OTT: ఓటీటీలో అదరగొడుతున్న అభినవ్ గోమఠం కామెడీ డ్రామా సినిమా.. మరో మైల్‍స్టోన్ దాటేసింది

Best Web Hosting Provider In India 2024

My Dear Donga OTT Streaming: ఓటీటీల్లో కామెడీ డ్రామా సినిమాలకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఎంటర్‌టైనింగ్‍గా ఉండే కొన్ని చిత్రాలకు భారీ వ్యూస్ దక్కుతుంటాయి. అలాంటి మ్యాజిక్కే చేసింది ‘మై డియర్ దొంగ’ చిత్రం. పెద్దగా అంచనాలు లేకుండా ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం మంచి సక్సెస్ అయింది. పాపులర్ కమెడియన్ అభినవ్ గోమఠం ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఆహా ఓటీటీలో అడుగుపెట్టింది. ఓటీటీలో మై డియర్ దొంగ సినిమా తాజాగా ఓ మైల్‍స్టోన్ దాటింది.

100 మిలియన్ మినిట్స్ దాటేసి..

మై డియర్ దొంగ సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో తాజాగా 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మార్క్ దాటేసింది. సింపుల్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ఈ రేంజ్ వ్యూస్ దక్కంచుకోవడం గొప్ప విషయమే. “100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ఇంకా కౌంటింగ్. ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా మీ మనసులను, స్క్రీన్ టైమ్‍ను మై డియర్ దొంగ దోచేస్తున్నాడు” అని ఆహా ట్వీట్ చేసింది. ఇందుకు సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.

మై డియర్ దొంగ సినిమా ఏప్రిల్ 19వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెట్టింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆరంభం నుంచే మంచి వ్యూస్ దక్కించుకుంది. నెలలోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మైల్‍స్టోన్ దాటింది.

మై డియర్ దొంగ చిత్రంలో అభినవ్ గోమఠం, శాలినీ కొండేపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, శశాంక్ మండూరి ప్రధాన పాత్రలు పోషించారు. మెయిన్ రోల్ చేసిన శాలినీ కొండేపూడినే ఈ మూవీకి కథ అందించగా.. బీఎస్ సర్వజ్ఞ కుమార్ దర్శకత్వం వహించారు. మహేశ్వర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి అజయ్ అరసద సంగీతం అందించారు.

స్టోరీ లైన్ ఇదే

సుజాత (శాలినీ కొండేపూడి), విశాల్ (నిఖిల్) ప్రేమలో ఉంటారు. అయితే, తనను విశాల్ కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నాడని తెలుసుకొని బాధతో తన ఫ్లాట్‍కు సుజాత వెళుతుంది. అయితే, ఆ ఇంట్లోకి సురేశ్ (అభినవ్ గోమఠం) దొంగతనం చేసేందుకు వస్తాడు. కాస్త భయపడినా ఆ తర్వాత సురేశ్‍తో సుజాతతో పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరూ తమ పరిస్థితులను ఒకరితో ఒకరు చెప్పుకుంటారు. సురేశ్‍కు సుజాత ఇంప్రెస్ అవుతుంది. ఆ తర్వాత సడెన్‍‍గా సుజాత బర్త్ డే పార్టీ చేసేందుకు విశాల్, బుజ్జి (దివ్య), వరుణ్ (శశాంత్) ఆ ఫ్లాట్‍‍కు వస్తారు. సురేశ్‍ను చూసి ఎవరు అని అడుగుతారు. సుజాత ఏం చెప్పింది.. ఆ తర్వాత ఏం జరిగింది.. సుజాతను విశాల్ మళ్లీ ఇంప్రెస్ చేశాడా.. సురేశ్‍ను సుజాత ప్రేమిస్తుందా.. అనేది మై డియర్ దొంగ చిత్రంలో ప్రధాన అంశాలుగా ఉంటాయి.

ఆహాలో లేటెస్ట్‌గా..

కాగా, ఆహాలో ఈ వారం మే 17న విద్యావాసుల అహం చిత్రం కూడా నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీలో రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రలు పోషించారు. మే 18న షరతులు వర్తిస్తాయి సినిమా కూడా ఆహాలో అడుగుపెట్టింది. చైతన్య రావ్ హీరోగా నటించిన ఈ మూవీ థియేటర్లలో మోస్తరుగా ఆడింది.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024