Best Web Hosting Provider In India 2024
Yakshini OTT: బాహుబలి చిత్రాలను నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఓ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. యక్షిణి అనే సోషియో ఫ్యాంటసీ సిరీస్‍ను ఆ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ సిరీస్‍లో నటి వేదిక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ కూడా కీరోల్స్ చేస్తున్నారు. యక్షిణి వెబ్ సిరీస్‍కు కోటబొమ్మాళి పీఎస్ ఫేమ్ డైరెక్టర్ తేజ మర్ని దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, యక్షిణి వెబ్ సిరీస్ నుంచి వేదిక ఫస్ట్ లుక్‍ను డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ రివీల్ చేసింది.
ఫస్ట్ లుక్ ఇలా..
యక్షిణి వెబ్ సిరీస్ నుంచి వచ్చిన వేదిక ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్‍గా ఉంది. ఈ పోస్టర్‌లో వేదిక రెండు డిఫరెంట్ గెటప్‍ల్లో కనిపిస్తున్నారు. ఓ లుక్ భీకరంగా డిఫరెంట్‍గా ఉండగా.. మరో లుక్ మోడ్రన్‍గా ఉంది. నీరు, నిప్పును సూచించేలా ఈ పోస్టర్ బ్యాక్‍గ్రౌండ్ ఉంది. వేదిక నాట్యం చేస్తున్నట్టుగా కూడా ఉంది. మొత్తంగా ఈ సిరీస్‍పై ఈ పోస్టర్ క్యూరియాసిటీని తీసుకొచ్చింది. కృష్ణ, మాయ అనే రెండు పాత్రల్లో వేదిక పోషిస్తున్నారని తెలుస్తోంది.
స్ట్రీమింగ్ ఎప్పుడు?
యక్షిణి వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‍ను డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఇంకా వెల్లడించలేదు. అయితే, త్వరలో అని పేర్కొంది. అయితే, జూన్‍లోనే ఈ సిరీస్ హాట్‍స్టార్‌లో స్ట్రీమింగ్‍కు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు వెల్లడించింది.
అర్జున ఫల్గుణ, కోట బొమ్మాళి పీఎస్ సినిమాలతో ఇంప్రెస్ చేసిన తేజ మర్ని దర్శకత్వం వహిస్తుండటంతో యక్షిణి సిరీస్‍పై మంచి అంచనాలు ఉన్నాయి. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభూ యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. ఆర్కా, హాట్‍స్టార్ భాగస్వామ్యంలో గతంలో పరంపర, పరంపర 2 సిరీస్‍లు వచ్చాయి. మళ్లీ వారి కాంబోలో యక్షిణి సిరీస్ వస్తోంది.
బాహుబలి యానిమేటెడ్ సిరీస్
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బహుబాలి సినిమాల ఆధారంగా ఇటీవలే ఓ యానిమేటెడ్ వెబ్ సిరీస్ వచ్చింది. బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో ఈ సిరీస్ హాట్‍స్టార్ ఓటీటీలో మే 17వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. ప్రస్తుతం రెండు ఎపిసోడ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రతీ శుక్రవారం ఒక్కో ఎపిసోడ్ స్ట్రీమింగ్‍కు రానుందని తెలుస్తోంది. తొలి రెండు ఎపిసోడ్లు ఆకట్టుకున్నాయి. బాహుబలి సినిమాలకు ప్రీక్వెల్ కథగా ఈ యానిమేటెడ్ సిరీస్ ఉంది.
బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేటెడ్ సిరీస్‍కు ఎస్ఎస్ రాజమౌళితో పాటు శరద్ దేవరాజన్ కూడా క్రియేటర్‌గా ఉన్నారు. జీవన్ జే కింగ్, నవీన్ జాన్ దర్శకత్వం వహించారు. హిందీలో రూపొందిన ఈ సిరీస్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది. మాహిష్మతిపై దాడి చేసేందుకు వచ్చే రక్తదేవ్‍ను బాహుబలి, భళ్లాలదేవ ఎలా ఎదుర్కొన్నారనే స్టోరీతో ఈ యానిమేటెడ్ సిరీస్ రూపొందింది. ఎంఎం కీరవాణి కుమారుడు కాలభైరవ ఈ సిరీస్‍కు సంగీతం అందించగా.. తరుణ్ ప్రసాద్ ఎడిటింగ్ చేశారు.