Wednesday Motivation: ఈ జపాన్ పద్ధతులను పాటిస్తే ప్రతి వ్యక్తి శాంతిగా, సహనంగా, ఆనందంగా జీవిస్తాడు

Best Web Hosting Provider In India 2024

Wednesday Motivation: ప్రస్తుతం జీవిస్తున్న వేగవంతమైన ప్రపంచంలో ఒత్తిడి, భావోద్వేబాగాలు ఎక్కువైపోతున్నాయి. ప్రతికూలమైన భావోద్వేగాల కారణంగా మనసు ప్రశాంతంగా ఉండడం లేదు. దీనివల్ల జీవితం కూడా అల్లకల్లోలంగా మారుతుంది. అంతర్గత శాంతి, ప్రశాంతత, ఆనందాన్ని పొందేందుకు ప్రసిద్ధ జపనీస్ భావనలో కొన్ని ఉన్నాయి. వీటిని పాటిస్తే ప్రశాంతంగా జీవించవచ్చు.

అటవీ స్నానం

జపనీయుల్లో వ్యక్తిగత ఆనందానికి ప్రాముఖ్యత ఇస్తారు. వారానికి ఒక్కసారైనా మనసుకు, శరీరానికి ప్రశాంతత కలిగేలా ఫారెస్ట్ బాతింగ్ కు వెళ్తారు. అంటే అడవిలో ఉండే సెలయేర్లు లేదా జలపాతం కింద స్నానం చేస్తారు. ఆకుపచ్చటి చెట్ల మధ్య కొన్ని గంటల పాటు గడుపుతారు. వారానికి కనీసం రెండు మూడు గంటలు అలా గడపడం వల్ల వారికి ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది. దీన్ని ‘షిన్రిన్ యోకు’ అని పిలుస్తారు. అంటే జపాన్ లో అటవీ స్నానం అని అర్థం. ఇలా చేయడం వల్ల వారిలో ఒత్తిడి, రక్తపోటు, మానసిక సమస్యలు తగ్గుతున్నట్టు శాస్త్రీయంగా కూడా నిరూపణ అయింది.

ఆరోగ్యకర ఆహారం

మనతో పోలిస్తే జపనీయులు పాతిక శాతం దాక తక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తింటారు. ఇలా తినడం వల్ల వారి కాలేయం ఆరోగ్యంగా ఉంటున్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే ఆహారంలో పౌష్టికాహారం అధికంగా ఉండేట్టు చూసుకుంటారు. వారి ఆహారంలో చేపలు తప్పనిసరి. పాలతో చేసిన టీకి బదులుగా గ్రీన్ టీ ని తాగుతారు. ఇలా చేపలు, గ్రీన్ టీ అధికంగా తాగడం వల్ల వారికి అధిక ఆరోగ్యం సిద్ధిస్తోంది.

ఇకిగై

జపాన్లోని ఒకినావా అనే నగరంలోని ప్రజలు ఇకిగై అనే భావనను ఫాలో అవుతారు. ఈ భావన ప్రకారం జీవితానికి ఒక అర్థం ఉండాలని, జీవితాన్ని విలువైనదిగా భావించాలని చెబుతారు. ఇతరుల గురించి ఆలోచించాలని, మొక్కలు, జంతువులు, మానవులు అందరూ ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ జీవించాలని ఇకిగై అర్థం.

జపాన్ ప్రజలు పాడటంపై సానుకూల అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. పాట పాడేటప్పుడు లోతైన శ్వాస తీసుకోవాలి. అలా జరుగుతున్నప్పుడు ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని, ఆ పాట విని ఎదుటి వ్యక్తులు చప్పట్లు కొడుతుంటే, వారిలో విశ్వాసం పెరుగుతుందని, ఒత్తిడి తగ్గుతుందని వారి నమ్మకం. దాదాపు 20,000 మంది పురుషులపై ఈ పరిశోధనలు చేసి ఇదే నిజమని తెలిపారు.

వాబి -సాబి

జపాన్లో ఇంకా ఎన్నో పద్ధతులను ఫాలో అవుతూ ఉంటారు. వాబి సాబి అనేది కూడా జపనీస్ తత్వ శాస్త్రం చెబుతున్న ఒక అలవాటు. ఇది రోజువారి జీవితంలో అసంపూర్ణత లేకుండా చూసుకోమని చెబుతుంది. కష్టాలు, సుఖాలు, జననం, మరణం అంటూ సహజ జీవితచక్రాన్ని అంగీకరించమని ఈ వాబిసాబి వివరిస్తోంది. ఈ భావనను స్వీకరించడం వల్ల ప్రజలు ప్రశాంతంగా జీవించగలుగుతారు.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024