Best Web Hosting Provider In India 2024
Vidya Vasula Aham OTT: రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా ‘విద్యావాసుల అహం’ మూవీ వస్తోంది. పెళ్లయిన కొత్త జంట మధ్య ఈగోలతో ఈ మూవీ సాగుతుంది. కోట బొమ్మాళి పీఎస్ తర్వాత రాహుల్, శివానీ కాంబో మరోసారి రిపీట్ అవుతోంది. థియేటర్లలో రిలీజ్ కాకుండానే నేరుగా ఓటీటీలోకే ఈ ‘విద్యా వాసుల అహం’ రానుంది.
త్వరలో స్ట్రీమింగ్
‘విద్యా వాసుల అహం’ సినిమా గురించి ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ నేడు (మే 6) అప్డేట్ ఇచ్చింది. త్వరలో ఈ మూవీని స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్టు వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.
ఆహాలో విద్యావాసుల అహం త్వరలోనే వస్తుందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆహా. “ఎవరెస్టులో సగం. ఈ విద్య, వాసుల అహం. ఆ కహానీ ఏంటో త్వరలో ఆహాలో చూద్దాం. త్వరలో వచ్చేస్తుంది” అని ఆహా ట్వీట్ చేసింది.
‘విద్యావాసుల అహం’ టైటిల్‌కు ‘ఏ లాంగ్.. లాంగ్ ఈగో స్టోరీ’ అనే క్యాప్షన్ ఉంది. ఈ మూవీకి సంబంధించి టీజర్ గతేడాది డిసెంబర్లోనే వచ్చింది. ఈ మూవీని థియేటర్లలోనే రిలీజ్ చేయాలని ముందుగా భావించినా.. ఇప్పుడు నేరుగా ఆహా ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నారు. కొత్తగా పెళ్లయ్యే విద్య (శివానీ రాజశేఖర్), వాసు (రాహుల్ విజయ్) ఈగోలతో ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నిస్తూ వారు ఎలా ముందుకు సాగారన్నదే ఈ మూవీలో ఉంటుంది.
విద్యావాసుల అహం మూవీకి మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించారు. రాహుల్ విజయ్, శివానీ ప్రధాన పాత్రలు చేయగా.. శ్రీనివాస్ అవసరాల, అభినయ, తనికెళ్ల భరణి, శ్రీనివాసరెడ్డి, మౌనిక రెడ్డి, రవివర్మ, కాశీ విశ్వనాథ్ కీలకపాత్రలు పోషించారు.
విద్యావాసుల అహం చిత్రాన్ని ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మహేశ్ దత్త, లక్ష్మీ నవ్య నిర్మించారు. సీనియర్ మ్యూజిక్ డైెరెక్టర్ కల్యాణి మాలిక్ ఈ చిత్రానికి సంగీతం అందించగా.. అఖిల్ వల్లూరి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను ఆహా త్వరలోనే ప్రకటించనుంది.
గీతాంజలి మళ్లీ వచ్చింది
గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా ఆహా ఓటీటీలో మే 8వ తేదీన స్ట్రీమింగ్కు రానుంది. అంజలి ప్రధాన పాత్ర పోషించిన ఈ హారర్ కామెడీ చిత్రం థియేటర్లలో ఏప్రిల్ 11వ తేదీన రిలీజ్ అయింది. గీతాంజలికి చిత్రానికి పదేళ్ల తర్వాత సీక్వెల్‌గా ఈ మూవీ వచ్చింది. అయితే, ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. దీంతో నెల ముగియకుండానే ఓటీటీలోకి రానుంది. ఆహాలో మే 8 నుంచి గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ స్ట్రీమింగ్ కానుంది.
శివ తుర్లపాటి దర్శకత్వం వహించిన ఈ గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీలో రవి శంకర్, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేశ్, షకలక శంకర్, సత్య, సునీల్ కీరోల్స్ చేశారు. కోన వెంకట్, భాను భోగవరపు కథ అందించారు. ఈ చిత్రాన్ని కోనా ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీపీ సినిమాస్ బ్యానర్లు ప్రొడ్యూజ్ చేయగా.. ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ ఇచ్చారు.