HCU Admissions 2024 : హైదరాబాద్ సెంట్రల్‌ వర్సిటీలో పీజీ ప్రవేశాలు – ముఖ్య తేదీలివే

Best Web Hosting Provider In India 2024

Hyderabad University PG Admissions 2024: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ నుంచి పీజీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. 2024 -2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ ప్రవేశాలు ఉంటాయి. మొత్తం 41 కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు.

సీయూఈటీ (పీజీ)-2024 స్కోర్ ఆధారంగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తారు. సీయూఈటీ పీజీ ఎంట్రెన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మే 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

సీయూఈటీ పీజీ స్కోర్ మాత్రమే కాకుండా… ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీట్ల ప్రక్రియ ఉంటుంది. ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూన్ 5వ తేదీన ప్రకటిస్తారు. జూన్ 12వ తేదీ నుంచి ఇంటర్వూలు ప్రారంభం అవుతాయి. జూన్ 14వ తేదీతో ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది.

పీజీ ప్రవేశాలకు సంబంధించిన మెరిట్ జాబితా వెల్లడి జూలై 01వ తేదీన అందుబాటులోకి తీసుకువస్తారు. ఆగస్టు 1వ తేదీ నుంచి తరగతుల ప్రారంభమవుతాయి. https://uohyd.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు.

ముఖ్య వివరాలు :

పీజీ ప్రవేశాల ప్రకటన – హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ.

MA, MSc, MBA, ఎంవీఏ, ఎంఈడీ, ఎంపీహెచ్‌, ఎంపీఏ, ఎంఎఫ్‌ఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 41 సబ్జెక్టులు ఉన్నాయి.

అర్హతలు – సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత పొందాలి. సీయూఈటీ (పీజీ)-2024 స్కోరు సాధించి ఉండాలి.

సీయూఈటీ (పీజీ)-2024 స్కోర్ మాత్రమే కాకుండా… ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.

దరఖాస్తు విధానం – ఆన్ లైన్

దరఖాస్తు రుసుము – జనరల్‌ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.125గా నిర్ణయించారు.

ఆన్‌లైన్ అప్లికేషన్లకు చివరి తేదీ 15-మే-2024.

ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల లిస్ట్: 05-జూన్-2024.

ఇంటర్వ్యూలు ప్రారంభం – 12 జూన్ 2024.

ఇంటర్వూలకు చివరి తేదీ – 14-జూన్-2024.

మెరిట్ లిస్ట్ విడుదల – 01-జూలై-2024.

ధ్రువపత్రాల పరిశీలన తేదీ – 29-జూలై-2024.

తరగతుల ప్రారంభం – 01-ఆగస్టు-2024.

అధికారిక వెబ్ సైట్ – https://uohyd.ac.in/

అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో Phd ప్రవేశాలు

BRAOU Phd admissions Updates: పీహెచ్డీ(Phd admissions) చేయాలనుకునే వారికి అప్డేట్ ఇచ్చింది హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ(BRAOU). 2023-24 విద్యా సంవత్సరానికి ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా…..మే 3వ తేదీ వరకు గడువు ఉంది. రూ.500 ఆలస్య రుసుంతో మే 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ప్రవేశాలను ఇంగ్లీష్, హిందీ, ఎడ్యుకేషన్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌మెంటల్ సైన్స్‌‌ తో పాటు మరికొన్ని కోర్సుల్లో నిర్వహిస్తారు. మే 25వ తేదీన ఈ ఎంట్రెన్స్ పరీక్ష ఉటుందని అధికారులు తెలిపారు. https://ts-braouphdcet.aptonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు. వివరాలు కోసం 040-23544741/040-23680411/040-23680498 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

IPL_Entry_Point

టాపిక్

HyderabadAdmissionsEducation
Source / Credits

Best Web Hosting Provider In India 2024