Best Web Hosting Provider In India 2024
రాజకీయాలు అంటే సహజంగా అందరికీ ఇంట్రస్ట్ ఉంటుంది. కానీ ప్రాణాల మీదకు తెచ్చుకునేలా ఉండటం మాత్రం బుద్ధి తక్కువ పనే. ఎందుకంటే ఎన్నికలు అయ్యాక ఏ పార్టీ నీ వైపు చూడదు.., ఏ నేత నీ ఇంటికి వచ్చి దండాలు పెట్టడు. రాజకీయం అంటేనే నాలుగు నెలల ముందు వచ్చి చేసిపోయే ఉద్యోగం. గెలిచిన తర్వాత.. రాజు ఎవరో.. మంత్రి ఎవరో. వారి వారి స్వార్థం ప్రయోజనాల కోసం మనవాళ్లను మనం దూరం చేసుకోవడం మంచిది కాదు.
ఏపీ తెలంగాణలో ఎన్నికల పోలింగ్ వెళ జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఒక్కొక్కరు తలలు పగలగొట్టుకున్నారు. కానీ ఇదంతా చేసినంత మాత్రన మీకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉందని గమనించాలి. లేదంటే రాజకీయాలనే రొచ్చులో మీరు జీవితాంతం చిక్కుకుని ఉంటారు. బయటకు వచ్చి కడుక్కుందామని చూసినా ఫలితం ఉండదు. ఎందుకంటే ఒక్కసారి రాజకీయమనే బురద అంటుకుంటే.. అది అస్సలు పోదు. మీరు కడుక్కోవాలని చూసినా ఎదుటివారు పిలిచి మరీ అంటిస్తారు.
పార్టీలపై అభిమానం ఉండటం సహజం. కానీ అవి మీ జీవితాలని పాడు చేయకూడదు. కేవలం పార్టీని పార్టీగా చూస్తే సరిపోతుంది. ఎందుకంటే చెప్పిన హామీలను నెరవేర్చే రాజకీయ నాయకుడు కనిపించడం అరుదు ఇప్పుడు. పార్టీ ప్రయోజనాల కోసం మిమ్మల్ని ఎమోషనల్గా టార్గెట్ చేస్తారు. అది అర్థం చేసుకోలేనివారు మాత్రం గొడవలకు దిగుతూ.. పోలిస్ కేసులు అంటూ.. కొర్టుల చుట్టూ తిరుగుతారు. దాని ద్వారా మీకు వచ్చే రూపాయి ప్రయోజనం ఉండదు.
రాజకీయాల గురించి అవగాహన ఉంటే నాయకులను ప్రశ్నించడం నేర్చుకోండి. అంతేగానీ.. గొడవలకు దిగి మనొడిని మనం కొడితే అది పరిష్కారం కాదు. ఎందుకంటే ఏ పార్టీ అయినా ఎన్నికలు అయ్యాక పెద్దగా పట్టించుకోదు. మరుసటి రోజు నుంచి మీరే ఒకరిముఖం ఒకరు చూసుకోవాలి. అవసరమైతే సాయం చేసుకోవాలి. ఐదేళ్లకోసారి వచ్చిపోయే ఎన్నికల కోసం మనవారితో మనం గొడవలు పెట్టుకుంటే వచ్చే ప్రయోజనం ఏం ఉండదు.
ఏ రాజకీయ నాయకుడైనా ప్రజలను ఎమోషనల్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. అది అతడికి ప్రయోజనం. వారికోసం మీ జీవితాలను పణంగా పెట్టకూడదు. ఎందుకంటే రాజకీయాలు అనేవి బురదలాంటివి.. దానిపై మీరు రాయి.. వేస్తే మీ మీద బురద పడుతుంది.
రాజకీయాల గురించి ఓ ఫేమస్ స్టోరి కూడా ఉంది. ఒకసారి చట్టసభలోకి హిట్లర్ వెళతాడు. అక్కడ ఉన్న తోటి సభ్యులు ఇంతలా ప్రజలను ఇబ్బంది పెడితే ఏం కాదా అని ప్రశ్నిస్తారు. అప్పుడే ఒక కోడిని తీసుకొచ్చి దాని మీద ఉన్న ఈకలు పీకేయిస్తాడు హిట్లర్. తర్వాత కోడిని తీసుకుని దానికి కొన్ని గింజలు వేస్తాడు. దీంతో సభలో ఉన్నవారు షాక్ అవుతారు. ఎందుకంటే ఆప్పటివరకూ నొప్పితో అరుస్తూ ఉన్నకోడి.. గింజలు కనిపించగానే సైలెంట్ అయిపోతుంది. ఇప్పటి రాజకీయ నాయకులు కూడా అంతే. వారి అవసరానికి ఎన్నికల సమయంలో ఏవేవో పథకాలు చెబుతారు. కానీ ఎన్నికలు అయిన తర్వాత మాత్రం పథకాల నుంచి వచ్చే లబ్ధి ఏముండదు.
కేవలం ఎన్నికల సమయంలోనే రాజకీయ పార్టీలు వచ్చి వెళ్తాయి. కానీ మీ ఊరిలో తెల్లారి లేస్తే ముఖం.. ముఖం చూసుకునే వారు మీతో గొడవపడిన వ్కక్తి. అలాంటి సమయంలో ఏదైనా సమస్య ఉంటే ఒకరికొకరు మాట్లాడుకోవాలి. పరస్పర దాడులు చేస్తే మీకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు.
జెండా రంగు మారుతుంది కానీ..
రాజకీయ నాయకులు కాదు..
నోటు రంగు మారుతుంది కానీ..
దాన్ని దోచుకునేవాల్లు కాదు..
మనిషి రంగు మారుతుంది కానీ..
తన కష్టాలు మారవు..
ప్రాంతం మారుతుంది కానీ..
సామాన్యుడి కష్టాలు మారవు..