Kalki 2898 AD Bujji: ‘బుజ్జీ’ కోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన కల్కి 2898 ఏడీ టీమ్.. ఎప్పుడు.. ఎక్కడ అంటే!

Best Web Hosting Provider In India 2024

Kalki 2898 AD Bujji: ‘కల్కి 2898 ఏడీ’ సినిమా కోసం ప్రస్తుతం సినీ ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. గ్లోబల్ రేంజ్‍లో ఈ చిత్రం సంచలనాలను సృష్టిస్తోందనే అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతీ పోస్టర్, గ్లింప్స్ అందరిలో ఆసక్తిని విపరీతంగా పెంచేస్తోంది. కల్కి 2898 ఏడీలో హైలైట్‍గా ఉండే ‘బుజ్జీ’ అనే ప్రత్యేక వాహనాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు మూవీ టీమ్ రెడీ అయింది. ఇందుకోసం ఓ భారీ ఈవెంట్ ప్లాన్ చేసిందని తెలుస్తోంది.

ఈవెంట్ ఎప్పుడు..

‘బుజ్జీ’ స్పెషల్ వెహికల్‍ను పరిచయం చేసేందుకు మే 22వ తేదీన భారీ ఈవెంట్ నిర్వహించేందుకు కల్కి 2898 ఏడీ టీమ్ రెడీ అయిందని తెలుస్తోంది. హైదరాబాద్‍లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మే 22న ఈ ఈవెంట్‍ను గ్రాండ్‍గా చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లను కూడా షురూ చేసిందని టాక్ బయటికి వచ్చింది. ఈ ఈవెంట్ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

బుజ్జీతో భైవర (ప్రభాస్) వచ్చే విషయం ఈ ఈవెంట్‍లో హైలైట్‍గా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న టాక్. సినీ ప్రేక్షకులకు ఈ ఈవెంట్ అద్భుతమైన సర్‌ప్రైజ్‍లా ఉంటుందని తెలుస్తోంది.

బుజ్జీ బ్రెయిన్‍ ఇలా..

బుజ్జీ అనే వాహనం బాజీని ఓ బ్రెయిన్‍ కంట్రోల్ చేస్తుందంటూ శనివారం (మే 18) కల్కి 2898 ఏడీ టీమ్ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియో అందరిలోనూ విపరీతమైన క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. బుజ్జీ బ్రైన్ చేసిన అల్లరి ఈ వీడియో హైలైట్‍గా నిలిచింది. అలాగే, బుజ్జీ వాహనాన్ని తయారు చేసేందుకు మూవీ టీమ్ ఎంత కష్టపడిందో కూడా ఇందులో మేకర్స్ చూపించారు. ఈ వాహనానికి స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ వాయిస్ ఓవర్ అందిస్తున్నారు.

దీంతో కల్కి 2898 సినిమాలో ఈ బుజ్జీ వాహనానికి చాలా ప్రాముఖ్యత ఉంటుందని అర్థమవుతోంది. ఈ వెహికల్‍ను డిజైన్ చేయడంలో విదేశీ డిజైనర్లు కూడా భాగమయ్యారు. మొత్తంగా బుజ్జీ వెహికల్‍పై హైప్ మాత్రం భారీ స్థాయిలో ఉంది. ఈ మూవీలో ఇది ఐదో సూపర్ స్టార్ అనే కామెంట్లు వస్తున్నాయి. మే 22న బుజ్జీని పరిచయం చేస్తామని డేట్‍ను కూడా మూవీ టీమ్ ఖరారు చేసింది.

బుజ్జీ వల్ల ప్రభాస్ పెళ్లిపై రూమర్లు

బుజ్జీ గురించి చెప్పేందుకు ప్రభాస్ ఇటీవల ఓ ఇన్‍స్టాగ్రామ్ పోస్ట్ చేశారు. ఓ ప్రత్యేకమైన పర్సన్ మన జీవితాల్లోకి రానున్నారంటూ పేర్కొన్నారు. అయితే, తన పెళ్లి గురించే ప్రభాస్ ఇలా పోస్ట్ చేశారనే రూమర్లు వచ్చాయి. అయితే, ఆ తర్వాత ఇది కల్కిలోని బుజ్జీ వాహనం గురించి అని తెలియడంతో పెళ్లి గురించి అని భావించిన కొందరు ఫ్యాన్స్ కాస్త నిరాశచెందారు.

కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 27వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. సుమారు రూ.600కోట్ల భారీ బడ్జెట్‍తో ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్‍తో పాటు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, పశుపతి కీలకపాత్రలు పోషించారు.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024