Ooty, Kodaikanal: వేసవి సెలవుల్లో ఊటీ, కొడైకెనాల్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా, వెళ్లాలంటే ఈపాస్ తప్పనిసరి..

Best Web Hosting Provider In India 2024

Ooty, Kodaikanal: నీలగిరి, కొడైకెనాల్‌లో సేద తీరాలనుకునే పర్యాటకులకు నేటి నుంచి తమిళనాడు ప్రభుత్వం జారీ చేసే ఈపాస్‌ తప్పనిసరి చేశారు. మే 7 నుంచి జూన్ 30 వరకు నీలగిరి, కొడైకెనాల్ వెళ్లే పర్యాటకులను తీసుకెళ్లే వాహనాలను అనుమతించడానికి ఈ-పాస్ విధానాన్ని ప్రవేశపెట్టాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మద్రాసు హైకోర్టు ఆదేశాలతో మే 7 మంగళవారం నుంచి ఊటీ , కొడైకెనాల్ వెళ్లే పర్యాటకులకు రిజిస్ట్రేషన్, ‎ఈపాస్‌ కలిగి ఉండాల్సి ఉంటుంది. ఊటీ, కొడైకెనాల్‌ పర్యటనతో పాటు అక్కడ బస చేయడానికి ముందస్తు అనుమతి పొందాలి.

పర్యాటకులు తమ వ్యక్తిగత వివరాలు, వాహనాల నంబరు, ఊటీ, కొడైకెనాల్ వచ్చే రోజు, బస చేసే రోజులు వంటి వివరాలను ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది.

ఊటీలో పర్యటించాలనుకునే పర్యాటకులు, వ్యాపారులు, తమ వివరాలను www.epass.tnega.org వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ పాస్‌ ద్వారా పర్యాటకుల రద్దీని క్రమబద్ధీకరించ వచ్చని భావిస్తున్నారు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 30వరకు మాత్రమే ఈ పాస్ విధానం అమలు కానుంది.

ప్రభుత్వం జారీ చేసే ఈ-పాస్ లో క్యూఆర్ కోడ్ ఉంటుందని, చెక్ పోస్టులలో సిబ్బంది వాటిని స్కాన్ చేస్తారని కలెక్టర్ ఎం.అరుణ తెలిపారు. తమిళనాడు ఈ-గవర్నెన్స్ ఏజెన్సీ (టీఎన్ఈజీఏ)తో కలిసి తాము ఒక సాఫ్ట్ వేర్‌ రూపొందించామని, ఇందులో ప్రజలు దరఖాస్తు చేసుకుని నీలగిరిలోకి ప్రవేశించవచ్చని నీలగిరి జిల్లా కలెక్టర్ ఎం.అరుణ తెలిపారు.

పర్యాటకులు చేయాల్సిందల్లా పేరు, చిరునామా, నీలగిరిలో ఎన్ని రోజులు ఉండబోతున్నారు, ఉండబోయే ప్రదేశం, అందుబాటులో ఉన్న వాహనం పేరు, కొన్ని ప్రాథమిక వివరాలను ఇవ్వాలి “.

ఆ తర్వాత ఈ-పాస్ జనరేట్ అవుతుంది. ఈపాస్ లో క్యూఆర్ కోడ్ ఉంటుంది, దీనిని చెక్ పోస్టులో స్కాన్ చేస్తారు. వాహనాల సంఖ్య, పర్యాటకుల సంఖ్యపై ఎలాంటి ఆంక్షలు లేవని స్థానికులకు సంబంధించి ఈ-పాస్ ల నుంచి మినహాయింపు ఇచ్చినట్టు కలెక్టర్ తెలిపారు. నీలగిరి జిల్లా రిజిస్ట్రేషన్ నంబర్ “టిఎన్ 43” కలిగి ఉన్న నీలగిరి జిల్లాలో నివసించే పౌరులు ఆ వాహనాలకు ఇ-పాస్ అవసరం లేదు.

అదే ప్రత్యేకత…

నీలగిరి, దాని సహజ ఆకర్షణ మరియు ఆహ్లాదకరమైన వాతావరణం కారణంగా యూరోపియన్లకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 1818లో కోయంబత్తూరు కలెక్టరుకు సహాయకులుగా ఉన్న విష్, కిండర్స్లీ లు రెంగస్వామి శిఖరానికి సమీపంలో కోటగిరి అనే ప్రదేశాన్ని కనుగొన్నారు. అప్పటి కోయంబత్తూరు కలెక్టరు జాన్ సుల్లివన్ కు ఈ ప్రాంతంపై ఎంతో ఆసక్తి ఉండేది. ఆయన అక్కడ తన నివాసాన్ని స్థాపించి 1819 జూలై 31 న బోర్డ్ ఆఫ్ రెవెన్యూకు రిపోర్టు ఇచ్చారు.

‘నీలగిరి’ అంటే నీలి కొండలు (నీలం – నీలం గిరి – కొండ లేదా పర్వతం) ఈ పేరు యొక్క మొదటి ప్రస్తావన సిలప్పడికారంలో కనుగొన్నారు. కొండల అడుగున ఉన్న మైదాన ప్రాంతాల్లో నివసించే ప్రజల వల్ల నీలగిరి అనే పేరు వచ్చి ఉంటుందని, కొండ శ్రేణులను అప్పుడప్పుడు కప్పి ఉంచే ‘కురింజి’ పూలకు ఉండే ఊదారంగు పూల కారణంగా పర్వతాలకు ఈ పేరు వచ్చి ఉంటుందని ఒక నమ్మకం ఉంది. డబ్ల్యు ఫ్రాన్సిస్ రచనల ప్రకారం నీలగిరి రాజకీయ చరిత్రకు సంబంధించిన తొలి ప్రస్తావన మైసూరు గంగా రాజవంశ చరిత్రలో ఉంటుంది.

1789 లో నీలగిరి బ్రిటిష్ వారికి అప్పగించిన తర్వాత కోయంబత్తూరు జిల్లాలో భాగంగా మారింది. 1868 ఆగస్టులో కోయంబత్తూరు జిల్లా నుండి నీలగిరి వేరు చేశారు. జేమ్స్ విల్కిన్సన్ బ్రీక్స్ నీలగిరి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టాడు.

1882 ఫిబ్రవరిలో నీలగిరిని ఒక జిల్లాగా చేసి కమిషనర్ స్థానంలో ఒక కలెక్టరును నియమించారు. 1882 ఫిబ్రవరి 1న అప్పటి కమీషనర్ గా ఉన్న రిచర్డ్ వెల్లస్లీ బార్లో నీలగిరి మొదటి కలెక్టరు అయ్యారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్

TravelTamil Nadu NewsTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
Source / Credits

Best Web Hosting Provider In India 2024