆఫ్ లైన్
  • దరఖాస్తు రుసుం- రూ.250
  • ఎంపిక విధానం – అనుభవం ఆధారంగా నియామకాలు జరుపుతారు.
  • దరఖాస్తులు ఫారమ్ – https://www.apsbolarum.edu.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
  • పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ ను ప్రిన్సిపాల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్, బొల్లారం, జేజే నగర్ పోస్ట్, సికింద్రాబాద్ – 500087 అడ్రస్ కు పంపాలి.
  • అర్హత పత్రాలను పరిశీలించిన తర్వాత… షార్ట్ లిస్ట్ చేస్తారు. వారిని మాత్రమే ఇంటర్వూలకు పిలుస్తారు. 
  • దరఖాస్తులను అసంపూర్ణంగా నింపితే రిజెక్ట్ చేస్తారు.
  • దరఖాస్తు చివరితేదీ – 25,మే, 2024.

ఈ కింద ఇచ్చిన PDFలో పోస్టుల ఖాళీల వివరాలతో పాటు మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు…

Open PDF in New Window

IPL_Entry_Point

టాపిక్

JobsRecruitmentTelangana NewsTrending TelanganaEducation
Source / Credits

Best Web Hosting Provider In India 2024