Medchal Building Tragedy: భారీ వర్షాలతో మేడ్చల్‌ జిల్లా బాచుపల్లిలో కూలిన భవనం, ఏడుగురు వలస కార్మికుల మృతి ,

Best Web Hosting Provider In India 2024

Medchal Building Tragedy: భారీ వర్షాలకు వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌ గోడ కూలి కార్మికులు ఉంటున్న రేకులషెడ్డుపై పడటంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు.

మేడ్చల్‌ జిల్లా బాచుపల్లిలో ఈ ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌ కూలిపోవడంతో దాని పక్కనే షెడ్డులో ఉంటున్న ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు గోడ నాని కార్మికులు ఉంటున్నన షెడ్డుపై పడింది.

సెంట్రింగ్‌ పనుల కోసం వచ్చిన కార్మికులు కన్‌స్ట్రక్షన్‌ సైట్‌లోనే రేకుల షెడ్డు వేసుకుని ఉంటున్నారు. వీరంతా ఒడిశా రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. వీరితో పాటు ఒడిశా, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలకు చెందిన కార్మికులు అపార్ట్‌మెంట‌్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో ఉంటున్నారు.

ఆరిజన్ కన్‌స్ట్రక్షన్‌ సంస్థకు చెందిన ప్రాజెక్టు సైట్‌లో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, జిహెచ్‌ఎంసి, ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితుల్ని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

మృతుల్లో మహిళతో పాటు నాలుగేళ్ల చిన్నారి కూడా ఉన్నారు. చనిపోయిన వారిలో శంకర్‌, రాంయాదవ్, ఖుషి, గీత, హిమంషు, రాజు ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిని వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ప్రమాదంలో మరో నలుగురు కార్మికులు కూడా గాయడపడ్డారు. వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు హైదరాబాద్‌లో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.  నిర్మాణంలో ఉన్న భవనాల సెల్లార్లలోకి నీరు రావడంతో  ప్రమాదం జరిగి ఉంటుందని  అనుమానిస్తున్నారు. 

IPL_Entry_Point

టాపిక్

AccidentsMedchal MalkajgiriTs PoliceNdrfGhmc
Source / Credits

Best Web Hosting Provider In India 2024