Satya Movie: స‌త్య ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసిన ఎనిమిది మంది టాలీవుడ్‌డైరెక్ట‌ర్లు – మూవీ విడుద‌ల‌ ఎప్పుడంటే?

Best Web Hosting Provider In India 2024

Satya Movie: హ‌మ‌రేష్‌, ప్రార్ధ‌నా సందీప్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న స‌త్య మూవీ మే 10న థియేట‌ర్ల‌లో విడుద‌ల అవుతోంది. వాలీ మోహన్‌దాస్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స‌త్య మూవీ ట్రైల‌ర్‌ను ఎనిమిది మంది టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ క‌లిసి ఒకేసారి రిలీజ్ చేశారు. ఈ మూవీని శివ మ‌ల్లాల ప్రొడ్యూస్ చేస్తోన్నాడు.

యూత్ ల‌వ్‌స్టోరీ…

యూత్‌ఫుల్ ల‌వ్‌స్టోరీగా స‌త్య మూవీ తెర‌కెక్కుతోంది. గాజువాక గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్ నుంచి ఓ కార్పొరేట్ స్కూల్‌లో స‌త్య అనే స్టూడెంట్ ఎందుకు చేరాల్సివ‌చ్చింది? పార్వ‌తితో ప‌రిచ‌యం శివ జీవితంలో అల్ల‌రి మ‌న‌స్త‌త్వంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది అనే అంశాల‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు ట్రైల‌ర్ చూస్తుంటే క‌నిపిస్తోంది.

ట్రైల‌ర్ రిలీజ్ వేడుక‌లో…డైరెక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ “ హమరేష్ చూడడానికి జీవీ ప్రకాష్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన‌ప్పుడు ఎలా ఉన్నాడో అలాగే క‌నిపిస్తున్నాడు. నిర్మాత శివ మల్లాల నాకు నా కెరీర్ మొదలుపెట్టినప్పటి నుండి తెలుసు. నిర్మాత‌గా అత‌డి తొలి మూవీ పెద్ద సక్సెస్ కావాలి” అని అన్నారు

లోపాలు లేకుండా…

సతీష్ వేగేశ్న మాట్లాడుతూ” ఇండస్ట్రీలో శివ మ‌ల్లాల డే వన్ నుండి ఈరోజు వర‌కు ఒకేలా ఉన్నారు. ఆయ‌న మంచిత‌నం, ప్ర‌వ‌ర్త‌న‌లో ఎప్పుడు మార్పు క‌నిపించ‌లేదు. ఇప్పుడు స‌త్య మూవీతో నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రతి సినిమాకి ఫ్రైడే రోజు అలా తియ్యొచ్చు ఇలా తియ్యొచ్చు అని రివ్యూలు చెప్తూ ఉంటాడు శివ మ‌ల్లాల‌. శివ నే సినిమా నిర్మిస్తున్న‌ప్పుడు కచ్చితంగా అలాంటి లోపాలు ఏమి లేకుండానే చేస్తాడు అనుకుంటున్నాను” అని తెలిపారు.

థియేట‌ర్ల‌లో జ‌నాలు లేరు…

“నేను సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ మానేసి స్నేహ గీతం సినిమా తీసినప్పుడు థియేటర్ లో జనాలు లేరు, చాలా హర్ట్ అయ్యాను, అప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది, శివ మల్లాల నుండి, మీరు ఇండస్ట్రీలో మంచిగా సక్సెస్ అవుతారు అని. సినిమా బాగుంది అని అప్రిసియేషన్ ఇచ్చాడు అది నాకు చాలా ఎనర్జీ ఇచ్చింది. ప్ర‌తి ఏడాది తెలుగులో విడుద‌ల‌య్యే డ‌బ్బింగ్ సినిమాల్లో కొన్నే విజయాల‌ను అందుకుంటాయి, ఈ సత్య సినిమా విజువల్స్ చూస్తుంటే కచ్చితంగా ఆ జాబితాలో ఈ సినిమా నిలుస్తుంద‌ని అనిపిస్తుంద‌ని” మ‌ధుర శ్రీధ‌ర్ తెలిపారు.

త‌మిళంలో రంగోళి …

స‌త్య సినిమాలో యాక్టర్స్ అందరూ దాదాపు కొత్త వారే కానీ అంద‌రి న‌ట‌న బాగుంద‌ని ప‌వ‌న్ సాదినేని అన్నాడు. సినిమా రివ్యూల్లో శివ జ‌డ్జిమెంట్ బాగుంటుంద‌ని, అది ఈ సినిమా విష‌యంలో రుజువు కావాల‌ని డైరెక్ట‌ర్ అర్జున్ అన్నాడు.

దర్శకుడు వాలి మోహన్ దాస్ మాట్లాడుతూ “ తమిళంలో ఈ సినిమాని నేను రంగోలి పేరుతో తెర‌కెక్కించారు. ఈ రొమాంటిక్ మూవీని శివ మల్లాల తెలుగులో స‌త్య పేరుతో రిలీజ్ చేస్తున్నాడు” అని చెప్పారు.

మే 10న రిలీజ్‌…

నిర్మాత శివ మల్లాల మాట్లాడుతూ “స‌త్య మూవీ చూసి రివ్యూ చెప్పాల‌ని అనుకున్నాను, కానీ సినీమా చూడగానే నాకు బాగా నచ్చింది వెంటనే వాలి మోహన్ దాస్ కి కాల్ చేసి అభినందించారు. తెల్లవారుజామున 4 గంటలకి వాలికి నేను అడ్వాన్స్ ఇచ్చాను. ఈరోజు స‌త్య మూవీ ట్రైలర్ లాంచ్ చేయ‌డానికి ఎనిమిది మంది డైరెక్టర్స్ రావ‌డం చాలా హ్యాపీగా అనిపించింది.10 న సత్య సినీమా వస్తుంది. అందరూ తప్పకుండా చూడండి” అని పేర్కొన్నారు.

IPL_Entry_Point

టాపిక్

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024