Best Web Hosting Provider In India 2024
Natasa Hardik Divorce: బాలీవుడ్ నటి, సెర్బియన్ మోడల్ అయిన నటాషా స్టాంకోవిక్ మళ్లీ తన భర్త, క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో కలిసిపోయిందా? వీళ్లు విడాకులు తీసుకోవడం లేదా? తాజాగా నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ లో తమ పెళ్లి ఫొటోలను రీస్టోర్ చేయడంతో మరోసారి ఈ వార్తలు తెరపైకి వస్తున్నాయి. కొన్ని వారాలుగా వీళ్ల విడాకుల వార్తలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే.
నటాషా, హార్దిక్ విడాకులు తీసుకోవడం లేదా?
టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు కొన్నాళ్లుగా ఏదీ కలిసి రావడం లేదు. అటు ఐపీఎల్లో వరుస వైఫల్యాలు, ఇటు వ్యక్తిగత జీవితంలో భార్యతో విభేదాలతో అతడు సతమతమవుతున్నాడు. బాలీవుడ్ నటి అయిన నటాషా కొన్నాళ్ల కిందట ఇన్‌స్టాగ్రామ్ లో తన పేరు మార్చుకోవడం, ఐపీఎల్లో హార్దిక్ ఆడిన మ్యాచ్ కు రాకపోవడం, తమ పెళ్లి ఫొటోలను ఇన్‌స్టా అకౌంట్ నుంచి తొలగించడంతో వీళ్లు విడిపోతున్నారన్న పుకార్లు మొదలయ్యాయి.
అయితే ఇప్పుడు మరోసారి నటాషా తమ పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో రీస్టోర్ చేయడం విశేషం. ఈ ఫొటోలు కనిపించకుండా పోవడంతో వీళ్లు విడిపోతున్నారన్న వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఆ ఫొటోలు తిరిగి రావడంతో మళ్లీ కలిసిపోయారా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
నటాషా, హార్దిక్ మే 31, 2020లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ కు గుడ్ బై చెప్పింది. వీళ్లకు అదే ఏడాది జులై 30న కొడుకు అగస్త్య జన్మించాడు. వీళ్లు గతేడాది ఫిబ్రవరి 14న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి ఫొటోలు, ప్రీవెడ్డింగ్ వీడియోలు నటాషా ఇన్‌స్టాగ్రామ్ లో కనిపించడం లేదని కొన్నాళ్ల కిందట ఫ్యాన్స్ గుర్తించారు.
అప్పటి నుంచే వీళ్లు విడిపోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు పెళ్లి ఫొటోలు తిరిగి రావడంతో మళ్లీ కలిసిపోయారా అని కూడా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకూ ఈ జంట మాత్రం దీనిపై స్పందించలేదు. అటు హార్దిక్ గానీ, ఇటు నటాషాగానీ నోరు విప్పడం లేదు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా టీ20 వరల్డ్ కప్ లో ఆడుతున్నాడు.
నటాషాపై ట్రోలింగ్
ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా, ప్లేయర్ గా హార్దిక్ పాండ్యా దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో ముంబై టీమ్ చిట్ట చివరి స్థానంలో నిలిచింది. కెప్టెన్సీ మార్పుతోనే తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఫ్యాన్స్ అతన్ని ట్రోల్ చేశారు. అంతేకాదు ఈ వైఫల్యానికి నటాషాను కూడా ఫ్యాన్స్ బాధ్యురాలిని చేశారు. సోషల్ మీడియాలో ఆమెపైనా ట్రోలింగ్ నడిచింది.
ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లో హార్దిక్ ఎలా రాణిస్తాడన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం వైస్ కెప్టెన్ అతడు. బంగ్లాదేశ్ తో వామప్ మ్యాచ్ లో మాత్రం హార్దిక్ మంచి ఊపు మీద కనిపించాడు. బౌలింగ్ లో ఒక వికెట్ తీశాడు. ఇది కాస్త సానుకూలాంశమనే చెప్పాలి.