Best Web Hosting Provider In India 2024
అసెంబ్లీ ఎన్నికలపై మెజార్టీ జాతీయ, రాష్ట్ర మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ స్పష్టీకరణ
దేశ వ్యాప్త యంత్రాంగం ఉన్న టైమ్స్, దైనిక్ భాస్కర్ గ్రూప్‌ల ఎగ్జిట్ పోల్స్‌దీ అదే మాట
50 శాతం ఓట్లతో 14 లోక్‌సభ సీట్లు వైయస్ఆర్సీపీవేనన్న టైమ్స్‌నౌ–ఈటీజీ రీసెర్చ్
50 శాతం కంటే ఎక్కువ ఓట్లతో 15–17 లోక్‌సభ సీట్లు వైయస్ఆర్సీపీ గెలుస్తుందన్న దైనిక్ భాస్కర్(డీబీ)
రాష్ట్ర మీడియా, సెఫాలజిస్టులు, సర్వే సంస్థలు చేసిన 32 ఎగ్జిట్ పోల్స్‌లో 24 పోల్స్ వైయస్ఆర్సీపీ వైపే
బీజేపీ భజన చేసే ఇండియాటుడే గ్రూప్, ఎన్డీటీవీ, జీన్యూస్‌ల ఎగ్జిట్ పోల్స్‌లో మాత్రం భిన్నంగా వెల్లడి
‘ఈనాడు’తో భాగస్వామ్యం ఉన్న సీఎన్ఎన్ న్యూస్–18 ఎగ్జిట్ పోల్స్‌దీ అదే దారి
2021లో బెంగాల్లో, 2023లో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో తప్పులో కాలేసిన ఇండియాటుడే ఎగ్జిట్‌పోల్స్
తాజా ఎగ్జిట్‌పోల్స్‌లో కనీసం వైయస్ఆర్సీపీ గుర్తును కూడా ఫ్యాన్‌కు బదులు చీపురుగా చూపిన సంస్థ
గుర్తు తెలియకుండా, క్షేత్రస్థాయి స్థితిగతులు తెలుసుకోకుండా చేసిన సర్వే అని చెబుతున్న పరిశీలకులు
తాను ఏపీలో పర్యటించినప్పుడు సర్వేలో పేర్కొన్న పరిస్థితులు లేవని విభేదించిన జర్నలిస్టు రాజ్‌దీప్
మహిళలు, గ్రామీణ ఓటర్లు వైయస్ఆర్సీపీవైపే ఉన్నారని అదే చానెల్లో సర్వే నిర్వాహకుడితో వ్యాఖ్యలు
బీజేపీ నినాదమైన ‘400’ సీట్లకు ఆ పార్టీని తీసుకెళ్లటమే లక్ష్యంగా కొన్ని జాతీయ సంస్థల ఎగ్జిట్‌పోల్స్
రాజస్థాన్, హిమాచల్, హరియాణాలో ఉన్న స్థానాల కంటే అధిక స్థానాల్లో ఎన్డీఏ గెలుస్తుందని వెల్లడి
రాజధాని, స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్టు చేయడం వల్లే కూటమి గెలుస్తోందంటూ వ్యాఖ్యలు
కానీ.. ఎన్నికల ప్రచారంలో ఏ పార్టీ కూడా రాజధాని అంశాన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకోని తీరు
బాబును అరెస్టు చేసినప్పుడు రాష్ట్రంలో చిన్నపాటి బంద్‌లు, నిరసనలు కూడా జరిగిన దాఖలాల్లేవు
హైదరాబాద్‌లో ‘ఐటీ గ్రూప్’ పేరిట కూపన్లిచ్చి మరీ నిరసన చేయించిన ఒక సామాజిక వర్గం వ్యక్తులు
వాస్తవానికి రాష్ట్రంలో అన్నివర్గాలకూ మేలు చేసే పాలనతో పటిష్ఠంగా నిలబడ్డ వైయస్ఆర్సీపీ
తమ కుటుంబాలు బాగుపడ్డాయనే భావనతో ఆ పార్టీ వెనక అంతే బలంగా నిలబడ్డ ప్రజలు
ఇవన్నీ వైయస్ఆర్సీపీని స్పష్టంగా విజయంవైపు తీసుకెళుతున్నాయని తేల్చిన సర్వే సంస్థలు
సెఫాలజిస్టులపై బెదిరింపులకు దిగిన చంద్రబాబు, నారా లోకేశ్
అమరావతి: పేదలకు, పెత్తందారులకు.. విశ్వసనీయతకు, వంచనకు మధ్య పోరుగా దేశ వ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం ఖాయమని… ఏ లెక్కన చూసుకున్నా మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రావడం పక్కా అని అధిక శాతం జాతీయ, రాష్ట్ర మీడియా, సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పాయి.
రాష్ట్రంలో 50 శాతానికిపైగా ఓట్లతో వైఎస్సార్సీపీ తిరుగులేని విజయం సాధిస్తుందని ఇవన్నీ స్పష్టం చేశాయి. దేశ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో విస్తృత యంత్రాంగం ఉన్న టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌కు చెందిన టైమ్స్‌నౌ–ఈటీజీ రీసెర్చ్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో 50 శాతం ఓట్లతో వైయస్ఆర్సీపీ 14 లోక్‌సభ స్థానాలను చేజిక్కించుకుంటుందని.. ఎన్డీఏ కూటమి 48 శాతం ఓట్లతో 11 లోక్‌సభ స్థానాలకు పరిమితం అవుతుందని వెల్లడయింది.
టైమ్స్ ఆఫ్ ఇండియా తరహాలోనే దేశ వ్యాప్తంగా విస్తృత యంత్రాంగం ఉన్న దైనిక్ భాస్కర్ గ్రూప్… రాష్ట్రంలో 15–17 లోక్‌సభ స్థానాల్లో వైయస్ఆర్సీపీ ఘనవిజయం సాధిస్తుందని.. ఎన్డీఏ కూటమి 8–9 లోక్‌సభ స్థానాలకు పరిమితం అవుతుందని తన ఎగ్జిట్ పోల్స్ ద్వారా తేల్చిచెప్పింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో టీవీ9 వంటి మీడియా సంస్థలు, సెఫాలజిస్టులు, ఆరా వంటి ప్రతిష్ఠాత్మక సర్వే సంస్థలు నిర్వహించిన 32 ఎగ్జిట్ పోల్స్‌లో 24 ఎగ్జిట్ పోల్స్‌లో వైయస్ఆర్సీపీ ఘనవిజయం సాధించడం తథ్యమని.. మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టమయింది.
బీజేపీ భజన చేసే జాతీయ మీడియా ఎగ్జిట్ పోల్స్ తద్భిన్నం..
బీజేపీ భజన చేసే ఇండియాటుడే గ్రూప్, జీన్యూస్.. ఈనాడుతో భాగస్వామ్యం ఉన్న నెట్‌వర్క్‌లోని సీఎన్ఎన్ న్యూస్–18 వంటి రెండు మూడు జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ మాత్రం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని తేల్చడం గమనార్హం. రాజధాని అంశంతోపాటు స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్టు చేయడంపై ప్రజల్లో సానుభూతి వచి్చందని.. అదే ఎన్డీఏ కూటమి విజయానికి బాటలు వేసిందని ఆ సంస్థలు విశ్లేషించాయి. కానీ వాస్తవంగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో ఇటు వైయస్ఆర్సీపీగానీ అటు ఎన్డీఏగానీ రాజధాని అంశాన్ని ఎక్కడా పెద్దగా ప్రస్తావించలేదు.
ఇక స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు రాష్ట్రంలో ఎక్కడా చిన్నపాటి బంద్‌లు గానీ, ర్యాలీలు గానీ, నిరసనలు గానీ జరగనేలేదు. తప్పు చేశాడు కనక అరెస్టయ్యాడనే రీతిలో జనం స్పందించారు. దీంతో హైదరాబాద్‌లో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు కూపన్లు ఇచ్చి మరీ ‘ఐటీ ఉద్యోగుల’ పేరిట స్థానికంగా ఒక ఈవెంట్‌లా నిరసన కార్యక్రమం చేశారు. అలాంటిది ఈ రెండు అంశాలూ ప్రభావం చూపిస్తున్నాయని, అందుకే కూటమి గెలుస్తోందని ఈ జాతీయ ఛానెళ్లు చెప్పిన జోస్యం నూటికి నూరుపాళ్లూ తప్పవుతుందని రాష్ట్ర వ్యవహారాలను దగ్గర నుంచి పరిశీలిస్తున్న విశ్లేషకులు స్పష్టంగా చెబుతున్నారు.
కనీస జాగ్రత్తలు కూడా తీసుకోని ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మేదెలా?
విచిత్రమేంటంటే ‘ఇండియా టుడే– మై యాక్సిస్’ సంస్థ శనివారంనాడు దేశవ్యాప్త ఎగ్జిట్‌పోల్స్‌ను వెలువరించింది. దీన్లో బీజేపీ నినాదమైన ‘400’ సీట్లకు ఆ పార్టీని చేర్చటమే లక్ష్యంగా ఒకో రాష్ట్రంలో స్వీప్ అంటూ ముందుకు వెళ్లిపోయినట్లు స్పష్టంగా కనిపించింది. పైపెచ్చు రాష్ట్రంలో వైయస్ఆర్సీపీకి 2 నుంచి 4 లోక్‌సభ స్థానాలు వస్తాయని మాత్రమే చెప్పిన ఇండియా టుడే సంస్థ… ఆ సందర్భంగా వైయస్ఆర్సీపీ గుర్తును కూడా ఆప్ గుర్తయిన చీపురుగా చూపించింది. విశేషమేంటంటే దీన్నే తెలుగుదేశం పార్టీ తన ట్విటర్ ఖాతాలోనూ పోస్ట్ చేసుకుంది.
మరి పార్టీ గుర్తు విషయంలో కూడా జాగ్రత్తలు పాటించకుండా చేసిన ఈ ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మేదెలా? ఇక కొన్ని రాష్ట్రాల విషయంలోనైతే కొన్ని ఎగ్జిట్ పోల్స్ అక్కడ వాస్తవంగా ఉన్న మొత్తం స్థానాలకన్నా ఎక్కువ స్థానాలు ఎన్డీఏ గెలుస్తుందని చూపించటాన్ని ఇప్పటికే ట్విటర్లో పలువురు ట్రోల్ చేస్తున్నారు కూడా. ఇదే ఇండియాటుడే– మై యాక్సిస్ సంస్థ 2021లో బెంగాల్లో చేసిన ఎగ్జిట్‌పోల్స్, 2023లో ఛత్తీస్గడ్, రాజస్థాన్‌లలో చేసిన ఎగ్జిట్‌పోల్స్ పూర్తిగా రివర్సయ్యాయనేది ఇక్కడ గమనార్హం.
నిజానికి ఈ సర్వేను ప్రసారం చేస్తున్నపుడు ‘ఇండియాటుడే’ ఛానెల్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ సర్వే ఫలితాలతో విభేదించారు కూడా. తాను ఆంధ్రప్రదేశ్‌లో క్షేత్ర స్థాయిలో పర్యటించానని, సర్వేలో చెప్పినట్లుగా పరిస్థితులు అక్కడ లేవని పేర్కొన్నారు. గ్రామీణ, మహిళా ఓటర్లు పూర్తిగా వైయస్ఆర్సీపీవైపే ఉన్నారని, అది తన పర్యటనలో కనిపించిందని సర్దేశాయ్ చెప్పగా… చంద్రబాబు నాయుడి అరెస్టు పట్ల జనంలో సానుభూతి పెల్లుబుకిందని, అదే కూటమి విజయానికి కారణమవుతోందని ఎగ్జిట్‌పోల్స్ నిర్వహించిన ప్రదీప్ గుప్తా వ్యాఖ్యానించడం గమనార్హం. అంతేకాదు.
తాజాగా బీజేపీ కూటమికి దేశంలో అత్యంత భారీగా స్థానాలు వస్తాయని పేర్కొన్న జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్‌లో చిత్రవిచిత్రమైన తప్పులు కనిపించాయి. ఇండియాటుడే గ్రూప్‌లోని ఆజ్ తక్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో తమిళనాడులో కాంగ్రెస్ 9 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తే.. అక్కడ 13–15 లోక్‌సభ స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధిస్తుందని తేల్చడంతో చర్చలో పాల్గొన్న వారే విస్తుపోయారు. రాజస్థాన్‌లో ఉన్నదే 25 లోక్‌సభ స్థానాలైతే.. ఆ రాష్ట్రంలో 33 స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్‌లో టుడేస్ చాణక్య వెల్లడించడం గమనార్హం.
జార్ఖండ్‌లో సీపీఐ (ఎంఎల్) ఒక స్థానంలో పోటీ చేస్తే.. రెండు నుంచి మూడు స్థానాల్లో ఆపార్టీ విజయం సాధిస్తుందని ఆజ్‌తక్ ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడించింది. హర్యానాలో ఉన్నదే 10 లోక్‌సభ స్థానాలైతే 16–19 స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని జీన్యూస్ ఎగ్జిట్ పోల్స్‌లో తేల్చడం విస్మయకరమే. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో ఉన్నవే నాలుగు లోక్‌సభ స్థానాలైతే.. అక్కడ ఎన్డీఏ 6–8 స్థానాల్లో విజయం సాధిస్తుందని జీన్యూస్ తేల్చింది. విశేషమేంటంటే ఈ సంస్థలన్నీ రాష్ట్రంలో కూటమికే మెజారిటీ లోక్‌సభ స్థానాలు దక్కుతున్నాయని చెప్పాయి.
లోతుగా పరిశీలించినట్లయితే ఈ జాతీయ మీడియా సంస్థలకు రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో ఎలాంటి యంత్రాంగమూ లేదు. వీటిలో చాలావరకూ ప్రజల అభిప్రాయాన్ని ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా తెలుసుకుని.. వాటినే ఎగ్జిట్ పోల్స్‌గా వెల్లడించాయి. గ్రామీణ ఓటర్లు, మహిళలు, వైయస్ఆర్సీపీకి ఎప్పుడూ అండగా ఉండే బలహీనవర్గాలు ఇలాంటి సర్వేల్లో పాల్గొనే అవకాశం తక్కువ. దీన్ని బట్టి చూస్తే.. ఈ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్… జూన్ 4న పూర్తి స్థాయిలో తిరగబడతాయని స్పష్టంగానే చెప్పొచ్చు.
వైయస్ఆర్సీపీ ఓడిపోయే అవకాశమే లేదు..
రాష్ట్రంలో ఎక్కడికక్కడ పరిశ్రమలను తెస్తూ… గ్రామ స్థాయిలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూ… ఐదేళ్లుగా కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలు.. విప్లవాత్మక సంస్కరణలను జనం పెద్ద ఎత్తున ఆదరించారు. ఈ విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు నిర్వహించిన ‘సిద్ధం’ సభలతో రుజువయింది. అర్హతే ప్రమాణికంగా 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలను అందించారు. సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా లబ్ధి పొందిన కుటుంబాల్లో 60 శాతానికి పైగా వైయస్ఆర్సీపీకి దన్నుగా నిలుస్తున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి.
గ్రామీణ ప్రాంత ప్రజలు.. మహిళల్లో వైయస్ఆర్సీపీకి అత్యంత ఆదరణ ఉందని.. ఇదే ఆపార్టీ విజయానికి బాటలు వేస్తుందని ఇవే జాతీయ మీడియా సంస్థలు గతంలో విశ్లేషించాయి. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక శాతం ఓట్లు పోల్ కావడం.. మహిళలు ఎన్డీఏ కూటమి కంటే వైయస్ఆర్సీపీకి 12 శాతం అధికంగా వేశారని.. ఇది ఆపార్టీ ఘనవిజయానికి బాటలు వేస్తుందని ఆరా మస్తాన్, చాణక్య పార్ధదాస్‌లు కుండబద్ధలు కొట్టారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే తాము ఓడిపోయే అవకాశమే లేదని వైయస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
కౌంటింగ్ నాడు అక్రమాలకు తెగబడటానికే!
రాష్ట్రంలో వైయస్ఆర్సీపీకి అనుకూలంగా ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు వస్తుండటంతో పలువురు సెఫాలజిస్టులను చంద్రబాబు నాయుడు, లోకేశ్ బెదిరించినట్లు వాళ్లే వ్యాఖ్యానిస్తున్నారు. ఓ సర్వే సంస్థ లోకేశ్ బెదిరింపులను తట్టుకోలేక… ఫలితాలను అట్నుంచి ఇటు మార్చి కూటమి గెలుస్తున్నట్లుగా ఇచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎలాగూ రెండ్రోజుల్లో తేలే ఫలితాల కోసం చినబాబు– చంద్రబాబు ఎందుకు ఇంతలా బెదిరింపులకు పాల్పడుతున్నారనే అంశాన్ని నిపుణులు లోతుగా విశ్లేషిస్తున్నారు.
తామే గెలుస్తున్నామనే భ్రమలు కల్పించటం ద్వారా వైయస్ఆర్సీపీ క్యాడర్లో నిరుత్సాహాన్ని నింపి… కౌంటింగ్ రోజున అవసరమైతే వారిని ప్రలోభపెట్టో, బెదిరించో తమ పబ్బం గడుపుకోవాలనేది తండ్రీ కొడుకుల ఆలోచనగా చెబుతున్నారు. ఈసీ ఎలాగూ తమకే సహకరిస్తుంది కనక ఎలాంటి దారుణాలకైనా వెనకాడకూడదన్నది వీళ్ల ఆలోచనగా చెబుతున్నారు. అయితే పురిట్లోనే సంధికొట్టినట్లు చాలామంది సెఫాలజిస్టులు వీరి బెదిరింపులకు లొంగకుండా వైయస్ఆర్సీపీ గెలుస్తున్నదని చెప్పటం ‘బాబు’లిద్దరికీ మింగుడుపడటం లేదు.