Aavesham OTT Release Date: ఆవేశం ఓటీటీ రిలీజ్ డేట్.. రూ.150 కోట్ల సినిమా స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

Best Web Hosting Provider In India 2024

Aavesham OTT Release Date: ఆవేశం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఈ మూవీ ఊహించినదాని కంటే ముందే అంటే మే 9నే ప్రైమ్ వీడియోలోకి రానున్నట్లు ఈ మధ్యే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మరో కొత్త తేదీ తెరపైకి వచ్చింది. మే 9న కాదు.. మే 17న ఈ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు జీక్యూ ఇండియా రిపోర్టు వెల్లడించింది.

ఆవేశం ఓటీటీ రిలీజ్ డేట్

మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటించిన ఆవేశం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రైమ్ వీడియో దక్కించుకున్నా.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అనేది మాత్రం ఆ ప్లాట్‌ఫామ్ వెల్లడించలేదు. నిజానికి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది.

తాజాగా రూ.150 కోట్ల మార్క్ అందుకుంది. 2018, మంజుమ్మెల్ బాయ్స్, ది గోట్ లైఫ్, పులిమురుగన్ సినిమాల తర్వాత ఈ ఘనత సాధించిన ఐదో మలయాళ సినిమాగా ఈ ఆవేశం నిలిచింది. ఇలాంటి సమయంలో ఈ సినిమా నెల రోజులు కూడా కాకముందే మే 9 నుంచే ఓటీటీలోకి వస్తుందన్న వార్తలు ఆశ్చర్యం కలిగించాయి. ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్ శ్రీధర్ పిళ్లై ఈ విషయాన్ని వెల్లడించారు.

కానీ ఆవేశం మూవీ మే 17న ప్రైమ్ వీడియోలోకి రాబోతోందని తాజాగా మరో రిపోర్టు చెబుతోంది. దీనిపై ప్రైమ్ వీడియో అధికారిక ప్రకటన జారీ చేస్తేగానీ ఈ గందరగోళానికి తెరపడేలా లేదు. ఏప్రిల్ 11న థియేటర్లలో ఆవేశం రిలీజైంది. 26వ రోజు కూడా ఈ సినిమా ఇండియాలో రూ.1.1 కోట్లు వసూలు చేయడం విశేషం. దీంతో డొమెస్టిక్ మార్కెట్లో మొత్తం కలెక్షన్లు రూ.80.7 కోట్లకు చేరాయి.

మలయాళ నామ సంవత్సరం

2024ను మలయాళ సినిమా నామ సంవత్సరంగా చెప్పొచ్చు. ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే ఆ ఇండస్ట్రీ నుంచి రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన సినిమాలు నాలుగు రావడం విశేషం. వీటిలో మంజుమ్మల్ బాయ్స్ అయితే అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాగా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇది కాకుండా ది గోట్ లైఫ్, ప్రేమలు, ఆవేశం సినిమాలు కూడా రూ.100 కోట్లకుపైగా వసూలు చేశాయి. ఇక ఇదే ఏడాది రిలీజైన భ్రమయుగం కూడా రూ.85 కోట్లు రాబట్టింది. మొత్తంగా మలయాళ ఇండస్ట్రీలోని టాప్ 10 కలెక్షన్ల లిస్టులో ఐదు సినిమాలు ఈ ఏడాది రిలీజైనవే కావడం విశేషం. అది కూడా మొదటి నాలుగు నెలల్లోనే అంటే నమ్మగలరా?

తాజాగా ఆవేశం మూవీ రూ.150 కోట్ల మార్క్ కూడా దాటేసి ఫహాద్ ఫాజిల్ కెరీర్లో అతిపెద్ద హిట్ గా నిలిచింది. జీతూ మాధవన్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. థియేటర్లలో సినిమాకు వచ్చిన రెస్పాన్స్ నేపథ్యంలో ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024