TSRTC Special Buses : ఐపీఎల్ అభిమానులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, ఉప్పల్ స్టేడియానికి 60 ప్రత్యేక బస్సులు

Best Web Hosting Provider In India 2024

TSRTC Special Buses : క్రికెట్ అభిమానులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త తెలిపింది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో రేపు(గురువారం) సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఫ్యాన్స్ కోసం 60 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడపనునట్టు సంస్థ ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సులను హైదరాబాద్ లోని పలు కీలక ప్రాంతాల నుంచి గురువారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 1:30 గంటల వరకు నడపనుంది.ఈ బస్సులు ప్రధానంగా 24 రూట్లలో తిరగనున్నాయి. క్రికెట్ అభిమానులు ప్రత్యేకమైన ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మ్యాచ్ ను వీక్షించాలని సంస్థ తెలిపింది. ఇక రేపు ఉప్పల్ లో జరగబోయే సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్….హైదరాబాద్ జట్టుకు కీలకంగా మారనుంది. హైదరాబాద్ జట్టు ప్లే అఫ్స్ కు చేరుకోవడానికి కేవలం ఒక పాయింట్ మాత్రమే అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇక లక్నో తో ఆడిన చివరి మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.

ఈ రూట్లలో ప్రత్యేక బస్సులు

  • మెహదీపట్నం నుంచి ఉప్పల్ స్టేడియం – 4 బస్సులు
  • ఘాట్ కేసర్ నుంచి ఉప్పల్ స్టేడియం – 4 బస్సులు
  • హయత్ నగర్ నుంచి ఉప్పల్ స్టేడియం – 2 బస్సులు
  • ఎన్జీవో కాలనీ నుంచి ఉప్పల్ స్టేడియం – 4 బస్సులు
  • ఇబ్రహీంపట్నం నుంచి ఉప్పల్ స్టేడియం – 2 బస్సులు
  • లాబ్ క్వార్టర్స్ నుంచి ఉప్పల్ స్టేడియం- 2 బస్సులు
  • కోఠి నుంచి ఉప్పల్ స్టేడియం- 2 బస్సులు
  • అఫ్జల్ గంజ్ నుంచి ఉప్పల్ స్టేడియం- 2 బస్సులు
  • లక్డీకాపుల్ నుంచి ఉప్పల్ స్టేడియం – 2 బస్సులు
  • దిల్ సుఖ్ నగర్నుంచి ఉప్పల్ స్టేడియం- 2 బస్సులు
  • జీడిమెట్ల నుంచి ఉప్పల్ స్టేడియం- 4 బస్సులు
  • KPHB నుంచి ఉప్పల్ స్టేడియం- 2 బస్సులు
  • మేడ్చల్ నుంచి ఉప్పల్ స్టేడియం- 2 బస్సులు
  • మియాపూర్ నుంచి ఉప్పల్ స్టేడియం- 2 బస్సులు
  • JBS నుంచి ఉప్పల్ స్టేడియం- 4 బస్సులు
  • హకీంపేట్ నుంచి ఉప్పల్ స్టేడియం- 2 బస్సులు
  • ECIL ఎక్స్ రోడ్స్ నుంచి ఉప్పల్ స్టేడియం- 2 బస్సులు
  • బోయినపల్లి నుంచి ఉప్పల్ స్టేడియం- 2 బస్సులు
  • చార్మినార్ నుంచి ఉప్పల్ స్టేడియం- 4 బస్సులు
  • చాంద్రాయణగుట్ట నుంచి ఉప్పల్ స్టేడియం- 2 బస్సులు
  • BHEL నుంచి ఉప్పల్ స్టేడియం- 2 బస్సులు
  • కొండాపూర్ నుంచి ఉప్పల్ స్టేడియం- 2 బస్సులు
  • ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ స్టేడియం- 2 బస్సులు

త్వరలోనే డ్రైవర్ కమ్ కండక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ?

నిరుద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పనునట్టు తెలుస్తోంది. ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్ పోస్టులకు సంస్థ త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులో డ్రైవర్ కమ్ కండక్టర్ డ్యూటీ ఒకరే చేసేలా వాటికి సంబంధించిన నియామకాలను భర్తీ చేసేందుకు ఆర్టీసీ సిద్ధం అవుతుంది. కాగా ఇప్పటికే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులు మినహా… ఇతర బస్సులో డ్రైవర్లుగా ఉంటూనే టికెట్లు కూడా తీసుకుంటున్న సంగతి తెలిసిందే. త్వరలో డ్రైవర్ ఉద్యోగం కోసం వచ్చే వ్యక్తి కండక్టర్ డ్యూటీ కూడా చెయ్యాల్సి ఉంటుందని ఆర్టీసీ స్పష్టం చేసింది. అయితే దీనిపై సంస్థ తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని తెలుస్తుంది. రెండు డ్యూటీలు ఒకరే చేయడం వల్ల సంస్థకు ఆర్థిక భారం కొంత మేర తగ్గుతుందని సంస్థ భావిస్తోందట.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్

Uppal StadiumCricketIpl 2024TsrtcHyderabadSrhTelangana News
Source / Credits

Best Web Hosting Provider In India 2024