Best Web Hosting Provider In India 2024
మార్కాపురం నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు
ప్రకాశం జిల్లా: “ప్రతి ఇంటికి లబ్ధి జరిగితేనే ఓటేయండి”అని పిలుపునిచ్చిన ధీరశాలి, దమ్ము, ధైర్యం ఉన్న సాహసి, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని నినాదంతో ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజల వద్దకు వచ్చిన నేత సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని మార్కాపురం నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. మార్కాపురం నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పొదిలి మండలంలోని ఆముదాలపల్లి, నిమ్మవరం, సల్లోడివారిపాలెం,తీగదూర్తిపాడు, రాములవీడు, కేశవబొట్లపాలెం, పాములపాడు, గొల్లపల్లి, సింగంరెడ్డిపల్లి, సూదనగుంట్ల, రామాపురం, ఈగలపాడు గ్రామాల్లో ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్ ఆశీర్వదించి మీ దగ్గరికి పంపించారని.. ఆయన గర్వపడేలా ప్రజలతో మమేకమవుతానని.. మే 13న జరిగే ఎన్నికల్లో ఓటు వేసి ఆశీర్వదించాలని ప్రజలను ఆయన కోరారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నా రాంబాబు.. ఆయా గ్రామాల్లోని ప్రతి గడపకు వెళ్లి జగనన్న పాలనలో చేసిన మంచిని వివరించారు. మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. జగనన్నను మరోసారి సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలతో, విప్లవాత్మకమైన సంస్కరణలతో అన్ని వర్గాల్లోని పేదలకు అండగా నిలిచారన్నారు.
మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, అండగా ఉంటానని ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు. మే 13 న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ముందుగా ఆయా గ్రామాల్లోని పలువురు వైయస్ఆర్‌సీపీ నాయకులు, ప్రజలు పలువురు వైయస్ఆర్‌సీపీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, ఎమ్మెల్యేను భారీ గజమాలతో ఘనంగా సన్మానించి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమం లో పలువురు వైయస్ఆర్‌సీపీ ముఖ్య నాయకులు, వైయస్ఆర్‌సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.