Best Web Hosting Provider In India 2024
Karthika deepam 2 serial today may 14th episode: నరసింహ జరిగిన అవమానం తలుచుకుని రగిలిపోతాడు. అక్కడ దాన్ని వాడు మాత్రమే కాదు అందరూ వెనకేసుకుని వచ్చారు. ముందు వాడు కొట్టాడు తర్వాత ఆ పెద్దావిడ కొట్టింది. తర్వాత ఇద్దరూ కలిసి కొట్టారని అంటాడు. చెప్తే వినకుండా వెళ్ళి తన్నులు తిని వచ్చావని అనసూయ తిడుతుంది.
దీప జోలికి వెళ్లొద్దు
దీప జోలికి వెళ్లొద్దని దాని బతుకు ఏదో బతుకు బతుకుతుంది. నేను ఈ ఇంట్లో ఉండగా అది మీ జోలికి రాదు. పెద్దావిడని కాపాడినందుకు వాళ్ళందరూ దాన్ని నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నారు. వాడు దీపని తీసుకుని ఇంట్లో పెట్టుకోవడం వెనుక ఏదో ఉందని నాకు అర్థం అయ్యింది.
నువ్వు ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుంటే డబ్బున్న వాళ్ళు కేసులు పెడతారు ఇంకేమైనా చేస్తారని అనసూయ భయపడుతుంది. కానీ నరసింహ మాత్రం దాన్ని వదిలిపెట్టేది లేదని అనుకుంటాడు. కార్తీక్ నరసింహ మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
నా కోడలిని బాధపెట్టొద్దు
కాంచన వచ్చి ఏం ఆలోచిస్తున్నావ్ అంటుంది. శ్రీధర్ కోపంగా మాట్లాడతాడు. జ్యోత్స్న ఫోన్ చేసిందని చెప్తాడు. నీకు ఆరోజే చెప్పాను అనవసరమైన విషయాల్లో తలదూర్చవద్దని అంటాడు. నువ్వు మా గురించి ఆలోచించకపోయిన పరవాలేదు కోడలి గురించి ఆలోచించమని చెప్తాడు.
మొదటి సారి కోడలు ఏడుపు విన్నాను. తనని బాధ పెట్టొద్దని కాంచన కూడా కార్తీక్ కి చెప్తుంది. దీప విషయంలో కార్తీక్ ని శ్రీధర్ తప్పుబడతాడు. తప్పు చేస్తున్నావ్ నువ్వు లండన్ లో ఉన్నప్పుడు బావ ఎప్పుడు వస్తాడని ఆనందంగా ఉండేది. కానీ నువ్వు ఇప్పుడు కళ్ళ ముందు ఉంటూ దాన్ని కన్నీళ్ళు పెట్టిస్తావని అనుకోలేదు.
పెళ్లి ముహూర్తాలు పెట్టించాల్సిందే
జ్యోత్స్న ఏడుపు నేను చూడలేను. ఎందుకంటే అది మా అమ్మ. మా నాన్న తనకు ఆ పేరు పెట్టాడు. మేం దాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటే నువ్వు దాన్ని ఏడిపిస్తున్నావని అంటుంది. వీడికి ఎన్ని చెప్పినా అనవసరం బావతో మాట్లాడి వీళ్లిద్దరికీ పెళ్లి ముహూర్తాలు పెట్టించాల్సిందే రేపే ఆ పని చేస్తున్నామని శ్రీధర్ తెగేసి చెప్తాడు.
మీకోక విషయం చెప్తాను అప్పటి వరకు మీరు పెళ్లి విషయంలో తొందరపడొద్దని కార్తీక్ తండ్రిని రిక్వెస్ట్ చేస్తాడు. జ్యోత్స్న రగిలిపోతుంటే పారిజాతం వచ్చి మరింత ఆజ్యం పోస్తుంది. మగాడు పెళ్లి కానీ పిల్ల వెంట పడితే అది ప్రేమ అవుతుంది. అదే పెళ్లి అయిన దాని వెంట పడితే మంచిది కాదు.
కార్తీక్ ఇంటికి వెళ్లిపోదాం
నీ బావని నీ వాడిని చేసుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు. అది దీప ఉంటే జరగదు. అది వెళ్లిపోతే మీ పెళ్లి సంగతి చూడు. ఈ ఇంట్లో ఏం జరగాలంటే మీ అమ్మ దగ్గర నీ బాధని రెట్టింపు చేసి చూపించు. ఇప్పుడు నీ జీవితం నీ చేతిలోనే ఉంది. చేజారిపోక ముందే జాగ్రత్త పడమని సలహా ఇస్తుంది.
శౌర్యని స్కూల్ లో చేర్పిస్తానని దీప చెప్తుంది. రేపటి నుంచి నేను వంట పని చేయడానికి వెళ్తున్నాను ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఆడుకోమని చెప్తుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లకూడదా అని శౌర్య అడుగుతుంది. జో, జో గ్రాని నాతో మాట్లాడటం లేదు వాళ్ళకి మనం ఇక్కడ ఉండటం ఇష్టం లేదా అని అడుగుతుంది.
మనం కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్లిపోదామా? తను నాతో మాట్లాడతాడు నన్ను ప్రేమగా చూసుకుంటాడు. నీలాగే అని చెప్తుంది. దీప శౌర్యని కోప్పడుతుంది. అందరి గురించి చెప్తే కొప్పడలేదు, కార్తీక్ గురించి చెప్తే ఎందుకు కొప్పడతావ్. తను నిన్నేమైన బాధపెట్టాడా? అని అడుగుతుంది.
సాఫీగా సాగుతున్న వంటలక్క బిజినెస్
దీప మాత్రం మౌనంగా ఉంటుంది. దీప హోటల్ లో పని చేస్తుంది. హోటల్ వ్యాపారం బాగా నడిచేందుకు దీప వేసిన ఐడియా వేస్తుంది. దీప చేసిన ఉప్మా బాగుందని కస్టమర్స్ మెచ్చుకుంటారు. కార్తీక్ దీప పని చేస్తున్న హోటల్ దగ్గరకు వస్తాడు. ఇలాగైన దీప తన కాళ్ళ మీద నిలబడినందుకు సంతోషపడతాడు.
కార్తీక్ ని చూసి దీప మొహం కోపంగా పెడుతుంది. హోటల్ లో కస్టమర్ లాగా వచ్చానని చెప్తాడు. దీప చేసిన వంటని మెచ్చుకుంటాడు. ఏదైనా సాయం కావాలంటే తనని అడగమని అంటే వద్దని కోపంగా చెప్తుంది.