Chandrababu : కౌంటింగ్ రోజున అల్లర్లకు వైసీపీ ప్లాన్- కూటమి ఏజెంట్లు, అభ్యర్థులు బీఅలర్ట్ : చంద్రబాబు

Best Web Hosting Provider In India 2024

Chandrababu : ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. విజయం కోసం మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు మంచి సమన్వయంతో పనిచేశారని అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు బాగా కష్టపడ్డారన్నారు. కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు నాయుడు ఆదివారం జూమ్ కాల్ నిర్వహించారు. కౌంటింగ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై నేతలకు పలు సూచనలు చేశారు.

ఎగ్జిట్ పోల్స్ కూటమి వైపే

‘‘ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూటమి విజయం వైపే మొగ్గు చూపించాయి. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అభ్యర్థి ఎవరైనా ఓట్లు బదిలీ కావాలన్న ఉద్దేశంతో మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు కష్టపడి పనిచేశారు. ఓటమి భయంతో కౌంటింగ్ పై వైసీపీ అర్థం లేని ఆరోపణలు చేస్తోంది. తమ ఓటమికి కారణాలు వెతుక్కునే పనిని ఇప్పటికే అధికార పార్టీ మొదలుపెట్టింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ పై ఈసీ ఇచ్చిన ఆదేశాలపైనా కోర్టుకు వెళ్లి హంగామా చేయాలని చూశారు. కౌంటింగ్ రోజు కూడా అనేక అక్రమాలు, దాడులకు తెగబడే అవకాశం ఉంది….కూటమి ఏజెంట్లు, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి. కౌంటింగ్ ఏజెంట్లు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి సమయానికి చేరుకోవాలి. అధికారులు నిబంధనలు పాటించేలా కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు పనిచేయాలి” – చంద్రబాబు

డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న తర్వాతే బయటకు

ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ ల నుంచి తీసుకొచ్చే సమయంలో అభ్యర్థులు, ఏజెంట్లు అప్రమత్తంగా వ్యహరించాలని చంద్రబాబు సూచించారు. పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే వరకూ ఎవరూ అశ్రద్ధ వహించొద్దన్నారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఏజెంట్ కౌంటింగ్ కేంద్రంలోనే ఉండాలని సూచించారు. ఆర్వో వద్ద డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న తర్వాతే అభ్యర్థులు కౌంటింగ్ గది నుండి బటయకు రావాలని చంద్రబాబు సూచించారు.

వైసీపీ అల్లర్లకు పాల్పడే అవకాశం

బీజేపీ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ మాట్లాడుతూ….ఏపీలో ఎన్డీయేకు 21 వరకు ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైందని, రాష్ట్రంలోనూ 53 శాతం ఓట్లతో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందన్నారు. లెక్కింపులో అనుమానాలు ఉంటే రీకౌంటింగ్ అడిగాలని సూచించారు. ఓటమి భయంతో ఎన్నికల సమయంలో అల్లర్లకు పాల్పడిన వైసీపీ…కౌంటింగ్ సమయంలో కూడా ఘర్షణకు దిగే అవకాశం ఉందని, ప్రతి అభ్యర్థి లీగల్ టీంను అందుబాటులో ఉంచుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచించారు.

ఫలితాలపై ఉత్కంఠ

ఏపీలో ఎగ్జిట్ పోల్స్ భిన్నంగా ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో కూటమి గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ వచ్చినా, పలు సంస్థలు వైసీపీ వైపు మొగ్గాయి. అయితే ఈసారి ఏపీ పీఠం ఎవరికి దక్కబోతుందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్ 4 ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్ సమయంలో అల్లర్లు చెలరేగడంతో.. కౌంటింగ్ రోజున ఎలాంటి అవాంఛిత ఘటనలు తలెత్తకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్

Andhra Pradesh NewsAndhra Pradesh Assembly Elections 2024Chandrababu NaiduTrending ApTelugu NewsAp Politics
Source / Credits

Best Web Hosting Provider In India 2024