Best Web Hosting Provider In India 2024
Tabu in Dune series: బాలీవుడ్, టాలీవుడ్ లలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఒకప్పటి అందాల నటి టబు ఇప్పుడు ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్ డ్యూన్: ప్రాఫెసీలో నటించబోతోంది. వెరైటీ మ్యాగజైన్ రిపోర్డు ప్రకారం.. టబు ఈ సిరీస్ లో సిస్టర్ ఫ్రాన్సెస్కా పాత్రలో కనిపించనుంది. 2019లో అనౌన్స్ అయిన ఈ సిరీస్ రిలీజ్ డేట్ ను మాత్రం ఇంకా వెల్లడించలేదు.
డ్యూన్ సిరీస్‌లో టబు
డ్యూన్: ప్రాఫెసీ అనేది ఓ అమెరికన్ టీవీ సిరీస్. ఫ్రాంక్ హెర్బర్ట్ క్రియేట్ డ్యూన్ ప్రపంచ నేపథ్యంలోనే ఈ సిరీస్ ను చిత్రీకరించారు. ఇందులో బాలీవుడ్ నటి టబు కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఆమె చేస్తున్న ఈ పాత్ర పేరు సిస్టర్ ఫ్రాన్సెస్కా. ఈ పాత్ర చాలా బలమైదని చెబుతున్నారు. “బలమైన, తెలివైన, ఆకర్షణీయమైన సిస్టర్ ఫ్రాన్సెస్కా పాత్ర ప్రేక్షకులపై ఓ బలమైన ముద్ర వేస్తుంది. ఒకప్పుడు చక్రవర్తి ప్రేయసిగా ఉన్న ఆమె తిరిగి ప్యాలెస్ కు రావడంతో అక్కడి అధికారంలో సమతుల్యత దెబ్బ తింటుంది” అంటూ టబు పోషించే పాత్రను వర్ణించారు.
ఈ డ్యూన్: ప్రాఫెసీ సిరీస్ ను 2019లోనే డ్యూన్: సిస్టర్‌హుడ్ పేరుతో అనౌన్స్ చేశారు. ఈ డ్యూన్ సిరీస్ బ్రియాన్ హెర్బర్ట్, కెవిన్ జే ఆండర్సన్ రాసిన సిస్టర్‌హుడ్ ఆఫ్ డ్యూన్ నవల ఆధారంగా తెరకెక్కుతోంది. ప్రముఖ రచయిత ఫ్రాంక్ హెర్బర్ట్ క్రియేట్ చేసిన డ్యూన్ ప్రపంచంలోనే ఈ సిరీస్ ను కూడా నిర్మిస్తున్నారు. మనిషి మనుగడకు ముప్పు తెస్తున్న శక్తులతో హర్కోనెన్ సిస్టర్స్ పోరాడే నేపథ్యంలో ఈ డ్యూన్: ప్రాఫెసీ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు.
డ్యూన్ మూవీస్
ఇప్పటికే డ్యూన్ ప్రపంచంలో క్రియేట్ చేసిన సినిమాలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. డ్యూన్: పార్ట్ వన్, డ్యూన్: పార్ట్ టూగా రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ ఏడాది మార్చిలోనే డ్యూన్ 2 కూడా వచ్చింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మూడో సినిమా కూడా రూపొందుతోంది. ఇప్పుడు డ్యూన్: ప్రాఫెసీ సిరీస్ కూడా తెరకెక్కుతోంది.
ఇందులో టబుతోపాటు ఎమిలీ వాట్సన్, ఒలీవియా విలియమ్స్, ట్రావిస్ ఫిమ్మెల్, జోడీ మే, సారా సోఫీ బౌస్నినా, మార్క్ స్ట్రాంగ్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. ఈ సిరీస్ కు ఎనా ఫోర్సెస్టెర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉండటంతో పాటు కొన్ని ఎపిసోడ్లను కూడా డైరెక్ట్ చేసింది.
టబు బిజీ బిజీ
ఒకప్పుడు టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ ను కూడా తన అందంతో ఊపేసిన నటి టబు. 1991లో వెంకటేశ్ నటించిన కూలీ నంబర్ 1 మూవీతో టాలీవుడ్ కు ఆమె పరిచయమైంది. ఆ తర్వాత సిసింద్రీ, నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే, చెన్న కేశవరెడ్డి, అందరివాడు, పాండు రంగడు, అల వైకుంఠపురంలో లాంటి సినిమాల్లో నటించింది.
ఈ మధ్యే బాలీవుడ్ లో క్రూ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ సాధించింది. ఈ సినిమాలో కరీనా కపూర్, కృతి సనన్ తో కలిసి ఆమె ఓ ఎయిర్ హోస్టెస్ పాత్రలో కనిపించింది. ఇప్పుడు అజయ్ దేవగన్ తో మరో సినిమా చేస్తోంది. ఔరో మే కహా దమ్ థా పేరుతో వస్తున్న ఈ సినిమా జులై 5న రిలీజ్ కానుంది.