Partner OTT: రెండు ఓటీటీల‌లో రిలీజైన‌ హ‌న్సిక క‌న్ఫ్యూజ‌న్ కామెడీ మూవీ – అబ్బాయి…అమ్మాయిగా మారితే!

Best Web Hosting Provider In India 2024

Partner OTT: ఆది పినిశెట్టి, హ‌న్సిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన పార్ట్‌న‌ర్ మూవీ బుధ‌వారం ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఆహా త‌మిళ్ ఓటీటీలో ఈ కామెడీ మూవీ రిలీజైంది. ఇప్ప‌టికే ఈ త‌మిళ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

తాజాగా ఆహా త‌మిళ్ ద్వారా ఓటీటీ ఆడియెన్స్‌కు అందుబాటులోకి వ‌చ్చింది. ఈ నెల‌లోనే పార్ట్‌న‌ర్ మూవీ తెలుగులోనూ రిలీజ్‌ కాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆహా ఓటీటీలోనే విడుద‌ల అవుతోన్న‌ట్లు స‌మాచారం. తెలుగు వెర్ష‌న్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను తొంద‌ర‌లోనే అనౌన్స్‌చేసే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

అబ్బాయి….అమ్మాయిగా మార‌డం…

పార్ట‌న‌ర్ మూవీకి మ‌నోజ్ దామోద‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాలో ఆదిపినిశెట్టి, హ‌న్సిక‌తో పాటు యోగిబాబు, ప‌ల‌క్ ల‌ల్వానీ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఓ సైంటిస్ట్ చేసిన ప్ర‌యోగం కార‌ణంగా ఓ అబ్బాయి…అమ్మాయిగా మార‌డం అనే కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు మ‌నోజ్ దామోద‌ర‌న్ పార్ట్‌న‌ర్ మూవీని తెర‌కెక్కించాడు. పాయింట్ కొత్త‌గా ఉన్నా ఆశించిన స్థాయిలో కామెడీ పండ‌క‌పోవ‌డంతో సినిమా ఫెయిలైంది.

తెలుగులో రిలీజ్ కాలేదు…

గ‌త ఏడాది అగ‌స్ట్‌లో పార్ట్‌న‌ర్‌ మూవీని తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి రిలీజ్ చేయాల‌ని ప్రొడ్యూస‌ర్స్‌ అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తికాక‌పోవ‌డంతో తెలుగు వెర్ష‌న్ వాయిదాప‌డింది. త‌మిళ వెర్ష‌న్ మాత్ర‌మే రిలీజైంది. త‌మిళంలో ఈ మూవీ డిజాస్ట‌ర్ కావ‌డంతో తెలుగు వెర్ష‌న్ థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కాలేదు.

పార్ట్‌న‌ర్ మూవీ క‌థ ఇదే…

శ్రీధ‌ర్ (ఆది పినిశెట్టి) వ్యాపారంలో న‌ష్ట‌పోయి అప్పుల పాల‌వుతాడు. ఆప్పు తీర్చ‌డం కోసం సిటీలో సాఫ్ట్‌వేర్ కంపెనీ ర‌న్ చేసే త‌న స్నేహితుడు క‌ళ్యాణ్(యోగిబాబు) ద‌గ్గ‌ర‌కు వ‌స్తాడు శ్రీధ‌ర్‌. పెద్ద మొత్తంలో శ్రీధ‌ర్‌కు డ‌బ్బు అవ‌స‌రం అవుతుంది. ఆ డ‌బ్బు కోసం ఓ సైంటిస్ట్ త‌యారు చేసిన చిప్‌ను దొంగిలించి జాన్ విజ‌య్ అనే వ్య‌క్తికి ఇవ్వ‌డానికి డీల్ కుద‌ర్చుకుంటారు శ్రీధ‌ర్‌. ఆ చిప్ దొంగిలించే క్ర‌మంలో సైంటిస్ట్ చేసిన ప్ర‌యోగం కార‌ణంగా శ్రీధ‌ర్ ఫ్రెండ్ క‌ళ్యాణ్ అమ్మాయిగా (హ‌న్సిక‌) మారిపోతాడు.

ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? అమ్మాయిగా మారిన క‌ళ్యాణ్‌కు ఎలాంటి క‌ష్టాలు ఎదుర‌య్యాయి? శ్రీధ‌ర్ ప్రేమించిన డాక్ట‌ర్ (ప‌ల్ల‌క్ ల‌ల్వానీ) అత‌డిని ఎందుకు అపార్థం చేసుకున్న‌ది? జాన్ విజ‌య్ బారి నుంచి శ్రీధ‌ర్‌, క‌ళ్యాణ్ ఎలా త‌ప్పించుకున్నారు? క‌ళ్యాణ్ మ‌ళ్లీ అబ్బాయిగా మారాడా? లేదా? అన్న‌దే పార్ట్‌న‌ర్ మూవీ క‌థ‌.

హ‌న్సిక బ్యాడ్‌టైమ్‌…

గ‌త కొన్నేళ్లుగా తెలుగు త‌మిళ భాష‌ల్లో హ‌న్సిక బ్యాడ్‌టైమ్ న‌డుస్తోంది. డిఫ‌రెంట్ స్టోరీస్‌ను ఎంచుకుంటూ ఆమె చేసిన 105 మినిట్స్‌, మై నేమ్ ఈజ్ శృతితో పాటు ఇటీవ‌ల రిలీజైన హార‌ర్ మూవీ గార్డియ‌న్ కూడా ఫెయిల‌య్యాయి. అయినా త‌మిళంలో మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది హ‌న్సిక‌.

పార్ట్‌న‌ర్ త‌ర్వాత కెరీర్‌కు ఏడాది పాటు బ్రేక్ ఇచ్చిన ఆది పినిశెట్టి ప్ర‌స్తుతం శ‌బ్దం పేరుతో ఓ బైలింగ్వ‌ల్ మూవీ చేస్తోన్నాడు. వైశాలి త‌ర్వాత ఆది పినిశెట్టి, డైరెక్ట‌ర్ అరివ‌జ‌గ‌న్ కాంబోలో శ‌బ్ధం మూవీ తెర‌కెక్కుతోంది.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024