AP Inter Supply Hall Tickets : మే 24 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు, ఇవాళే హాల్ టికెట్లు!

Best Web Hosting Provider In India 2024

AP Inter Supply Hall Tickets : ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి నిర్వహించనున్నారు. సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లను ఇవాళ బోర్డు విడుదల చేయనున్నట్లు సమాచారం. మే 24 నుంచి జూన్‌1వ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. సప్లిమెంటరీ పరీక్షలను రోజుకు రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. ఆయా తేదీల్లో ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు.

ఇంటర్‌ మెుదటి సంవత్సరం సప్లమెంటరీ పరీక్షల తేదీలు :

  • మే 24 – సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1
  • మే25 – ఇంగ్లిష్ పేపర్ 1
  • మే 27 – పార్ట్‌ 3లో మ్యాథ్స్‌ పేపర్ 1ఎ, బోటని పేపర్ 1, సివిక్స్‌ పేపర్ 1
  • మే 28 -మ్యాథ్స్‌ పేపర్ 1బి, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1
  • మే 29 -ఫిజిక్స్‌ పేపర్ 1, ఎకనామిక్స్‌ పేపర్ 1
  • మే 30 -కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1, సోషియాలజీ పేపర్ 1, ఫైన్ ఆర్ట్స్‌, మ్యూజిక్ పేపర్ 1
  • మే 31 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, లాజిక్ పేపర్ 1, బైపీసీ విద్యార్థులకు బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్‌ పేపర్ 1
  • జూన్ 1 -మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ పేపర్ 1
  • జూన్ 6 -ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్
  • జూన్ 7- ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్

ఇంటర్‌ రెండో సంవత్సరం సప్లమెంటరీ పరీక్షల తేదీలు :

  • మే 24 -సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
  • మే 25 -ఇంగ్లీష్ పేపర్ 2
  • మే 27 -పార్ట్‌ 3లో మ్యాథ్స్‌ పేపర్ 2ఎ, బోటనీ పేపర్ 2, సివిక్స్‌ పేపర్ 2
  • మే 28 -మ్యాథ్స్‌ పేపర్ 2బి, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2
  • మే 29 -ఫిజిక్స్‌ పేపర్ 2, ఎకనామిక్స్‌ పేపర్ 2
  • మే 30 – కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2, సోషియాలజీ పేపర్ 2, ఫైన్ ఆర్ట్స్‌, మ్యూజిక్ పేపర్ 2
  • మే 31 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, లాజిక్ పేపర్ 2, బైపీసీ విద్యార్థులకు బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్‌ పేపర్ 2
  • జూన్ 1 -మోడరన్ లాంగ్వేజ్, జాగ్రఫీ పేపర్ 2

టీఎస్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే విద్యార్థుల హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది.

డౌన్లోడ్ లింక్ ఇదే

  • ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సప్లిమెంటరీ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలనే విద్యార్థులు https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ మే/జూన్ – 2024 అనే ఆప్షన్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • రోల్ నంబర్ లేదా మునుపటి సంవత్సరం హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి.
  • సబ్మిట్ బటన్ పై నొక్కితే హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది. డౌన్లోడ్ చేసుకోవచ్చు.

IPL_Entry_Point

టాపిక్

Ap IntermediateEducationExamsAndhra Pradesh NewsTrending ApTelugu News
Source / Credits

Best Web Hosting Provider In India 2024