Best Web Hosting Provider In India 2024
APPSC Marks: ఏపీపీఎస్సీ నిర్వహించిన పలు ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల్ని కమిషన్ ఇటీవల విడుదల చేసింది. టౌన్ ప్లానింగ్‌లో ఉద్యోగాలతో పాటు ఇంజనీరింగ్ సర్వీస్ ఉద్యోగాలు, పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షల మార్కులను విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది జనవరి మధ్య కాలంలో నిర్వహించిన మూడు నోటిఫికేషన్లకు సంబంధించిన మార్కుల జాబితాలను విడుదల చేసింది. గత ఏడాది ఆగష్టు 18న జరిగిన టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్ సీర్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను వెలువరించారు.
11/2022 నోటిఫికేషన్ ద్వారా నాన్ గజిటెడ్ ఉద్యోగాల భర్తీ కోసం ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు హాజరైన మార్కుల జాబితాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఇంజనీరింగ్ సర్వీసెస్ విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన ఉద్యోగాల భర్తీ కోసం 2022లో నోటిఫికేషన్ విడుదల చేశారు. 2022 సెప్టెంబర్ 28న నోటిఫికేషన్ వెలువడింది. గత ఏడాది ఆగష్టు 21న ఈ ఉద్యోగ నియామక పరీక్ష నిర్వహించారు. తాజగా ఈ పరీక్షలకు హాజరైన మార్కుల్ని విడుదల చేశారు.
పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ల భర్తీ కోసం జారీ చేసిన సప్లిమెంటరీ నోటిఫికేషన్ 2023 ఏప్రిల్‌లో నోటిఫికేషన్ జారీ చేశారు. 2023 ఏప్రిల్20న విడుదలైన నోటిఫికేషన్‌లో భాగంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ ఏడాది జనవరి 1న పరీక్ష నిర్వహించారు.
రాష్ట్రీయ ఇండియన్ మెడికల్ కాలేజీ పరీక్ష వాయిదా..
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిన రాష్ట్రీయ మెడికల్ కాలేజీ ప్రవేశ పరీక్షను వాయిదా వేసినట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఆర్‌ఐఎంసి ప్రవేశ పరీక్ష షెడ్యూల్ ప్రకారం జూన్ 1న నిర్వహించాల్సి ఉంది. రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనుండటంతో జూన్ 1న జరగాల్సిన పరీక్షను జూన్ 8న నిర్వహిస్తున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. 2025 జనవరితో మొదలయ్యే టర్మ్ ప్రవేశాల కోసం 2024 జూన్‌లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
సంబంధిత కథనం
టాపిక్