గుడివాడ‌లో అట్ట‌హాసంగా బండ లాగుడు పోటీలు ప్రారంభం

కృష్ణా జిల్లా: గుడివాడ జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలు శ‌నివారం అట్ట‌హాసంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఈ పోటీల‌ను వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ప్ర‌తి ఏటా నిర్వ‌హిస్తున్నారు. ఈ ప్రదర్శనలకు వివి వినాయక్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని డైరెక్టర్‌ వివి వినాయక్‌ చెప్పారు. ఏపీలో సంతోషకరమైన వాతావరణంలో ప్రజలు పండుగను జరుపుకుంటున్నారని అన్నారు. ‘అందరూ కళకళలాడుతున్నారు. చూడ్డానికి చాలా ఆనందంగా ఉంది. ప్రతీ సంక్రాంతి అందరూ ఇలానే జరుపుకోవాలి. గుడివాడలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండ లాగుడు ప్రదర్శనలను తొలిసారి వీక్షించాను. ప్రదర్శనలు చాలా బాగున్నాయి. ఈ ఏడాది మార్చిలో నేను డైరెక్ట్ చేసిన హిందీ సినిమా విడుదలవుతుంది. హిందీ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుగు సినిమా చేస్తా. కొడాలి నాని వల్లే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నా. కొడాలి నాకెంతో ఇష్టమైన వ్యక్తి. ఆయన ఎప్పుడంటే అప్పుడు సినిమా చేసేందుకు నేను సిద్ధం’ అని వివి వినాయక్‌ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *