Krishna mukunda murari serial: కృష్ణని గొడ్రాలన్న మీరా.. ముకుందకు ప్రపోజ్ చేసేందుకు ఫిక్స్ అయిన ఆదర్శ్

Best Web Hosting Provider In India 2024

Krishna mukunda murari serial today may 14th episode: సరోగసి మథర్ మన ఇంట్లో ప్రాబ్లమని కృష్ణ ఆందోళన చెందుతుంది. నిజం బయట పడితే ఏం చేస్తారు. పైగా దీని వల్ల మనం ఆదర్శ్ ని బలి చేస్తున్నాం. ఆదర్శ్ మీరాని ప్రేమిస్తున్నాడు. పెద్దత్తయ్య వాళ్లిద్దరికీ పెళ్లి చేయాలని అనుకుంటున్నారు.

ఆదర్శ్ ఇక నన్ను క్షమించడు 

మీకు లాగే నేను ఈ పెళ్లి వద్దని చెప్తే ఏం చేయాలి. తీగ లాగితే మన కథ బయటకు వస్తుంది. ఇవేమీ ఆలోచించకుండా ఆవిడ ఏదో ఆలోచనతో మీ బిడ్డని మోస్తాను అనగానే ఆలోచించకుండా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా ఒప్పుకున్నారని నిలదీస్తుంది.

ఇప్పటికే ఆదర్శ్ నా మొహం చూడటం లేదు. ముకుంద నావల్ల చనిపోయింది అనుకుంటున్నాడు. ఇప్పుడు మీరా కూడా నా వల్ల తనకు కాకుండా పోతుందని తెలిస్తే ఇక ఈ జన్మకి నన్ను క్షమించడు. మీరు తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయో తెలుసా అని బాధపడుతుంది.

కృష్ణ కోసం స్పెషల్ వంటలు 

ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మన బిడ్డ గురించి. అన్ని మర్చిపోయి మీరాని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. అందరూ భోజనం చేస్తుంటే కృష్ణ కోసం స్పెషల్ గా పెట్టిన వంటలు పెట్టమని భవానీ చెప్తుంది. ఇక నుంచి మేమందరం తినేవి నువ్వు తినకూడదని చెప్తుంది.

మీరా ఎదురుగా లేకపోయి ఉంటే ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పి మ్యానేజ్ చేస్తూ ఉండేదాన్ని. కానీ బిడ్డని మోస్తున్న తల్లిని ఎదురుగా పెట్టుకుని నటించలేకపోతున్నందుకు కృష్ణ చాలా బాధపడుతుంది. బిడ్డని మోస్తుంది నేను అయితే నువ్వు భోగాలు అనుభవించడం ఏంటి? ఈ సంతోషం కూడా నీకు మిగలనివ్వనని ముకుంద మనసులో అనుకుంటుంది.

నువ్వు కడుపుతో ఉన్నావా?

కృష్ణ కోసం చేసిన స్పెషన్ వంటకాలు తనకు కూడా పెట్టమని ముకుంద అడుగుతుంది. ఏంటి నీకు పెట్టాలా నువ్వు కడుపుతో ఉన్నావా అని రజిని అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నావని కృష్ణ అంటుంది. మీ వాలకం చూస్తుంటే నువ్వు కడుపుతో ఉన్నట్టు లేదు ముకుంద బిడ్డని మోస్తున్నట్టు ఉందని అంటుంది.

ముకుంద కోరికలు కడుపుతో ఉన్న వాళ్ళ కోరికలు ఉన్నట్టు ఉన్నాయని రజిని అంటుంది. పెళ్లి కానీ వాళ్ళ గురించి అలా మాట్లాడొద్దని భవానీ వారిస్తుంది. ఈ స్పెషల్ ఫుడ్స్స్ టేస్ట్ చేసే టైమ్ ముందు ముందు ఉందిలే అని రేవతి అంటే ముకుంద ముసిముసిగా నవ్వుతూ తెగ సిగ్గుపడిపోతూ ఆదర్శ్ వైపు చూస్తుంది.

ప్రపోజ్ చేస్తా 

అది చూసి కృష్ణ, మురారి టెన్షన్ పడతారు. ఆదర్శ్ ముకుంద గురించి ఆలోచిస్తూ తెగ మురిసిపోతాడు. రెండు రోజుల్లో నీ బర్త్ డే రాబోతుంది నీకు గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాను. నాకు తెలుసు ముకుంద నువ్వు కూడా ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నావ్. నీకు తప్పకుండా ప్రపోజ్ చేస్తానని అనుకుంటాడు.

మీరా ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది. ఆ సిగ్గుపడటం ఏంటి? ఇంకా ఆదర్శ్ కి ఆశలు పెరుగుతాయి కదా అనుకుంటూ ఉండగా అదర్స్ వచ్చి సంతోషంగా మురారిని హగ్ చేసుకుంటాడు. ముకుంద అంటే చాలా ఇష్టమని నీకు తెలుసు కదా. తనకు కూడా నేను అంటే ఇష్టమని అర్థం అయ్యింది. ఇందాక పిన్ని అన్న మాటలకు ముకుంద నావైపు చూసేసరికి కన్ఫామ్ అయ్యింది.

గతాన్ని మర్చిపోయి హ్యాపీగా ఉంటా 

అమ్మకి కూడా ఈ విషయం చెప్పాను అమ్మ ఒకే అంటే అంతా హ్యాపీ అంటాడు. మురారి డల్ గా ఉండటం చూసి ఏమైందని కంగారుగా అడుగుతాడు. ఏం లేదని చెప్తాడు. ముకుందని పెళ్లి చేసుకుని గతాన్ని మర్చిపోయి హ్యాపీగా ఉంటానని ఆదర్శ్ అంటాడు.

పెళ్లి అని ఏదేదో మాట్లాడుతున్నాడు దీనంతటికీ కారణం మీరానే ముందు తనతో మాట్లాడాలని మురారి ఫిక్స్ అవుతాడు. కృష్ణ కోపంగా మీరా దగ్గరకు వస్తుంది. మనం ఉన్న పొజిషన్ ఏంటని కృష్ణ తిడుతుంది. నీ అంతట నువ్వే సరోగసి మథర్ గా ఒప్పుకుని ఇప్పుడు ఈ వేషాలు ఏంటని నిలదీస్తుంది.

మీరాని నిలదీసిన కృష్ణ 

కడుపులో బిడ్డని పెట్టుకుని ఆదర్శ్ లో ఆశలు ఎందుకు రేకెత్తిస్తున్నావని తిడుతుంది. నీ మనసులో అలాంటి ఆలోచనలు ఉంటే ఎందుకు సరోగసికి ఒప్పుకున్నావ్. మీ కుటుంబం అంటే ఇష్టం గౌరవం అని నమ్మించి ఏసీపీ సర్ ని ఒప్పించి ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావని కృష్ణ ప్రశ్నిస్తుంది.

ఆదర్శ్ ని చూసి సిగ్గుపడటం ఏంటని అరుస్తుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావ్ నాకు ఆదర్శ్ అంటే ఇష్టం లేదు నేను తనని పెళ్లి చేసుకొను. కృష్ణ బిడ్డని నేను మోస్తున్నాను. కృష్ణ తల్లి కాదు. తను గొడ్రాలు జీవితంలో తనకు పిల్లలు కలగరని చెప్పనా అంటుంది.

మీరా మాటలకు కృష్ణ బాధపడుతుంది. నువ్వు గర్భవతివని నటిస్తున్నావ్ కదా నేను అంతే నటిస్తున్నానని చెప్తుంది. కానీ అలా చేయడం వల్ల ఆదర్శ్ నీ మీద ఆశలు పెంచుకుంటున్నాడు కదా అంటుంది. ఇప్పుడు పెంచుకోవడం ఏంటి ఎప్పటి నుంచో ఉన్నాడు.

ఏంటి నీ నాటకాలు 

తను వదిలేస్తాడు అనుకుని నాకేం తెలుసు. మీ అత్తయ్య కూడా ఇలా అనుకుంటుందని నేనేమైనా కల గన్నానా? అంటుంది. నీకు ఏ ఉద్దేశం లేనప్పుడు ఆదర్శ్ తో ఎందుకు క్లోజ్ గా ఉంటున్నావని కృష్ణ నిలదీస్తుంది. నువ్వు ఇలా ఉంటే నీకు ఇష్టం ఉందని అనుకుంటారు కదా మా అత్తయ్య అలా అన్నప్పుడు సిగ్గుపడటం ఎందుకని అంటుంది.

ఆదర్శ్ తోనే నువ్వంటే ఇష్టం లేదని చెప్పొచ్చు కదా. ఇంకొక విషయం కూడా తెలిసింది. ఆదర్శ్ తో సంగీత పెళ్లి చేస్తానని మాట ఇచ్చావంట కదా. ఆదర్శ్ కి విషయం చెప్పకుండా మా దగ్గర సరోగసిగా ఉండటం ఏంటి నీ నాటకాలు మీరా అని నిలదీస్తుంది.

మాటలతో మభ్యపెట్టిన మీరా 

ఆదర్శ్ మొహం మీద నిజం చెప్పడం నాకు క్షణం పని. నా వెంట పడుతున్న రోజే నో చెప్పాలని అనుకున్నాను కానీ ముకుందని దూరం చేసుకుని బాధపడుతున్నాడు. ఇప్పుడు నేను కాదని చెప్తే డిప్రెషన్ లోకి వెళ్లిపోతాడని మౌనంగా ఉన్నాను. వీలు చూసుకుని చెప్పాలని అనుకున్నాను.

ఆదర్శ్ ని నేను కోరుకుంటే రజిని మేడమ్ కి నేను మాట ఎందుకు ఇస్తాను. అలా అనుకుంటే నీ బిడ్డని నేను ఎందుకు కడుపులో మోస్తాను. ఆదర్శ్ ని పెళ్లి చేసుకుంటే నాకు బిడ్డ పుట్టదా? నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో తెలుసా? నువ్వు ఈడేది ఆలోచించకుండా నన్ను మాటలు అంటున్నావ్. నీ మంచి కోసం ఆలోచించడం నా తప్పు అయ్యిందా అని తనని తప్పుదోవ పట్టిస్తుంది.

వాళ్ళకి పెళ్లి చేసేద్దాం 

అప్పుడే ఆదర్శ్ వస్తే తనతో వెళ్ళిపోతుంది. భవానీ ఆదర్శ్, ముకుంద గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రేవతి, కృష్ణని పిలిపించి మాట్లాడుతుంది. ఆదర్శ్, ముకుందకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నట్టు భవానీ చెప్పగానే కృష్ణ షాక్ అవుతుంది. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతుందని భయపడుతుంది.

ఈ పెళ్లి ఎంత త్వరగా జరిగితే అంత మంచిదని అంటుంది. పంతులిని పిలిపించి ముహూర్తం పెట్టించాలని చెప్తుంది. వీలైనంత త్వరగా వాళ్ళ పెళ్లి చేద్దామని రేవతి కూడా అంటే కృష్ణ కంగారుగా వద్దని అనేస్తుంది. అక్కడితో నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్ ముగిసింది. 

తరువాయి భాగంలో..

మురారి, కృష్ణ, మీరా రెస్టారెంట్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు మీ ఇద్దరి పెళ్లి చేస్తే బాగుండేదని అనుకునేది నువ్వు సిగ్గుపడుతూ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ కి కన్ఫర్మేషన్ కి వచ్చేసిందని కృష్ణ చెప్తుంది. నేను ఇప్పుడు నిజమైన గర్భవతిని నన్ను ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. కానీ ఎందుకు మీరు నాతో ఇలా ఆడుకుంటున్నారు. నీ గర్భం పోయింది గొడ్రాలివి అని బయట పడకుండా ఇంట్లో నాటకం ఆడుతున్నావ్ అని ముకుంద అంటుంది.

 
IPL_Entry_Point
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024