Best Web Hosting Provider In India 2024
P Gannavaram Accident : అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పి.గన్నవరం మండలం ఊడిమూడి వద్ద రోడ్డుపై ట్రాక్టర్ లో ధాన్యం బస్తాలు లోడ్ చేస్తున్న కూలీలను ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు దుర్మరణం చెందారు.మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు రాజోలు నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురిది జి.పెద్దపూడి, మరొకరిది ఆదిమూలవారిపాలెంగా తెలుస్తోంది. ప్రమాదంలో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
టాపిక్
Andhra Pradesh NewsRoad AccidentKonaseemaTrending ApBreaking Telugu News