Optical Illusion: ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో 8 అంకెల మధ్య 3 అంకె దాక్కొని ఉంది, అదెక్కడుందో 10 సెకన్లలో కనిపెట్టండి

Best Web Hosting Provider In India 2024

Optical Illusion: ఆప్టికల్ ఇల్యుషన్లలో… నెంబర్ ఆప్టికల్ ఇల్యుషన్లు ప్రత్యేకమైనవి. ఈ ఇల్యూషన్లలో అన్ని నెంబర్లే ఉంటాయి. ఒకేలాంటి నెంబర్ల మధ్య ఒక భిన్నమైన నెంబర్ ఇరుక్కుని ఉంటుంది. అదే ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ప్రత్యేకత. ఆ నెంబర్ ఎక్కడుందో తక్కువ సమయంలోనే కనిపెట్టాలి. అప్పుడు మీ మెదడు సూపర్‌గా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అలాంటి నెంబర్ ఆప్టికల్ ఇల్యూషన్‌తో మీ ముందుకు వచ్చాము. ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో అంతటా ఎనిమిది అంకె కనిపిస్తోంది. కానీ ఒకచోట మాత్రం మూడు సంఖ్య ఉంది. అది ఎక్కడుందో మీరు 10 సెకన్లలో కనిపెట్టి చెప్పాలి.

ఆప్టికల్ ఇల్యూషన్ జవాబు ఇదిగో

పది సెకన్లలో మూడు అంకెను కనిపెట్టిన వారికి కంగ్రాట్స్ . ఈ చిత్రంలో మూడు అంకె చివరి నిలువ వరసలో కింద నుంచి నాలుగో లైన్ లో ఉంది. కాసేపు ఈ ఆప్టికల్ ఇల్యూషన్లను పరిశీలనగా చూస్తే ఈ 3 అంకె దొరికిపోతుంది. కానీ ఆ ఏకాగ్రతే ఎంతోమందిలో లోపిస్తోంది. అందుకే నెంబర్ ఆప్టికల్ ఇల్యూషన్లను అప్పుడప్పుడు సాధించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.

పిల్లల్లో ఏకాగ్రత దృష్టి పెంచాలనుకుంటే ఇలా నెంబర్ ఆప్టికల్ ఇల్యూషన్ లను ఇచ్చి సాల్వ్ చేయమని చెప్పండి. ఆప్టికల్ ఇల్యూషన్లు మెదడుకు, కంటికీ సవాలు విసురుతాయి. ఈ రెండింటి మధ్య సమన్వయ లోపాన్ని బయటపెడతాయి. ఎవరైతే ఆప్టికల్ ఇల్యూషన్లను త్వరగా సాధిస్తారో వారి మెదడు, కంటి చూపు సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాయని అర్థం.

ఆప్టికల్ ఇల్యూషన్లను సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి. విదేశాల్లో ఎంతో మంది చిత్రకారులు వీటిని చిత్రీకరిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. తొలిసారిగా ఆప్టికల్ ఇల్యూషన్లను గ్రీసు దేశంలో కనిపెట్టారు. అక్కడ పురాతన తవ్వకాల్లో బయటపడిన ఆలయాల గోడలపై ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు దర్శనమిచ్చాయి. కాబట్టి గ్రీసు దేశాన్ని ఆప్టికల్ ఇల్యూషన్‌లా పుట్టిల్లుగా చెప్పుకుంటారు.

WhatsApp channel

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024