Best Web Hosting Provider In India 2024
Hansika Guardian Review: హన్సిక (Hansika )హీరోయిన్‌గా నటించిన తమిళ (Kollywood) మూవీ గార్డియన్ ఇటీవల థియేటర్లలో రిలీజైంది. ఈ హారర్ మూవీకి శబరి గురు శరవణన్ దర్శకత్వం వహించాడు. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే?
అన్‌లక్కీ అపర్ణ…
అపర్ణను (హన్సిక) చిన్నతనం నుంచి దురదృష్టం వెంటాడుతుంటుంది. ఏది కోరుకున్నా అది జరగదు. చివరకు దేవుడి హారతి తీసుకోవాలని అనుకున్నా అపర్ణ మొక్కడానికి చేతులు పెట్టగానే దీపం ఆరిపోతుంది. ఆమె లవ్‌కు బ్రేకప్ పడిపోతుంది. అందరూ ఆమెను అన్‌లక్కీ అపర్ణ అని పిలుస్తుంటారు. ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న బిల్డింగ్ దగ్గరకు వస్తుంది అపర్ణ. అక్కడ ఆమెకు క్రిస్టల్ (మెరుపు రంగు రాయి) దొరుకుతుంది. అప్పటి నుంచి అపర్ణ జీవితమే మారిపోతుంది.
ఏది కోరుకుంటే అది…
ఆమె ఏది కొరుకుంటే అది జరిగిపోవడం మొదలుపెడుతుంది. కే అనే పెద్ద కన్‌స్ట్రక్షన్ కంపెనీలో జాబ్ వస్తుంది. అపర్ణకు దూరమైన లవర్ ప్రభ కూడా అక్కడే ఆమెకు మళ్లీ తారసపడతాడు. అభిప్రాయభేదాలు తొలగిపోయి ఇద్దరు ఒక్కటవుతారు. ఆఫీస్‌లో తన ప్రాజెక్ట్ మేనేజర్‌తో పాటు కంపెనీ హెడ్ తమ్ముడి కారణంగా అపర్ణతో పాటు మిగిలిన ఉద్యోగులందరూ ఇబ్బందులు పడుతుంటారు. వారిద్దరు చనిపోతే బాగుండునని అపర్ణ కోరుకుంటుంది.
అపర్ణ కోరుకున్నట్లుగా ఆమె కళ్ల ముందే ఇద్దరు దారుణంగా చనిపోతారు. అపర్ణ మనసులో కోరుకున్న కోరికలన్నీ ఎలా నెరవేరుతున్నాయి? ఆమె కోరికలకు ఆ క్రిస్టల్‌కు ఉన్న సంబంధం ఏమిటి? ఆ క్రిస్టల్‌లో బంధించబడిన మీరా అనే ఆత్మ ఎవరు? గౌతమ్, త్యాగు తో పాటు వారి మరో ఇద్దరు స్నేహితులపై మీరా పగతో రగిలిపోవడానికి కారణం ఏమిటి? మీరా ఎలా చనిపోయింది? మీరా జరిగిన అన్యాయంపై అపర్ణ ఎలా ప్రతీకారం తీర్చుకుంది? మీరా కూతురికి గార్డియన్‌గా ఉండటానికి అపర్ణ ఒప్పుకుందా? లేదా అన్నదే ఈ మూవీ(Hansika Guardian Review) కథ.
ఆత్మ రివేంజ్…
విలన్స్ చేతిలో అన్యాయానికి గురైన ఓ యువతి ఆత్మగా మారడం, ఆమె రివేంజ్‌కు హీరో లేదా హీరోయిన్ సాయం చేయడం, ఆ విలన్స్ అందరిని ఆత్మ చంపేయడం అనే కాన్సెప్ట్ తో బ్లాక్ అండ్ వైట్ జమానా నుంచి నేటి వరకు లెక్కకు మించి సినిమాలొచ్చాయి.
ఈ పాయింట్‌ను తిరగేసి, మరగేసి అన్ని రకాలుగా వాడి పీల్చిపిప్పిచేశారు డైరెక్టర్స్. కొత్తగా చూపించడానికి ఈ కథలో మిగిలింది ఏం లేకపోవడంతో దర్శకరచయితలు ఈ హారర్ కాన్సెప్ట్‌నుపక్కనపెట్టేశారు. అయినా అప్పుడప్పుడు ఈ ఔట్‌డేటెడ్ పాయింట్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. గార్డియన్(Hansika Guardian Review) కూడా అలాంటి కథే.
1990 ట్రెండ్…
ఈ సినిమా స్టోరీతో పాటు…యాక్టింగ్, కామెడీ, హారర్ అంశాలన్నీ 1990ల కాలం నాటి ట్రెండ్‌ను గుర్తుకుతెస్తాయి. ఈ సినిమా రిజల్ట్‌ను హన్సికతో పాటు మిగిలిన ఆర్టిస్టులు కూడా ముందుగానే ఊహించినట్లున్నారు. ఎలాగోలా సినిమాను పూర్తిచేయాలి అన్న భావనే వారి యాక్టింగ్‌లో కనిపిస్తుంది.
ఒక్కరంటే ఒక్కరు కూడా తమ క్యారెక్టర్స్‌ను ఓన్ చేసుకోలేకపోయారు. ఒకప్పుడు హారర్ సినిమాల్లో దయ్యాలను వికృత మేకప్‌గా చూపించేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. దయ్యాలను కూడా మోడ్రన్‌గా చూపిస్తున్నారు. గార్డియన్‌లో(Hansika Guardian Review) మాత్రంహారర్ ఎలిమెంట్స్‌తో కాకుండా మేకప్‌తోనే ఆడియెన్స్‌ను భయపెట్టాలని దర్శకుడు ఫిక్సైనట్లున్నాడు. హన్సిక ఆత్మగా కనిపించే సీన్స్‌ను చిత్ర విచిత్రమైన మేకప్ సీన్స్‌తో నింపేశాడు.
ఆరంభం ఇంట్రెస్టింగ్ కానీ…
ఈ సినిమా ప్రారంభమైన పదిహేను నిమిషాల్లోనే క్లైమాక్స్ ఏమిటో చెప్పేయచ్చు. అంత ఈజీగా కథ, స్క్రీన్‌ప్లేను రాసుకున్నాడు. మలుపులు, సర్‌ప్రైజ్‌లు ఏవి ఉండదు.ఈ సినిమా ప్రారంభం మాత్రం కాస్తంగా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది.
దురదృష్టవంతురాలిగా ముద్రపడిన హన్సిక జీవితంలో ఆమె ఎది కోరుకున్న అది జరగడం, ఆమె కోరుకున్నవాళ్లంతా ఒక్కొక్కరుగా చనిపోవడం వరకు సినిమా కొత్తగానే అనిపిస్తుంది. ఎప్పుడైతే మీరా ఎపిసోడ్ ప్రారంభమవుతుందో అక్కడి నుంచే రొటీన్ టెంప్లేట్ హారర్ స్టోరీలోకి కథ ఎంటరవుతుంది. మీరాకు జరిగిన అన్యాయం, విలన్స్‌పై ఆమె పగతీర్చుకునే సీన్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి పేర్చుకున్నట్లుగా సీన్స్ వస్తాయి.
నవ్వించని కామెడీ…
మోట్ట రాజేంద్రన్ కామెడీ నవ్వు తెప్పించలేదు. అపర్ణ లవ్‌స్టోరీ ఓ పాట నాలుగైదు సీన్స్‌కు పరిమితమైంది. మీరా కూతురి ఎపిసోడ్‌లో ఎమోషన్స్ సరిగా పండలేదు. చెప్పుకుంటూ పోతే సినిమాలో ప్లస్‌ల కంటే మైనస్ లిస్ట్ పెద్దగా ఉంటుంది.
హన్సిక బ్యాడ్ ఛాయిస్
అపర్ణ పాత్రలో హన్సిక కొత్తగా చేసిందేమి లేదు. నటిగా ఎలాంటి ఛాలెంజెస్ లేని పాత్ర కావడంతో హన్సిక ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయింది. ఓ టైమ్‌లో ఆమె ఈ సినిమాకు బ్యాడ్‌ఛాయిస్ అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. చాలా సీన్స్‌లో ఆమె ఎక్స్‌ప్రెషన్‌కు, సీన్‌కు సంబంధం కుదరదు. మిగిలిన వారి నటన గురించి ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఏం లేదు.
ఔట్‌డేటెడ్ హారర్ మూవీ
గార్డియన్(Hansika Guardian Review) రొటీన్ ఔట్‌డేటెడ్ హారర్ మూవీ. హన్సిక యాక్టింగ్, కథ, కథనాలతో పాటు మిగిలిన అంశాల్లో పాత వాసనలే కనిపించే ఈ మూవీ ప్రేక్షకుల్ని మెప్పించడం కష్టమే.