Karthika deepam2:కార్తీకదీపం 2 సీరియల్..తండ్రిగా సంతకం ఎందుకు పెట్టారని నిలదీసిన దీప, నరసింహని అరెస్ట్ చేయించిన కార్తీక్

Best Web Hosting Provider In India 2024

Karthika deepam 2 serial today may 22nd episode: దీప మెడకు అయిన గాయం చూసి శౌర్య చాలా బాధపడుతుంది. చదువు మానేసి నీకు సాయంగా ఉంటానని దెబ్బలు తగలకుండా చూసుకుంటానని చెప్తుంది. దీంతో దీప ఎమోషనల్ అవుతుంది.

బాగా చదువుకుని కలెక్టర్ అవుతానని అమ్మకి ఇచ్చిన మాట తప్పుతావా అంటుంది. లేదని శౌర్య అంటే తనని ప్రేమగా దగ్గరకు తీసుకుంటుంది. కార్తీక్ ని తిట్టుకుంటుంది. సంతకం ఎందుకు పెట్టాడో అడగాలని అనుకుంటుంది.

సంతకం ఎందుకు పెట్టారు?

దీప ఇంటి బయట పని చేసుకుంటూ ఉంటే కార్తీక్ వస్తాడు. మెడ మీద గాయం ఎలా ఉందని అడుగుతాడు. టిఫిన్ సెంటర్ లో ఏం జరిగిందో నాకు తెలుసు, నేను అంతా చూశాను. వద్దనుకున్న మనిషి వెంటపడుతుంటే ఎలా భరించాలని అంటాడు.

మీ వల్లే గొడవ జరిగిందని దీప అంటుంది. నా కూతురిని స్కూల్ లో చేర్పించారు కదా సంతకం ఎక్కడ పెట్టారని అడుగుతుంది. కార్తీక్ అయోమయంగా చూస్తాడు. పాప తండ్రి సంతకం పెట్టాల్సిన దగ్గర మీరు పెట్టారని చెప్తుంది.

పాపని స్కూల్ లో చేర్పించొద్దు అంటే వంద కారణాలు చెప్పారు. మీరు చేసిన మంచి పని గురించి చెప్పలేదు. మీరు చేయాల్సింది మీరు చేశారు వాడు చేయాల్సింది వాడు చేశాడు. మాటలు పడేది గాయాలు అయ్యేది ఏ సంబంధం లేని నాకేనని కన్నీళ్ళు పెట్టుకుంటుంది.

గార్డియన్ గా పెట్టాను 

తాళి నా ఒంటిని గాయపరిచింది. కానీ మీరు కంటికి కనిపించని గాయం చేశారు. ఏ అధికారంతో నా కూతురికి తండ్రి స్థానంలో సంతకం చేశారని నిలదీస్తుంది. సంతకం కావాల్సి వస్తే తల్లిగా నేను ఉన్నాను కదా నన్ను అవమానించడానికి కాకపోతే తండ్రిగా ఎందుకు సంతకం పెట్టారని అడుగుతుంది.

పిల్లలను స్కూల్ లో చేర్పించేటప్పుడు వాళ్ళకి ఏమవుతారో అప్లికేషన్ లో రాయాలి. తల్లా, తండ్రా, గార్డియన్ అని ఉంటుంది. పాపకి గార్డియన్ గా సంతకం పెట్టాను. ఏదో ఆలోచనలో తండ్రి పేరు కొట్టేయలేదని సంజాయిషీ ఇస్తాడు. నా ప్లేస్ లో మావయ్య వెళ్ళి స్కూల్ లో చేర్పిస్తే అక్కడే సంతకం పెడతారు.

నీ భర్త సమస్యలకు కారణం 

కూతురు భవిష్యత్ గురించి బాధ్యత లేదు కానీ అప్లికేషన్ మీద సంతకం కావాల్సి వచ్చిందా?వాడిని తోయడం కాదు ఇలాంటి మాటలు అన్నందుకు వాతలు పెట్టాల్సింది. నేనే వచ్చి నాలుగు తగిలిద్దామని అనుకున్నాను కానీ నా కారణంగా మళ్ళీ సమస్యలు రాకూడదని ఆగిపోయినట్టు చెప్తాడు.

మీరు అనుకుంటారు కానీ చేయరు. మీలా ఆగి ఆలోచించే వ్యక్తి కాదు అతను. నా కూతురు, నా విషయంలో మీరు కల్పించుకోవద్దు. అందరూ దూరం అయిపోయినా కూతురు కోసం బతుకుతున్నానని అంటుంది. ఈ సమస్యలకు కారణం నీ భర్త వాడిని ఊరికే వదిలిపెట్టకూడదని అంటాడు.

చాలు ఇప్పటి వరకు మీరు చేసిన మంచి చాలు. పరిస్థితులు సరిగా లేక ఇక్కడ ఉండాల్సి వస్తుందని అంటుంది. నీ సమస్యలకు కారణం నీ భర్త వాడిని నువ్వు క్షమించినా నేను క్షమించను. వాడు నీ జోలికి రాకుండా ఏం చేయాలో అదే చేస్తానని కార్తీక్ అనుకుంటాడు.

నరసింహ అరెస్ట్ 

దీప దగ్గర చేసిన గొడవ గురించి నరసింహ శోభకి చెప్తాడు. మంచి పని చేశావని అనసూయ తెగ మెచ్చుకుంటుంది. అప్పుడే పోలీసులు ఇంటికి వస్తారు. కట్టుకున్న భార్యని మోసం చేసి ఇంకో పెళ్లి చేసుకున్నందుకు. మొదటి భార్యని నడిరోడ్డు మీద కొట్టి చంపుతానని బెదిరించినందుకు అరెస్ట్ చేస్తున్నామని చెప్తారు.

దీప నా మీద కేసు పెట్టిందా అంటాడు. దానికి నాకు ఏ సంబంధం లేదని పొగరుగా మాట్లాడతాడు. కానిస్టేబుల్స్ పట్టుకోబోతుంటే వాళ్ళని తోసేస్తాడు. దీంతో ఎస్సై కోపంగా నరసింహని లాక్కుని వెళతాడు. కేసు పెట్టిన ఆమెకి మాకు ఏ సంబంధం లేదు ఈ అమ్మాయే నా కోడలు అని అనసూయ శోభని చూపిస్తుంది.

దీప గురించి చెప్పిన బంటు 

పెద్దావిడ దీపతో కేసు పెట్టించి ఉంటుందని అనసూయ అంటుంది. బంటు పారిజాతం దగ్గరకు వస్తాడు. ఊర్లో దీపకు మంచి పేరు లేదు. దీప మొగుడు ఊర్లో మల్లేష్ దగ్గర చాలా అప్పు చేశాడు. ఊరంతా అప్పులు చేసి ఆరేళ్ళ క్రితమే పారిపోయాడు. అప్పుల వాళ్ళు ఇల్లు జప్తు చేసుకుని అమ్ముతామని అన్నారు.

ఆ బాకీ తీర్చడం కోసమే అత్తాకోడళ్ళు హైదరాబాద్ వచ్చారని బంటు చెప్తాడు. కార్తీక్ గురించి తెలిసిందా అంటాడు. జాతరకు బాబుగారిని గెస్ట్ గా పిలిచారని చెప్తాడు. అంటే వీళ్లిద్దరి గురించి ఊర్లో కూడా తెలియదా? దీప, కార్తీక్ కి మధ్య పైకి కనిపించని ఏదో సంబంధం ఉందని అది నువ్వే కనిపెట్టాలని బంటుకి చెప్తుంది.

బంటు తలపగలగొట్టిన పారిజాతం 

అది కనిపెట్టాలంటే బంటు ఇంట్లో ఉండాలని అంటాడు. వెంటనే పారిజాతం కర్ర తీసుకుని బంటు తల మీద బాదుతుంది. రెస్టారెంట్ పనులు చూసుకోమని శివనారాయణ ఇంట్లో వాళ్ళకి చెప్తాడు. పారిజాతం యాక్టింగ్ చేస్తూ బంటుని ఇంట్లోకి తీసుకొచ్చి డ్రామా వేస్తుంది.

ఇంటి బయట ఫోన్ మాట్లాడుతూ తిరుగుతుంటే దొంగ వెధవ నగలు ఇవ్వమని అన్నాడు. ఇవ్వకపోతే నా తల పగలగొడతాను అన్నాడు. నిజంగానే ఆ పని చేస్తుంటే బంటు వచ్చి కాపాడాడని స్టోరీ చెప్తుంది. సుమిత్రని దీప కాపాడినట్టు బంటు నన్ను కాపాడాడు అంటుంది. నా ప్రాణాలు కాపాడిన నువ్వు ఇంట్లోనే ఉండాలని చెప్తుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

 
IPL_Entry_Point
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024