Best Web Hosting Provider In India 2024
AP Crime News : ఏపీలో ఘోరం చోటు చేసుకుంది. ఓ దగ్గర కుమారుడు సొంత తల్లిన హత్య చేసిన ఘటన వెలుగులోకి వస్తే, మరొకచోట న్యాయవాదిని కొడవలితో నరికి చంపిన ఘటన చోటు చేసుకుంది. ఇంకో చోట బిడ్డ మరణవార్త విని తల్లి మృతి చెందింది.
తల్లిని హత్య చేసిన కుమారుడు…
ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు నియోజకవర్గం పరిధిలో ఏంకొండూరు మండలం వల్లంపట్ల గ్రామంలో తల్లిని సొంత కుమారుడే హత్య చేశాడు. మద్యం మత్తులో తల్లిని సొంత కొడుకే గొడ్డలితో నరికి చంపాడు. శ్రీకాకుళం బుజ్జమ్మ (65)ను అతికిరాతకంగా కొడుకు వెంకటేశ్ హత్య చేశాడు. భార్యతో గొడవ పడుతున్న నేపథ్యంలో తల్లి బుజ్జమ్మ కుమారుడిని వారించింది. దీంతో కోపోద్రిక్తుడైన వెంకటేష్ తల్లిని హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ అబ్దుల్ నబీ తెలిపారు.
న్యాయవాది హత్య….
రాష్ట్రంలో సత్యసాయి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. న్యాయవాది, ఎన్ఎస్ యుఐ జాతీయ కార్యదర్శి సంపత్ రాజును హత్య చేశారు. ధర్మవరం చెరువు వద్ద కొందరు గుర్తు తెలియని దుండగులు కొడవలితో నరికిచంపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని, కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సంపత్ రాజు హత్యకు కారణం భూ తగాదాలే అని పోలీసుకు అనుమానిస్తున్నారు.
బిడ్డ మరణవార్త విని తల్లి మృతి…
అల్లూరి సీతారామరాజు జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. అడ్డుమండకు చెందిన నిండు గర్భిణీ రమ్యప్రియ (25)కు పురిటినొప్పులు వచ్చాయి. దాంతో పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. పుట్టిన బిడ్డ మృతి చెందడంతో ఆ విషయాన్ని తల్లికి తెలిసింది. బిడ్డ మరణ వార్తాతో షాక్ కు గురైన తల్లి, గట్టిగా కేకలు వేస్తూ ప్రాణాలు విడిచింది. రమ్యప్రియ సచివాలయంలో మహిళా పోలీస్ గా ఉన్నారు.
తిరుపతిలో దారుణం….
తిరుపతి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడిని కట్టేసి ప్రియురాలిపై స్నేహితుడే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సూళ్లూరు పేట మండలం దామరాయ గ్రామంలో పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన యువకుడు, యువతితో సహజీవనం చేస్తున్నారు. ఆ యువకుడికి ఏడుమలై, బాలాజీ ఇద్దరు మిత్రులు ఉన్నారు.
ఏడుమలై సూళ్లూరుపేటలో మద్యం సేవించి యువకుడికి ఫోన్ చేసి, మీ ప్రేయసి బర్త్ డే కదా ఆమెను తీసుకుని కొరిడి శివాలయం వెళ్దామని అన్నాడు. ప్రియురాలని తీసుకుని శివాలయానికి వెళ్లారు. పులికాట్ తీరంలోని దామరాయ పరిసరాల్లోకి వేళ్లగా, అప్పటికే అక్కడ ఉన్న ఏడుమలై, బాలాజీ కలిసి ఆ యువకుడి చొక్కా విప్పి, దాంతోనే అతడిని కట్టేశారు. ఆ యువతిని బెదిరించి ఏడుమలై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్, నగదు లాక్కుని పరారయ్యారు. బాధితులు శ్రీహరికోట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రిపోర్టింగ్ – జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు, ఏపీ
టాపిక్