Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Best Web Hosting Provider In India 2024

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడిని మన అమ్మమ్మలు, నాన్నమ్మలు ఇష్టంగా చేసుకుని తినేవారు. దీన్ని ఎప్పటికప్పుడు చేసుకుని తినేవారు. దీన్ని ఒకసారి చేసుకుంటే వారం రోజులు తాజాగా ఉంటుంది. ఒక్కసారి దీన్ని తింటే మీకు మరింత నచ్చుతుంది. దీన్ని దోశె, ఇడ్లీలోకి, అన్నంలోకి ఈ పచ్చడిని చాలా టేస్టీగా ఉంటుంది. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

పాత చింతకాయ పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు

చింతకాయలు – వంద గ్రాములు

కరివేపాకులు – పది రెమ్మలు

వెల్లుల్లి రెబ్బలు – పది

నువ్వుల నూనె – పావు కప్పు

ఇంగువ – చిటికెడు

పచ్చి మిర్చి – అయిదు

ఎండు మిర్చి – పది

బెల్లం తురుము – పావు కప్పు

మెంతులు – పావు స్పూను

జీలకర్ర – ఒక స్పూను

ఆవాలు – అర స్పూను

శెనగ పప్పు – ఒక స్పూను

మినపప్పు – ఒక స్పూను

ఉప్పు – రుచికి సరిపడాత

పసుపు – పావు స్పూను

పాత చింతకాయ పచ్చడి రెసిపీ

1. పచ్చి చింతకాయలను ఏరి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. వాటిని పైన తొక్కుతీసి సన్నగా తరగాలి.

2. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో మినపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, శెనగపప్పు వేసి వేయించాలి.

3. అందులో వెల్లుల్లి రెబ్బలు, పచ్చి మిర్చి ముక్కలు, ఎండు మిర్చి, ఇంగువ వేసి కలుపుకోవాలి.

4. ఆ మొత్తం మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.

5. మిక్సీ జార్లో చింత పండు ముక్కలు, పసుపు, బెల్లం తురుము వేసి కాస్త నీళ్లు వేడి చేసి మెత్తగా రుబ్బుకోవాలి.

6. ఈ మొత్తం మిశ్రమాన్ని తీసి కళాయిలో వేయించుకున్న ఆవాలు మిశ్రమంలో వేసి కలపాలి. అంతే పాత చింతకాయ పచ్చడి రెడీ అయినట్టే.

పుల్లని చింతకాయలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. బరువు తగ్గడం చాలా సులువుగా మారిపోతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జీర్ణ శక్తిని పెంచడానికి ఇది సహాయపడుతుంది. చర్మకాంతిని పెంచుకోవడానికి చింత కాయలు ఉపయోగపడతాయి. ఒక్కసారి పాత చింతకాయ పచ్చడి చేసుకుంటే వారం రోజులు తాజాగా ఉంటుంది. దీన్ని అన్నంలోనే కాదు, దోశె, ఇడ్లీలోకి కూడా ఇది టేస్టీగా ఉంటుంది.

WhatsApp channel

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024