Best Web Hosting Provider In India 2024
Murder in Mahim OTT: ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‍లు చాలా వచ్చేస్తున్నాయి. ఓటీటీల్లో ఈ జానర్‌కు మంచి క్రేజ్ కనిపిస్తోంది. క్రైమ్, ఇన్వెస్టిగేషన్, ఉత్కంఠతో ఉండే ఈ సిరీస్‍లకు మంచి వ్యూవర్‌షిప్ వస్తోంది. ఈ క్రమంలో ‘మర్డర్ ఇన్ మహిమ్’ పేరుతో మరో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. విజయ్ రాజ్, అషుతోశ్ రాణా, శివానీ రఘువంశీ ఈ సిరీస్‍లో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మర్డర్ ఇన్ మహిమ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది.
స్ట్రీమింగ్ వివరాలు
‘మర్డర్ ఇన్ మహిమ్’ వెబ్ సిరీస్ మే 10వ తేదీన జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇటీవలే వచ్చిన టీజర్ కూడా ఇంట్రెస్టింగ్‍గా ఉండటంతో ఈ సిరీస్‍పై ఆసక్తి నెలకొంది.
ఆరు భాషల్లో..
‘మర్డర్ ఇన్ మహిమ్’ సిరీస్ ఆరు భాషల్లో మే 10న స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానుంది. హిందీతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్‍కు వస్తుంది.
మర్డర్ ఇన్ మహిమ్ వెబ్ సిరీస్‍కు రాజ్ అచార్య దర్శకత్వం వహించారు. ముంబైలోని మహిమ్ అనే రైల్వే స్టేషన్‍లో జరిగే ఓ యువకుడి మర్డర్ మిస్టరీని ఛేదించడం చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. 2013 బ్యాక్‍డ్రాప్‍లో ఈ సిరీస్ ఉంటుంది. ఈ హత్య కేసును విచారించే పీటర్ (అషుతోశ్ రాణా) కుమారుడే ఈ కేసులో అనుమానితుడుగా ఉంటాడు. ఈ మర్డర్ మిస్టరీ ఏంటనేది ఈ వెబ్ సిరీస్‍లో ఉంటుంది.
మర్డర్ ఇన్ మహిమ్ సిరీస్‍లో విజయ్ రాజ్, రాణా, శివానీతో పాటు శివాజీ సతమ్, స్మిత తాంబే, దివ్య జగల్దే, రాజేశ్ ఖట్టర్ కీలకపాత్రలు పోషించారు. జిగ్‍షా పిక్చర్స్ ప్రొడక్షన్స్, టిప్పింగ్ ప్యాయింట్ సిరీస్ బ్యానర్లు ప్రొడ్యూజ్ చేశాయి. అజిత్ అంధారే నిర్మాతగా వ్యవహరించారు.
జియోసినిమా కొత్త ప్లాన్‍లు
జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఇటీవలే రెండు కొత్త ప్రీమియమ్ ప్లాన్‍లను ప్రవేశపెట్టింది. రూ.29కే నెలవారి ప్లాన్ లాంచ్ చేసింది. ఈ ప్లాన్ తీసుకుంటే జియోసినిమాలో ప్రీమియమ్ కంటెంట్‍ను చూడొచ్చు. ఈ ప్లాన్ ద్వారా ఒక డివైజ్‍లు చూడొచ్చు. అలాగే, రూ.89 నెలవారీ ప్లాన్‍ను కూడా జియోసినిమా తీసుకొచ్చింది. ఈ ప్లాన్ సబ్‍స్క్రైబ్ చేసుకుంటే నాలుగు డివైజ్‍ల్లో యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే, ఈ ప్లాన్‍లను తీసుకుంటే సినిమాలు, వెబ్ సిరీస్‍లను యాడ్స్ లేకుండా చూడొచ్చు.
కాగా, జర హట్కే జర బచ్కే సినిమా మే నెలలోనే జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రానుంది. 2023 జూన్‍లో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ రొమాంటిక్ కామెడీ సినిమా సుమార్ 11 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. విక్కీ కౌశల్, సారా అలీఖాన్ ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటించారు. లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించిన జర హట్కే జర బచ్కే చిత్రాన్ని దినేశ్ విజన్, జ్యోతీ దేశ్‍పాండే ఈ మూవీని నిర్మించారు.