Brahmamudi Promo: రాజ్‌, మాయ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ – అక్క కోసం అప్పు సాహ‌సం – వ‌సుధార‌కు రిషి స‌ర్‌ప్రైజ్‌

Best Web Hosting Provider In India 2024

Brahmamudi Promo: న‌కిలీ మాయ కార‌ణంగా కావ్య కాపురం క‌ష్టాల్లో ప‌డుతుంది. ఆమె నిజ స్వ‌రూపం బ‌య‌ట పెట్టే అవ‌కాశం కోసం ఎదురుచూస్తుంటుంది కావ్య‌. అస‌లైన మాయ గురించి అప్పు ఎంక్వైరీ చేయ‌డం మొద‌లుపెడుతుంది. క‌ష్ట‌ప‌డి మాయ ఇంటి అడ్రెస్‌ను క‌నిపెడుతుంది. అప్పు స‌హాయంతో అస‌లు మాయ‌ను అత్త అప‌ర్ణ ముందు నిల‌బెట్టాల‌ని కావ్య అనుకుంటుంది. కావ్య అస‌లు మాయ‌ను తీసుకొచ్చేలోపు రాజ్‌ను త‌న బుట్ట‌లో వేసుకునేందుకు న‌కిలీ మాయ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెడుతుంది.

రాజ్ బెడ్ రూమ్‌లో…

బిడ్డ‌ను అడ్డం పెట్టుకొని రాజ్ బెడ్ రూమ్‌లో ప‌డుకునేందుకు డ్రామాలు ఆడుతుంది మాయ‌. ఆమెకు ఇందిరాదేవి వార్నింగ్ ఇస్తుంది. ఇంట్లోంచి గెంటేస్తాన‌ని హెచ్చ‌రిస్తుంది. మాయ నిజ‌స్వ‌రూపం తెలియ‌క అప‌ర్ణ ఆమెకు స‌పోర్ట్ చేస్తుంది. అప‌ర్ణ స‌పోర్ట్ ఇవ్వ‌డంతో మాయ రెచ్చిపోతుంది. అప‌ర్ణ‌ను అత్త‌య్య అంటూ పిలుస్తుంది. కానీ నువ్వుంటే నాకు అస‌హ్యం అలా పిల‌వ‌కు అంటూ మాయ‌కు అప‌ర్ణ వార్నింగ్ ఇస్తుంది.

పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌…

మాయ‌కు రాజ్ పెళ్లికి ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని కావ్య రాసి ఇవ్వ‌డంతో పెళ్లి ప‌నులు మొద‌లుపెడుతుంది అప‌ర్ణ‌. పంతులును పిలిచి రాజ్‌, మాయ‌ల పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేయ‌మ‌ని అడుగుతుంది. రెండు రోజుల్లోనే ముహూర్తం ఉంద‌ని పంతులు అంటాడు. త‌న ముందే రాజ్‌, న‌కిలీ మాయ పెళ్లికి ముహూర్తం పెడుతోన్న కావ్య అడ్డుచెప్ప‌లేక‌పోతుంది.

రుద్రాణి కుట్ర‌లు…

నిజ‌మైన మాయ అడ్రెస్ గురించి అప్పుతో కావ్య మాట్లాడుతోండ‌గా రుద్రాణి వింటుంది. కావ్య నిజ‌మైన మాయ‌ను తీసుకొస్తే త‌న ప్లాన్ మొత్తం ఫెయిల‌వుతుంద‌ని కంగారు ప‌డుతుంది. కావ్య‌ను ఎలాగైనా అడ్డుకోవాల‌ని ఫిక్స‌వుతుంది. ఆమె ప్లాన్ స‌క్సెస్ అయ్యిందా? లేదా? అస‌లు మాయను కావ్య క‌లిసిందా లేదా? నిజం బ‌య‌ట‌ప‌డ‌కుండా రుద్రాణి ఎలాంటి కుట్ర‌లు ప‌న్నింది అన్న‌ది బ్ర‌హ్మ‌ముడి నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఆస‌క్తిక‌రంగా ఉంద‌నుంది.

రిషి రీఎంట్రీ ఎప్పుడంటే?

వ్ర‌తం పేరుతో వ‌సుధార‌ను ఇంటికి పిలిచి దారుణంగా అవ‌మానిస్తుంది దేవ‌యాని. రిషి బ‌తికిలేడ‌ని, వ‌సుధార ముత్తైదువ కాద‌ని అంటుంది. దేవ‌యానితో పాటు ఆమె బంధువుల మాట‌ల‌తో వ‌సుధార క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. వ‌సుధార‌కు ధ‌ర‌ణి స‌పోర్ట్‌గా నిలుస్తుంది. దేవ‌యాని వారిస్తోన్న విన‌కుండా వ‌సుధార‌కు తాంబూలం ఇస్తుంది. త‌న వ్ర‌తం చెడిపోయిన ప‌ర్వాలేద‌ని అంటుంది. రిషి బ‌తికి ఉన్నాడ‌ని వ‌సుధార‌తో పాటు తాను న‌మ్ముతున్నాన‌ని ధ‌ర‌ణి అంద‌రికి చెబుతుంది.

దేవయాని ప్లాన్…

ధ‌ర‌ణి కార‌ణంగా త‌న ప్లాన్ చెడిపోవ‌డం దేవ‌యాని స‌హించ‌లేక‌పోతుంది. మ‌రోప్లాన్ వేసి వ‌సుధార‌ను దెబ్బ‌కొట్టాల‌ని ఫిక్స‌వుతుంది.శైలేంద్ర‌తో క‌లిసి కొత్త కుట్ర‌కు తెర‌తీస్తుంది.దేవ‌యాని వేసిన ప్లాన్ కార‌ణంగా వ‌సుధార జీవితం ఎలా చిక్కుల్లో ప‌డింది? రిషి తిరిగి వ‌చ్చాడా? వ‌సుధార‌ను కాపాడాడా అన్న‌ది గుప్పెడంత మ‌న‌సు నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూపించ‌బోతున్నారు.

ఏంజెల్ ల‌వ్ స్టోరీ

మ‌నుకు త‌న మ‌న‌సులో ఉన్న ప్రేమ‌ను వ్య‌క్తం చేసే అవ‌కాశం కోసం ఏంజెల్ ఎదురుచూస్తుంటుంది.వ‌సుధార ఆమె ప్రేమ‌కు స‌పోర్ట్‌గా నిలుస్తుంది. ఏంజెల్ త‌న ప్రేమ‌ను ఎలా మ‌నుకు చెప్పింది? ఆమె ల‌వ్‌ను మ‌ను యాక్సెప్ట్ చేశాడా? ప్రేమ‌కు త‌న జీవితంలో చోటు లేద‌ని చెప్పిన మ‌ను త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్నాడా అన్న‌ది గుప్పెడంత మ‌న‌సు సోమ‌వారం నాటి ఎపిసోడ్‌లో తేల‌నుంది.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024