Blackout OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తున్న 12th ఫెయిల్ హీరో కొత్త సినిమా: డేట్ ఖరారు.. తెలుగులో కూడా స్ట్రీమింగ్

Best Web Hosting Provider In India 2024

Blackout Movie OTT: బాలీవుడ్ యువ నటుడు విక్రాంత్ మాసేకు మీర్జాపూర్ వెబ్ సిరీస్‍తో పాపులారిటీ వచ్చింది. అయితే, గతేడాది రిలీజ్ అయిన ‘12th ఫెయిల్’ సినిమా అతడికి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ మూవీ హిట్ కాగా.. విక్రాంత్ నటనపై ప్రశంసల వర్షం కురిసింది. ఇప్పుడు, విక్రాంత్ మాసే హీరోగా బ్లాక్ఔట్ సినిమా రూపొందింది. ఈ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే వచ్చేస్తోంది. ఈ బ్లాక్‍ఔట్ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.

బ్లాక్‍ఔట్ స్ట్రీమింగ్ డేట్

బ్లాక్‍ఔట్ మూవీ జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జూన్ 7వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సినిమా టీజర్ నేడు (మే 21) తీసుకొచ్చిన జియోసినిమా రిలీజ్ డేట్‍ను వెల్లడించింది.

ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ జూన్ 7 నుంచి జూన్ 7న స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు జియో సినిమా కన్ఫర్మ్ చేసింది.

బ్లాక్‍ఔట్ సినిమాలో విక్రాంత్ మాసే, మౌనీ రాయ్ ప్రధాన పాత్రలు పోషించగా.. సునీల్ గ్రోవర్, జిషు సెంగుప్త, ఛాయాకదమ్, కరణ్ సోనావానే, సౌరభ్ గడ్గే కీలకపాత్రల్లో నటించారు.

టీజర్ ఇలా..

బ్లాక్‍ఔట్ చిత్రానికి దేవంగ్ శశీన్ భవ్సర్ దర్శకత్వం వహించారు. డైరెక్టర్‌గా ఆయనకు ఇదే తొలి సినిమా. బ్లాక్‍ఔట్ టీజర్ ఆసక్తిని రేపింది. ఓ రాత్రి వేళ విక్రాంత్ మాసే నడుపుతున్న కారును మరో కారు ఢీకొడుతుంది. అయితే, తనను ఢీకొట్టిన కారులో విక్రాంత్‍కు భారీగా బంగారు నగలు, డబ్బు దొరుకుతాయి. ఆ తర్వాత అతడికి ఎదురైన సవాళ్లు, ఇబ్బందులు ఏంటి అనేదే ఈ మూవీ మెయిన్ స్టోరీలా తెలుస్తోంది.

బ్లాక్‍ఔట్ చిత్రాన్ని జ్యోతి దేశ్‍పాండే, నీరజ్ కొటారీ నిర్మించారు. ఈ చిత్రానికి విశాల్ మిశ్రా, జోన్ స్టీవర్ట్ ఈడూరి మ్యూజిక్ డైరెక్టర్లుగా ఉన్నాయి. జూన్ 7 నుంచి మూవీని జియో సినిమాలో చూసేయవచ్చు.

విను వినోద్ చోప్రా దర్శకత్వంలో విక్రాంత్ మాసే ప్రధాన పాత్ర పోషించిన 12th ఫెయిల్ సినిమా మంచి హిట్ అయింది. డిస్నీ+హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చాక ఈ మూవీ ఇంకా పాపులర్ అయింది. ప్రేక్షకులతో పాటు చాలా మంది ప్రముఖులు కూడా 12th ఫెయిల్ మూవీని ప్రశంసించారు. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవితంపై ఈ మూవీ తెరకెక్కింది.

ఇల్లీగల్ మూడో సీజన్

పాపులర్ లీగల్ డ్రామ్ వెబ్ సిరీస్ ‘ఇల్లీగల్’కు మూడో సీజన్ వస్తోంది. మొదటి రెండు సీజన్లు మంచి సక్సెస్ అవటంతో ఈ సిరీస్‍కు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇల్లీగల్ మూడో సీజన్ మే 29వ తేదీన జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుంది. హిందీలో రూపొందిన ఈ సీజన్ తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ వెర్షన్‍లలోనూ అందుబాటులో ఉంటుంది. ఇల్లీగల్ వెబ్ సిరీస్‍లో నేహా శర్మ ప్రధాన పాత్ర పోషించారు. లాయర్‌ నిహారిక సింగ్‍గా నటించారు. ఈ సిరీస్ మూడో సీజన్‍కు షాహిర్ రాజా దర్శకత్వం వహించారు.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024