Best Web Hosting Provider In India 2024
Krishna mukunda murari serial today june 3rd episode: మధు కృష్ణ చెప్పిన విషయాలు మొత్తం ఇంట్లో అందరికీ చెప్తాడు. సరోగసి ఐడియా కూడా కృష్ణకు వచ్చింది కాదు ఇదిగో ఈ మీరా ఇచ్చింది. వారసులని ఇవ్వాలని ఆశపడుతుంటే ఈ మీరా సరోగసి ఐడియా ఇచ్చి తనే ఎవరికీ తెలియకుండా సరోగసి మథర్ గా ఉందని చెప్తాడు.
డీఎన్ఏ టెస్ట్ చేయిద్దాం
నో ఇదంతా అబద్ధం. నన్ను బయటకు పంపించడం కోసం కట్టుకథలు అల్లుతున్నారు. పెళ్లి కానీ ఆడపిల్లను సరోగసి కోసం ఎందుకు ఒప్పుకుంటానని అంటుంది. ఎందుకంటే ముందు మురారి బిడ్డకు తల్లివి అయి ఆ తర్వాత మురారికి భార్య కావాలని అనుకున్నావ్ కాబట్టి.
జరిగింది ఇదే పెద్దమ్మ. సరోగసి పూర్తయిన తర్వాత మురారికి తనకు సంబంధం ఉన్నట్టు, తన వల్లే తల్లి అయినట్టు చెప్పి మనల్ని అనుమానించేలా చేసింది. డీఎన్ఏ టెస్ట్ కి కూడా ఎందుకు రెడీ అయిందో తెలుసా దానికి మురారి తండ్రి అందుకే అలా చెప్పిందని మధు కుండబద్దలు కొట్టేలా చెప్తాడు.
అసలు డీఎన్ఏ టెస్ట్ చేయాల్సింది ఏసీపీ సర్ కి కాదు నాకు. అప్పుడు నేనే బిడ్డకు తల్లిని అని తెలిసిపోతుందని కృష్ణ చెప్తుంది. సూపర్ గా చెప్పావ్ ఇప్పుడు డీఎన్ఏ టెస్ట్ కి రెడీనా అంటాడు. ఎందుకు మధు ఆడపిల్ల జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు.
మీరా కడుపులో ఉంది నా బిడ్డ
సాటి ఆడది అనే జాలి కూడా లేకుండా నీ భర్త ఎక్కడ నీకు దూరం అవుతాడోనని నాకు ద్రోహం చేయాలని చూస్తావా?అనాథను అయిన నన్ను ఇంట్లో పెట్టుకున్నారు. మీకు చెప్తే నాకు న్యాయం జరుగుతుందని చెప్పాను. కానీ వీళ్ళిద్దరూ నాకు అన్యాయం చేస్తుంటే వేడుక చూస్తున్నారా?
ఆదర్శ్ కాల్చేస్తుంటే ఎందుకు ఆపారని ఏడుస్తున్నట్టు నటిస్తుంది. నాకు విషయం తెలియకగానే దీన్ని చంపేయాలని అనిపించింది. కానీ కడుపులో ఉంది కృష్ణ బిడ్డ అని ఆగిపోయానని మధు చెప్తాడు. కాదు కాదు ఇది కృష్ణ బిడ్డ కాదు. ఇది నా బిడ్డ. అయినా సరోగసి అంటే అంత ఈజీనా రిపోర్ట్స్ చూపించమని అడుగుతుంది.
రిపోర్ట్స్ ఎందుకు చేసిన డాక్టర్ దగ్గరకు వెళ్దామని కృష్ణ అంటుంది. ఇప్పుడే హాస్పిటల్ కి వెళ్దాం ఏది నిజమో ఏది అబద్ధమో అక్కడే తేలిపోతుందని భవానీ అందరినీ తీసుకుని వెళ్తుంది. కృష్ణ డాక్టర్ వైదేహి దగ్గరకు భవానీ వాళ్ళని తీసుకుని వస్తుంది. ముకుందను చూపించి తనని మీకు పరిచయం చేయాల్సిన పని లేదు కదా.
మాట మార్చేసిన డాక్టర్
మీరు సరోగసి చేశారు కదా. డాక్టర్ వైదేహి సరోగసి ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది. మీరే సరోగసి చేశారు కదాని తన కడుపులో పెరుగుతుంది నా బిడ్డ అని చెప్పండి అంటుంది. డాక్టర్ వైదేహి మాట మారుస్తుంది. మొన్న ఫోన్ చేసి చిన్న పని ఉంది దానికి మీరు అవును అనాలని అన్నారు అది ఇదేనా.
సాటి డాక్టర్ కాబట్టి ఏదో ఫేవర్ అడిగావని సరే అన్నాను. మ్యాటర్ ఇదని చెప్తే అప్పుడే నో చెప్పేదాన్ని అనేసరికి కృష్ణ బిత్తరపోతుంది. మీరే సరోగసి చేశారు కదా అంటే స్టాపిడ్ కృష్ణ నేను చేయని దాన్ని చేశానని ఎందుకు చెప్తున్నావని వైదేహి రివర్స్ అవుతుంది.
తన భర్త నాకు చేసిన అన్యాయాన్ని కప్పి పుచ్చుకోవడానికని ముకుంద డ్రామా ఆడుతుంది. అబద్ధం ఎందుకు చెప్తున్నావ్ సరోగసి చేసుకోలేదా అని కృష్ణ అంటే ముకుంద డాక్టర్ ని నాకు మీరు సరోగసి చేశారా అని అడుగుతుంది. చేయలేదని వైదేహి చెప్తుంది.
దోషిగా నిలబడిన కృష్ణ
నీకు గర్భసంచి తీసేశారు పిల్లలు పుట్టరని మాత్రమే తెలుసు. సరోగసి చేయడం నాకు తెలియదు. నీకు పిల్లలు పుట్టకపోతే సరోగసి ద్వారా కనొచ్చు కదా ఆవిడ బిడ్డను లాక్కోవాల్సిన అవసరం ఏంటని వైదేహి కృష్ణని మాటలు అంటుంది. మొత్తం విన్నారు కదా ఇప్పుడు మీరే నిర్ణయించుకోండి ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారోని ముకుంద అంటుంది.
ఇక ఆదర్శ్ చూస్తే అలా ఉన్నాడు. ఇక్కడ ఏం బాగుందని ఈ కుటుంబాన్ని గొప్ప కుటుంబం అనాలి. నిజంగా ఇక్కడ ఉండాలంటే భయమేస్తుంది. ఇంత దారుణమైన కుటుంబాన్ని నేను ఎక్కడ చూడలేదని అంటుంది. పిన్ని నోరు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడమని కృష్ణ వార్నింగ్ ఇస్తుంది.
కృష్ణ శపథం
రజిని మాత్రం ఆగదు. పిన్ని మాటలు పట్టించుకోవద్దు ఇంటి ప్రతిష్ఠ నేను నిలబెడతానని కృష్ణ అంటుంది. ఇలా అబద్ధాలు చెప్పే వాళ్ళు మోసం చేసే వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. అయినా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్. పరువు తీసింది నువ్వే మళ్ళీ పరువు నిలబెడతాను అంటావ్ ఏంటి? అని చీదరించుకుని వెళ్ళిపోతుంది.
రజిని కూడా కృష్ణ గురించి తప్పుగా మాట్లాడుతుంది. పిల్లలు పుట్టకపోతే ఇలా చేయాలా అని మాటలు అంటుంది. నువ్వు ఏవైతే అంటున్నావో అవన్నీ అబద్ధం అని నేను రుజువు చేస్తాను మాది పరువు గల కుటుంబమని నిరూపిస్తానని కృష్ణ శపథం చేస్తుంది.
కృష్ణ భవానీకి ఎదురుపడుతుంది. కృష్ణతో మాట్లాడటానికి కూడా భవానీ ఇష్టపడదు. ఒక్కసారి తాను చెప్పేది వినమని బతిమలాడుతుంది. ఏం చెప్తావ్ మీరా కడుపులో పెరుగుతుంది మీ బిడ్డ సరోగసి చేశామని అంటే ఎంత సంతోషపడ్డామో తెలుసా నా కొడుకు ఏ తప్పు చేయలేదు.
అపార్థం చేసుకున్న రేవతి, భవానీ
నువ్వు మాకోసమే ఆలోచిస్తున్నావని పొంగిపోయామని రేవతి అంటుంది. నేను ఎప్పుడు ఆలోచించేది మీకోసమేనని కృష్ణ అంటే నేను అలాగే అనుకున్నా కానీ డాక్టర్ చెప్పాక నువ్వు ఎంత ఆలోచిస్తున్నావో అర్థం అవుతుంది. అసలు వీళ్ళకు మనం ఏం అన్యాయం చేశామని భవానీ కొప్పడుతుంది.
నేను ఏ తప్పు చేయలేదు. కాస్త ఓపిక పడితే అన్ని నిజాలు తెలుస్తాయి. కొంచెం ఓపిక పట్టండి నిజం ఏంటో నిరూపిస్తాను. ఇన్నాళ్ళూ నన్ను నమ్మారు కదా ఈ ఒక్కసారి నమ్మమని బతిమలాడుతుంది. కళ్ల ముందు కనిపించేవి నిజాలు కాకపోవచ్చు. మన కృష్ణ ఎప్పటికీ అబద్ధాలు చెప్పదని రేవతి భవానీకి నచ్చ జెప్పడానికి చూస్తుంది.
అంటే నేను అబద్ధాలు చెప్తున్నానా అని మీరా బ్యాగ్ పట్టుకుని వస్తుంది. ఇక్కడ నా కడుపులో బిడ్డ సాక్ష్యం, అక్కడ డాక్టర్ చెప్పింది కానీ మీకు కృష్ణ చెప్పింది నిజమా. అందుకే నేను నా బిడ్డని తీసుకుని వెళ్లిపోదామని అనుకుంటున్నాను అంటుంది. ఎక్కడికని భవానీ అడుగుతుంది.
బ్యాగ్ సర్దేసిన మీరా
నాకు నా బిడ్డ చాలు వెళ్లిపోతున్నానని చెప్తుంది. సరోగసి అని చెప్పి అబద్ధాలు చెప్తున్న కృష్ణ మీద సానుభూతి చూపిస్తున్నారు. కానీ మోసపోయిన నా గురించి ఒక్కరు కూడా ఆలోచించడం లేదు. ఇక్కడ నా ఉనికి ఏంటి నా స్థానం ఏంటి అని ఆలోచిస్తున్నానని అంటుంది.
కృష్ణ ఎదురుగా వస్తుంది. ఇక నీకు ఏ బాధ లేదు కృష్ణ నేను వెళ్లిపోతాను. నేను వెళ్లిపోయాక మురారి తిరిగి వస్తాడని అంటుంది. ఎక్కడికి వెళ్తున్నావని కృష్ణ అడ్డుపడుతుంది. ఎవరి బిడ్డని తీసుకుని ఎక్కడికి వెళ్లాలని అనుకుంటున్నావ్ చంపేస్తాను అంటుంది.
చంపేయ్ నాతో పాటు నా బిడ్డ పోతే నీకు ఏ ప్రాబ్లం ఉండదు కదా అంటే కృష్ణ వెంటనే తన గొంతు పట్టుకుంటుంది. నువ్వు చేసిన పాపాలకు ఎప్పుడో చంపేసే దాన్ని కానీ నా బిడ్డ గురించి ఆలోచించి వదిలేస్తున్నా. న్యాయం చేయమంటే చేయరు ఇంట్లో నుంచి వెళ్లనివ్వరు ఏంటి ఇదనీ మీరా భవానీని నిలదీస్తుంది.
ఏసీపీ సర్ వచ్చాక నీ రంగు తేల్చి నిన్ను బయటకు పంపిస్తాను. అప్పటిదాకా బయటకు అడుగుపెడితే కాళ్ళు విరిచేస్తానని కృష్ణ వార్నింగ్ ఇస్తుంది.
తరువాయి భాగంలో..
కృష్ణ ముకుందకు పాలు తీసుకొచ్చి ఇస్తుంది. నన్ను చూడకుండా ఇన్ని రోజులు ఏసీపీ సర్ ఎప్పుడు ఉండలేదు. ఉన్నారంటే నువ్వు చెప్పేది ఈ ఇంట్లో వాళ్ళు నమ్మడంలో తప్పులేదు. నేను నీ మీద కోపం ద్వేషంతో ఉండటం కరెక్ట్ కాదని అంటుంది. అంటే మురారి ఎక్కడ ఉన్నాడో కూడా తెలిసి కూడా చెప్పడం లేదా అని అపోహ పడుతున్నావా అని రేవతి అంటుంది. ఏసీపీ సర్ అంటే పెద్దత్తయ్యకు ప్రాణం కదా మరి ఎందుకు ఆవిడ ఊరుకున్నారని కృష్ణ అంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలగొడతానని భవానీ కృష్ణ మీద చెయ్యి ఎత్తుతుంది.