Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

Best Web Hosting Provider In India 2024

SS Rajamouli: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు భారత సినీ ఇండస్ట్రీలో గొప్ప చిత్రాలుగా నిలిచాయి. బాహుబలి 2 చిత్రం అనేక రికార్డులను బద్దలుకొట్టింది. అయితే, అంతటి ఘన విజయం సాధించిన బాహుబలి పేరుతో రాజమౌళి ఇప్పుడు ఓ యానిమేటెడ్ సిరీస్ తీసుకొస్తున్నారు. బాహుబలి: ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో ఈ సిరీస్ రానుంది. ఇప్పటికే స్ట్రీమింగ్ డేట్ కూడా వెల్లడైంది. ఈ తరుణంలో ఈ యానిమేటెడ్ సిరీస్ కోసం మీడియా ముందుకు రేపు (మే 7) రానున్నారు దర్శకుడు రాజమౌళి.

ఎప్పుడంటే..

బాహుబలి: ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ సిరీస్ కోసం రేపు (మే 7) మధ్యాహ్నం 1 గంటల 30 నిమిషాల సమయంలో మీడియా ముందుకు దర్శకుడు రాజమౌళి రానున్నారు. హైదరాబాద్‍లోని ఏఎంబీ సినిమాస్ వద్ద ఈవెంట్ జరగనుంది. ఈ సందర్భంగానే ఈ యానిమేటెడ్ సిరీస్ తొలి రెండు ఎపిసోడ్ల ప్రత్యేక స్క్రీనింగ్ ఉండనుంది. ఆ తర్వాత మీడియా ప్రశ్నలకు రాజమౌళి సమాధానాలు ఇస్తారు.

బాహుబలి: ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేటెడ్ సిరీస్ మే 17వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఇటీవలే ఈ సిరీస్ ట్రైలర్ కూడా వచ్చింది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. హిందీ, తెలుగుతో పాటు మరిన్ని భాషల్లోనూ ఈ సిరీస్ మే 17న హాట్‍స్టార్ ఓటీటీలో అందుబాటులో రానుంది.

బాహుబలి 1కు ప్రీక్వెల్‍గా బాహుబలి: ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేటెడ్ సిరీస్ వస్తోంది. రక్తదేవ్ అనే రాజుతో బాహుబలి, భళ్లాలదేవ యుద్ధం చేయడం చుట్టూ ఈ సిరీస్ ఉండనుంది.

మహేశ్ మూవీ గురించి చెబుతారా..

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ రేంజ్‍లో రాజమౌళి మరో బ్లాక్‍బస్టర్ సాధించారు. తదుపరి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఆయన సినిమా (SSMB 29) చేయనున్నారు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా.. అప్‍డేట్ ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. దీంతో రాజమౌళి ఏ ఈవెంట్‍లో పాల్గొన్నా.. ఆ ప్రాజెక్ట్ గురించి అప్‍డేట్ ఇస్తారా అనే ఆసక్తి పెరుగుతోంది. బాహుబలి: ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ సిరీస్ కోసం రేపు (మే 7) ఆయన మీడియాతో మాట్లాడనుండగా.. మహేశ్‍తో మూవీ గురించి తప్పకుండా ప్రశ్నలు ఎదురయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దీంతో ఆయన ఈ మూవీపై ఏమైనా అప్‍డేట్ చెబుతారా అనేది ఉత్కంఠగా మారింది. ఏం జరుగుతుంతో చూడాలి.

మహేశ్ బాబు – రాజమౌళి సినిమా షూటింగ్ ఆగస్టు లేకపోతే సెప్టెంబర్‌లో మొదలయ్యే అవకాశం ఉందని ఇటీవల సమాచారం బయటికి వచ్చింది. గ్లోబల్ రేంజ్‍లో అడ్వెంచర్ యాక్షన్ మూవీగా ఇది రూపొందనుంది. సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్‍తో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తారనే రూమర్లు ఉన్నాయి. ఈ చిత్రంలో మహేశ్ కొత్త లుక్‍లో కనిపించనున్నారు.

ఇటీవల, కృష్ణమ్మ సినిమా ఈవెంట్‍లో మహేశ్‍తో సినిమా గురించి అప్‍డేట్ చెప్పాలని రాజమౌళిని దర్శకుడు అనిల్ రావిపూడి అడిగారు. దీంతో, అనిల్‍ను ముసుగేసి కొడితే రూ.10వేలు ఇస్తానంటూ సరదాగా అన్నారు రాజమౌళి.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024