Best Web Hosting Provider In India 2024
Baak Collections: తమన్నా, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించిన బాక్ (తమిళంలో అరాణ్మణై 4) మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఐదు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ 30 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీకి తొలిరోజు నెగెటివ్ టాక్ వచ్చింది.
ఈ విమర్శలతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద ఈ హారర్ మూవీ వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. తమిళ వెర్షన్ ఐదు రోజుల్లోనే లాభాల్లోకి అడుగుపెట్టింది. కోలీవుడ్‌లో ఈ ఏడాది బ్యాడ్‌ఫేజ్ నడుస్తోంది. కెప్టెన్ మిల్లర్, అయలాన్‌తో మినహా తమిళంలో పెద్దగా హిట్స్ లేవు. గత మూడు నెలలుగా సరైన సక్సెస్‌లు లేక డీలా పడిన కోలీవుడ్ వర్గాలకు అరాణ్మణై 4 సక్సెస్ బిగ్ రిలీఫ్‌గా మారిందని ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
తెలుగులో ఐదు రోజుల్లో మూడు కోట్లు…
తమిళంలో కోట్లు కుమ్మరిస్తోన్న ఈ మూవీ తెలుగులో మాత్రం నిరాశపరిచింది. బాక్ మూవీ ఐదు రోజుల్లో కేవలం రెండున్నర కోట్ల లోపే వసూళ్లను రాబట్టింది. మంగళవారం రోజు ఈ మూవీకి ఇరవై ఐదు లక్షల వరకు వసూళ్లు వచ్చాయి. తమన్నా, రాశీఖన్నాలకు తెలుగులో ఉన్న క్రేజ్ కారణంగా శుక్ర,శనివారాల్లో బాక్ మూవీ భారీగానే ఓపెనింగ్స్ రాబట్టింది. సినిమాపై నెగెటివ్ టాక్ రావడం, సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో ఆదివారం నుంచి వసూళ్లను ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. వీక్ డేస్‌లో ఈ మూవీ కలెక్షన్స్ పరంగా పూర్తిగా డల్ అయ్యింది.
తమిళంలో రివర్స్…
తమిళంలో మాత్రం అరాణ్మణై 4 వసూళ్లు రోజురోజుకు పెరుగుతోన్నాయి. ఐదు రోజుల్లో తమిళంలో ఈ మూవీ 27.50 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. మంగళవారం రోజు తమిళ వెర్షన్‌కు మూడు కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. దాదాపు 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో అరాణ్మణై 4 మూవీ రిలీజైంది. మంగళవారం నాటి కలెక్షన్స్‌తో ఈ మూవీ లాభాల్లోకి అడుగుపెట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
తమన్నా, రాశీఖన్నాలకు సక్సెస్…
అరాణ్మణై 4కు ముందు రాశీఖన్నా, తమన్నాలకు తెలుగు, తమిళ భాషల్లో సక్సెస్‌లు లేవు. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తోన్న వారికి అరాణ్మణై 4 ఏకంగా బ్లాక్‌బస్టర్‌ను అందించింది.బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ యాభై కోట్ల వరకు వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
బాక్ కథ ఇదే…
శివాని (తమన్నా) పెద్దలను ఎదురించి ప్రేమవివాహం చేసుకుంటుంది. అనూహ్య పరిస్థితుల్లో శివానితో పాటు ఆమె భర్త కూడా చనిపోతాడు. ఈ హత్యల వెనకున్న మిస్టరీని లాయర్ శివశంకర్‌తో(సుందర్ సి) పాటు డాక్టర్ మాయ (రాశీఖన్నా) ఎలా రివీల్ చేశారన్నది ఈ మూవీ కథ. అరాణ్మణై 4లో లీడ్ రోల్‌లో నటిస్తూనే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు సుందర్ సి. అరాణ్మణై ఫ్రాంచైజ్‌లో సుందర్ సి తెరకెక్కిన హారర్ సినిమాలన్నీ కమర్షియల్ హిట్స్‌గా నిలిచాయి. కాగా అరాణ్మణై 4 మూవీ ఓటీటీ రైట్స్‌ను జీ5 దక్కించుకున్నది. నెల రోజుల్లోనే ఈ హారర్ మూవీ ఓటీటీలో రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.