Egg omelette Curry: కోడిగుడ్డు ఆమ్లెట్ కూర ఇలా చేసుకున్నారంటే జీవితంలో మర్చిపోలేరు

Best Web Hosting Provider In India 2024

Egg omelette Curry: కోడిగుడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీంతో చేసే రెసిపీలు టేస్టీగా ఉంటాయి. ఎప్పుడూ కోడిగుడ్లను ఒకేలా వండుకుంటే కొత్తదనం ఉండదు. కోడిగుడ్ల ఆమ్లెట్ కర్రీ ఒకసారి ప్రయత్నించండి. అందరికీ నచ్చడం ఖాయం. కోడిగుడ్లతో ఆమ్లెట్లు వేసుకొని ఆ ఆమ్లెట్లను కూరగా వండుకోవడమే దీని స్పెషాలిటీ. దీన్ని చేయడం చాలా సులువు. పిల్లలకు ఈ కర్రీ చాలా బాగా నచ్చుతుంది. స్పైసిగా ఇష్టపడేవారు దీన్ని కారంగా వండుకుంటే నోరూరిపోతుంది.

కోడిగుడ్డు ఆమ్లెట్ కూర రెసిపీకి కావలసిన పదార్థాలు

కోడిగుడ్లు – నాలుగు

నూనె – తగినంత

ఉల్లిపాయలు – మూడు

పచ్చిమిర్చి – ఐదు

కరివేపాకుల – గుప్పెడు

ఉప్పు – రుచికి సరిపడా

టమాటాలు – మూడు

పసుపు – పావు స్పూను

అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను

కారం – ఒక స్పూను

జీలకర్ర పొడి – అర స్పూను

నీళ్లు – తగినంత

కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు

ధనియాల పొడి – రెండు స్పూన్లు

కోడిగుడ్డు ఆమ్లెట్ కర్రీ రెసిపీ

1. కోడిగుడ్లను ఒక గిన్నెలో వేసి పగలగొట్టాలి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి బాగా గిలక్కొట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఈ మిశ్రమాన్ని నాలుగు ఆమ్లెట్లుగా వేసుకోవాలి. ఆ ఆమ్లెట్లను తీసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

4. ఆ నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి.

5. పచ్చిమిర్చి, కరివేపాకులను వేసి వేయించాలి.

6. కొంత ఉప్పు చల్లితే అవి త్వరగా మగ్గుతాయి. ఉల్లిపాయలు బాగా మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అవి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి.

7. ఇప్పుడు టమాటాలను సన్నగా తురిమి వాటిని కూడా కలిపి మూత పెట్టాలి.

8. టమాటాలు మెత్తగా మగ్గే వరకు చిన్న మంట మీద ఉడికించాలి.

9. ఆ తర్వాత ధనియాలపొడి, కారం, జీలకర్ర పొడి, పసుపు వేసి బాగా కలుపుకోవాలి.

10. ఇది ఇగురులాగా దగ్గరగా అవుతుంది. ఆ సమయంలోనే కాస్త నీళ్లు పోసుకుని మళ్లీ ఉడికించుకోవాలి.

11. ఆ తర్వాత ముందుగా వేసుకున్న ఆమ్లెట్లను తీసి ఈ కూరలో వేసి ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.

12. స్టవ్ కట్టేసే ముందు కొత్తిమీరను చల్లుకోవాలి. అంతే స్పైసి కోడిగుడ్డు ఆమ్లెట్ కూర రెడీ అయినట్టే. దీన్ని వేడి వేడి అన్నంలో తింటే రుచి అదిరిపోతుంది.

కోడిగుడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇలా ఆమ్లెట్ల కూరను కూడా చేసుకొని తింటే ఎన్నో పోషకాలు అందుతాయి. దీనిలో మన ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలనే వాడాము, కాబట్టి శరీరానికి అంతా మేలే జరుగుతుంది. కోడిగుడ్డు కూర కన్నా కోడిగుడ్డు ఆమ్లెట్ కూరే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి.

WhatsApp channel

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024