Best Web Hosting Provider In India 2024
Chandini Chowdary: ఓ హీరో లేదా హీరోయిన్ నటించిన రెండు సినిమాలు ఒకే రోజు థియేటర్లలో రిలీజ్ కావడం అన్నది అరుదుగా జరుగుతుంటుంది. గతంలో ఒకరిద్దరు స్టార్‌హీరోల కెరీర్‌లో ఇలా జరిగింది. తాజాగా అచ్చ తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి నటించిన రెండు సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. యేవమ్, మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాలు జూన్ 14న రిలీజ్ కాబోతున్నాయి. ఇందులో ఓ మూవీ కామెడీ ఎమోషనల్ డ్రామా కథాంశంతో తెరకెక్కుతోండగా…మరో సినిమా సీరియస్ కాన్సెప్ట్‌తో రూపొందుతోంది.
మ్యూజిక్ షాప్ మూర్తి….
మ్యూజిక్ తప్ప మరోటి తెలియని మూర్తి అనే వ్యక్తి కథతో మిడిల్ క్లాస్ కష్టాలను ఆవిష్కరిస్తూ మ్యూజిక్ షాప్ మూర్తి రూపొందుతోంది. మిడిల్ ఏజ్‌లో డీజే కావాలని కలలు కన్న మూర్తి ప్రయాణం ఎలా సాగిందనే పాయింట్‌ను ఎమోషన్స్, కామెడీతో దర్శకుడు శివ పాలడుగు ఈ సినిమాలో చూపించబోతున్నాడు. ఈ సినిమాలో మూర్తికి అండగా నిలబడే యువతిగా చాందిని చౌదరి నటించింది. మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాలో టైటిల్ పాత్రలో అజయ్ ఘోష్ నటించాడు. ఆమని, అమిత్ శర్మ, భాను చందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పోలీస్ ఆఫీసర్…
యేవమ్ సినిమాలో చాందిని చౌదరి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. సైకో కిల్లర్‌ను పట్టుకోవాలని ప్రయత్నించే పవర్‌ఫుల్ పోలీస్‌గా ఈ మూవీలో కనిపించబోతున్నది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి ప్రకాష్ దంతులూరి దర్శకత్వం వహిస్తున్నాడు. హీరో నవదీప్‌తో కలిసి పవన్ గోపరాజు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
మహిళా సాధికారతను…
వశిష్ట సింహా విలన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో భరత్‌రాజు, ఆషూరెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జూన్ 14న రిలీజ్ కాబోతోంది. మహిళా సాధికారతను చాటి చెప్పే కథ ఇదని, కొత్త కంటెంట్, డిఫరెంట్ నేరేషన్‌తో యేవమ్ మూవీ అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉందని ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ చెబుతోంది. మ్యూజిక్ షాప్ మూర్తి, యేవమ్ రెండు సినిమాల ప్రమోషన్స్‌లో చాందిరి చౌదరి పాల్గొంటోంది.
గామితో సక్సెస్….
తెలుగులో ప్రేమ ఇష్క్ కాదల్ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది చౌందని చౌదరి. మను, కలర్ ఫొటో, సమ్మతమే తో పాటు పలు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. కలర్ ఫొటో మూవీ నేషనల్ అవార్డును అందుకున్నది. ఇటీవల రిలీజైన విశ్వక్‌సేన్ గామిలో ఓ కీలక పాత్ర చేసింది. అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. సబా నాయగన్ మూవీతో గత ఏడాది కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సంతాన ప్రాప్తిరస్తు పేరుతో ఓ మూవీ చేస్తోంది.
టాపిక్