అంతిమ విజయం బహుజనులదే

Best Web Hosting Provider In India 2024

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ  మంత్రి రావెల కిషోర్ బాబు 

తాడేప‌ల్లి: పెత్తందారులు.. పేదలకు జరిగిన ఎన్నికల యుద్ధం లో అంతిమ విజయం బహుజనులదే అని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ  మంత్రి రావెల కిషోర్ బాబు పేర్కొన్నారు. పేదలవైపు ఉన్న వైయస్ఆర్ సీపీకి, వైయ‌స్ జ‌గ‌న్‌కు ప్రజలు అఖండ విజయం చేకూర్చబోతున్నారని చెప్పారు.  వైయస్ జగన్ పాలన లో బడుగుల సంక్షేమం ధ్యేయం గా అద్భుతమైన ప్రజరంజక పాలన చేశార‌ని తెలిపారు. శుక్ర‌వారం రావెల కిషోర్‌బాబు మీడియాతో మాట్లాడారు.

 బహుజనులు వైయ‌స్ఆర్‌సీపీ వైపే ఉన్నారని మరో సారి నిరూపితం కానుంద‌ని కిశోర్‌బాబు తెలిపారు.  పెరిగిన ఓటు శాతం ప్రభుత్వం పై వ్యతిరేకత అని పచ్చమీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. ప్ర‌భుత్వంపై అనుకూలత ఈ ఎన్నికలలో ప్రస్పుటంగా కనిపించింద‌ని పేర్కొన్నారు. సీఎం వైయ‌స్  జగన్ ఐదు సంవత్సరాలుగా అమలు చేసిన పథ‌కాలకు పెద్ద ఎత్తున మద్దతు లభించింద‌న్నారు.  గత ఎన్నికలలో లభించిన 151 స్దానాలకంటే అధికంగా వైయ‌స్ఆర్‌సీపీ గెలవబోతోంది. చంద్రబాబు కూటమి నేతలు చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు ఏమాత్రం నమ్మడం లేదు.  చంద్రబాబు,టిడిపి నేతలది మేకపోతు గాంభీర్యం. తెలుగుదేశం పార్టీకి కొందరు పోలీసు అధికారులు వత్తాసు పలికారనేది హింసాత్మక సంఘటనల ద్వారా రుజువైందని రావెల కిశోర్‌బాబు వ్యాఖ్యానించారు.

Best Web Hosting Provider In India 2024