Best Web Hosting Provider In India 2024
Premalu Telugu OTT Streaming: ప్రేమలు సినిమా మలయాళ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ సినిమా భారీ కలెక్షన్లను సాధించింది. నెస్లన్ గఫూర్, మమితా బైజూ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో మలయాళంలో రిలీజై పాజిటివ్ టాక్‌తో అదరగొట్టింది. భారీ వసూళ్లతో ఆశ్చర్యపరిచింది. హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో మార్చి 8న విడుదలైంది. మంచి కలెక్షన్లను సాధించింది. తెలుగులో ఓటీటీలోనూ ప్రేమలు సినిమా దుమ్మురేపుతోంది.
మరో మైల్స్టోన్
ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్ ఏప్రిల్ 12వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు వచ్చింది. తెలుగులోనూ ఈ చిత్రానికి ఫుల్ బజ్ ఉండటంతో మొదటి నుంచే మంచి వ్యూస్ దక్కించుకుంది. తెలుగు చిత్రాలతో పోటీ పడుతూ ఆహా ఓటీటీలో ఈ డబ్బింగ్ మూవీ ట్రెండింగ్‌లోకి వచ్చింది.
ఆహా ఓటీటీలో ప్రేమలు తెలుగు వెర్షన్ తాజాగా మరో మైల్స్టోన్ దాటింది. ఈ చిత్రం 125 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటిందని ఆహా నేడు (మే 6) వెల్లడించింది. “జేకే (జస్ట్ కిడ్డింగ్) లవర్స్ అందరికీ ఇది అంకితం. ప్రేమలు 125 మిలియన్ నిమిషాలను సెలెబ్రేట్ చేస్తున్నాం” అని ఆహా నేడు ట్వీట్ చేసింది.డబ్బింగ్ మూవీకి ఈ రేంజ్లో వ్యూస్ దక్కడం విశేషమే.
ప్రేమలు సినిమా మలయాళంతో పాటు హిందీ, తమిళంలో డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ భాషల్లోనూ ప్రేమలు మంచి వ్యూస్ దక్కించుకుంటోంది.
బ్లాక్‌బస్టర్‌గా ప్రేమలు
ప్రేమలు సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్ అయింది. దాదాపు రూ.5కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ మూవీ సుమారు రూ.136 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ మూవీ తెలుగు వెర్షన్ కూడా థియేటర్లలో సుమారు రూ.15కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ మూవీని తెలుగులో దర్శక ధీరుడు రాజమౌళి కుమారుడు కార్తీకేయ రిలీజ్ చేశారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ ఈవెంట్‌కు రాజమౌళి కూడా హాజరయ్యారు. దీంతో చాలా బజ్ ఏర్పడింది.
ప్రేమలు సినిమాకు గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించారు. కామెడీ ప్రధానంగా ఈ లవ్ మూవీని తెరకెక్కించారు. సరదాగా సాగే ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీలో సచిన్ పాత్రలో నెస్లెన్ గఫూర్, రేణుగా మమితా బైజూస్ యాక్టింగ్ కూడా అదిరిపోయింది. ఈ మూవీతో మమితా చాలా పాపులర్ అయ్యారు.
ప్రేమలు మూవీలో సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల్ భార్గవన్, మాథ్యు థామస్, మీనాక్షి రవీంద్రన్ కీరోల్స్ చేశారు. ఈ చిత్రాన్ని మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్, దిలీశ్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించగా.. విష్ణు విజయ్ సంగీతం అందించారు. ఈ మూవీ తెలుగు వెర్షన్‌కు 90s వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ డైలాగ్స్ రాశారు.
కాగా, మలయాళ ఇండస్ట్రీలో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిన మంజుమ్మల్ బాయ్స్ సినిమా కూడా తాజాగా ఓటీటీలో అడుగుపెట్టింది. మే 5వ తేదీన ఈ చిత్రం మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది.