Garlic Rice: అన్నం మిగిలిపోతే ఇలా వెల్లుల్లి రైస్ చేసి చూడండి, పులిహోర కన్నా అదిరిపోతుంది

Best Web Hosting Provider In India 2024

Garlic Rice: వెల్లుల్లి రైస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రుచి కూడా అదిరిప్తుంది. అన్నం మిగిలిపోయినప్పుడు చాలామంది చేసే పని లెమన్ రైస్ లేదా ఎగ్ రైస్ చేయడం. ఎప్పుడూ ఆ రెండే కాదు ఒకసారి వెల్లుల్లి రైస్ కూడా చేసి చూడండి. ఇది టేస్టీగా ఉంటుంది. అంతేకాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు మన రోగనిరోధక శక్తిని కాపాడతాయి. వెల్లుల్లి రైస్ చేయడం చాలా సులువు. రెసిపీ ఇక్కడ ఇచ్చాము.

వెల్లుల్లి రైస్ రెసిపీకి కావలసిన పదార్థాలు

వండిన అన్నం – ఒక కప్పు

వెల్లుల్లి – పది రెబ్బలు

జీలకర్ర – అర స్పూను

ఆవాలు – అర స్పూను

పచ్చిమిర్చి – నాలుగు

మిరియాలు – మూడు

మినప్పప్పు – అర స్పూను

వేరుశనగలు – గుప్పెడు

నిమ్మకాయ – అర చెక్క

ఉల్లిపాయ – ఒకటి

నూనె – మూడు స్పూన్లు

ఉప్పు – రుచికి సరిపడా

పసుపు – చిటికెడు

వెల్లుల్లి రైస్ రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

2. ఆ నూనెలో వెల్లుల్లి వేసి ఎర్రగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.

3. అందులోనే జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడించాలి.

4. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసి వేయించాలి.

5. ఆ తర్వాత ఉల్లిపాయలను కూడా వేసి బాగా వేయించుకోవాలి.

6. ఆ మిశ్రమంలోనే ఎండుమిర్చి, శెనగపప్పు, మినప్పప్పు, వేరుసెనగలు, మిరియాలు వేసి వేయించుకోవాలి.

7. ఇవన్నీ వేగాక చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి.

8. ఇప్పుడు ముందుగా వండిన అన్నాన్ని అందులో వేసి కలుపుకోవాలి.

9. ముందుగా వేయించి పెట్టుకున్న వెల్లుల్లిని సన్నగా తరిగి ఈ అన్నం పైన చల్లుకొని బాగా కలపాలి.

10. చివరలో నిమ్మరసం పిండుకోవాలి.

11. చిన్నమంట మీదే ఓ రెండు నిమిషాలు వేయించాలి. పైన కొత్తిమీర తరుగును చల్లి స్టవ్ కట్టేయాలి.

12. అంతే గార్లిక్ రైస్ రెడీ అయినట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.

వెల్లుల్లిని ప్రతి ఒక్కరూ తినాలి. ఇది ఏ సీజన్లోనైనా మన ఆరోగ్యాన్ని కాపాడేందుకు సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, విటమిన్ బి.. వంటివి అంటు వ్యాధులు బారిన పడకుండా కాపాడతాయి. పొత్తికడుపు దగ్గర పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో వెల్లుల్లి ముందుంటుంది. వెల్లుల్లి తరచూ తినేవారు ఊబకాయం బారిన పడకుండా ఉంటారు. వెల్లుల్లి పొడి చేసి కూరల్లో కలుపుకోవడం మంచిది. లేదా ఆ వెల్లుల్లి పొడిని గోరువెచ్చని నీటిలో వేసి తాగినా మంచిదే. అప్పుడప్పుడు పులిహోర, ఎగ్ రైస్ వంటి వాటితో పాటు ఈ గార్లిక్ రైస్ ని కూడా ప్రయత్నించండి.

WhatsApp channel

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024