Best Web Hosting Provider In India 2024
Fruits in Refrigerator: వేసవిలో ఆహారాలు త్వరగా పాడైపోతాయి. అందుకే ప్రతి ఒక్కరూ ఆహారం సురక్షితంగా ఉంచేందుకు నిర్వహిస్తున్నారు. తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఈ ఆహారాలు చెడిపోకుండా ఉంటాయి. అయితే అన్ని రకాల ఆహారాలను ఫ్రిజ్లో పెట్టకూడదు. ముఖ్యంగా కొన్ని రకాల పండ్లను ఫ్రిజ్లో ఉంచకూడదు. కానీ వాటిని ఫ్రిజ్లో పెట్టి అలాగే తింటున్నాం. దీనివల్ల వాటి రుచి, ఆకృతి, పోషక విలువలు మారిపోతున్నాయి. ఏ ఏ పండ్లను ఫ్రిజ్లో పెట్టకూడదు తెలుసుకోండి.
పుచ్చకాయ
పుచ్చకాయ తేగానే తీసుకెళ్లి ఫ్రిజ్లో పెట్టేవారు ఎంతోమంది. నిజానికి పుచ్చకాయ త్వరగా పాడవదు. అందుకే మార్కెట్లలో కూడా పుచ్చకాయలను కుప్పలుగా పోసి నాలుగైదు రోజులు పాటు అమ్ముతారు. కాబట్టి పుచ్చకాయను కొన్నాక ఫ్రిజ్లో ఉంచాల్సిన అవసరం లేదు. అలా ఉంచడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిపోయి పోషక విలువలు తగ్గుతాయి. అందుకే పుచ్చకాయను రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయకూడదని మీకు నిపుణులు చెబుతున్నారు.
బొప్పాయి
బొప్పాయి త్వరగా పాడయ్యే పండు కాదు, బొప్పాయిని ఫ్రిజ్ లో పెట్టడం వల్ల దాని రుచి, ఆకృతి మారిపోతాయి. తక్కువ ఉష్ణోగ్రత వద్ద బొప్పాయి పండుగా ప్రక్రియ నెమ్మదిస్తుంది. కాబట్టి బొప్పాయిని ఒకవేళ ఫ్రిజ్లో పెట్టాలనుకుంటే అది పూర్తిగా పండాక ముక్కలు చేయకుండానే పెట్టాలి. బొప్పాయి ముక్కలను మాత్రం ఫ్రిజ్లో పెట్టకూడదు.
లిచీ
లిచీలు వేసవిలో అధికంగానే లభిస్తాయి. అవి తాజాగా ఉండేందుకు కొంతమంది ఫ్రిజ్ లో పెడతారు. వీటిని పెట్టాల్సిన అవసరం లేదు. లిచీ పై ఉన్న తొక్క మందంగా ఉంటుంది. కాబట్టి అవి ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటాయి.
అరటి పండ్లు
అరటిపండ్లను ఎప్పుడు ఫ్రిజ్లో పెట్టకూడదు. ఫ్రిజ్లో ఉంచినప్పుడు వాటి తొక్కలు నల్లగా మారిపోతాయి. అంతేకాదు అరటి పండ్లు పండాలన్నా, తాజాగా ఉండాలనా, రుచి మారిపోకూడదు అంటే గది ఉష్ణోగ్రత వద్ద నిలువ చేయడం ఉత్తమం.
పైనాపిల్
పైనాపిల్ ను ఫ్రిజ్ లో నిల్వ చేయాల్సిన అవసరం లేదు. ఇది చాలా మృదువుగా ఉంటుంది. ఫ్రిజ్లో ఉంచడం వల్ల దాని సహజ రుచిని కోల్పోతుంది. గది ఉష్ణోగ్రత వద్ద పైనాపిల్ తాజాగా ఉంటుంది.
మామిడి పండ్లు
మామిడి పండ్లను కూడా రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేయడం పెద్ద పొరపాటు. చల్లని ఉష్ణోగ్రత వద్ద మామిడి పండ్లు పండే ప్రక్రియ నెమ్మదిస్తుంది. మామిడి పండ్లను పూర్తి రుచితో ఆస్వాదించాలంటే గది ఉష్ణోగ్రత వద్ద నిలువ చేయడం మంచిది.
అవకాడోలు
అవకాడోలను కూడా ఫ్రిజ్లో నిల్వ చేయకూడదు. ఎందుకంటే చల్లని ఉష్ణోగ్రత ఈ పండ్లను మరింత దగ్గరగా చేస్తాయి. ఆ పండ్ల ఆకృతిని తగ్గిస్తాయి.